1952లో జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున 11 ఏళ్ల ఆర్తి సాహా పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్ల తర్వాత బెంగళూరు స్విమ్మర్ ధీనిధి దేశింఘు పారిస్ ఒలింపిక్స్‌లో ఈత పోటీలో పాల్గొనే అవకాశంపొందింది. 9వ తరగతి చదువుతున్న «ధీనిధి ఈతలో దేశీయ రికార్డులు సొంతం చేసుకుంది. కాని పారిస్ కల కోసం ఆమె చేసిన కృషి ఎట్టకేలకు ఆమె కోరుకున్నది సాధించి పెట్టింది
‘నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు క్లాసులో చాలా బిడియంగా ఉండేదాన్ని. చురుగ్గా లేనని మా అమ్మానాన్నలు ఈతలో చేర్పించారు. ముందు ఈతకు భయపడ్డాను. తర్వాత స్విమింగ్ పూల్ నా ఫ్రెండ్ అయ్యింది. ఆ తర్వాత ఈత నా ΄్యాషన్ అయ్యింది’ అంటుంది 14 ఏళ్ల «ధీనిధి దెశింఘు.
తొమ్మిదవ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి మరికొద్ది రోజుల్లో పారిస్‌లో మొదలు కానున్న ఒలింపిక్స్‌లో మన దేశ ప్రతినిధిగా పాల్గొననుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత ఇంత చిన్న వయసు అమ్మాయి మన దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొననుండటం ఒక విశేషం. 1952 ఒలింపిక్స్‌లో 11 ఏళ్ల బాలిక ఆర్తి సాహా మన దేశం నుంచి పాల్గొంది.
యూనివర్సాలిటీ కోటా
ఈసారి మన దేశం నుంచి ఎవరూ ఒలింపిక్స్‌లో ఈత పోటీలకు నేరుగా అర్హతపొందలేదు. ‘ఒలింపిక్ సెలక్షన్ టైమ్’ ప్రదర్శించి ‘ఇంటర్నేషనల్ స్విమింగ్ ఫెడరేషన్’ ద్వారా అయినా ఆహ్వానాన్నిపొందలేదు. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ వారు ఆయా దేశాలకు ‘యూనివర్సాలిటీ ప్లేసెస్’ కింద ఇద్దరిని పంపమని అనుమతి ఇస్తారు. జాతీయంగా ఉత్తమ ప్రతిభ ఉన్న ఇద్దరిని అలా పంపవచ్చు. ఈ ‘కోటా’ను ఉపయోగించుకుని మన దేశం ఉంచి పురుషుల ఈత కోసం శ్రీహరి నటరాజ్‌ను, స్త్రీల ఈత కోసం «ధీనిధిని ఎంపిక చేసి పంపుతున్నారు. ఒలింపిక్స్ కమిటీ వీరు పాల్గొనడాన్ని అనుమతించింది. యూనివర్సాలిటీ ప్లేసెస్ కింద «ధీనిధి ఎంపిక సాగినా అంత చిన్న వయసులో ఆ అవకాశంపొందడం కూడా ఘనతే.
స్ట్రయిట్ ఆర్మ్ టెక్నిక్
బెంగళూరుకు చెందిన «ధీనిధి అక్కడి డాల్ఫిన్ ఆక్వాటిక్స్‌లో ఈత కోసం చేరినప్పుడు పూల్‌లో చేపపిల్లలా ఈదుతున్న ఆ అమ్మాయిని చూసి కోచ్ మధుకుమార్ ఈ పిట్ట కొంచెం కూత ఘనం అని కనిపెట్టాడు. ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. స్ట్రయిట్ ఆర్మ్ టెక్నిక్‌తో ఈత కొట్టే కొద్దిమంది భారతీయ స్విమ్మర్‌లలో «ధీనిధి నిలిచింది.
12 ఏట నుంచే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ‘నా కంటే వయసులో రెండింతలు ఎక్కువ ఉన్నవారు నా పక్కన ఉంటే భయం వేసేది. కాని పూల్‌లో దిగాక ఈత మీదే నా దృష్టి’ అంటుంది «ధీనిధి. గోవాలో జరిగిన 2023 నేషనల్ గేమ్స్‌లో ఈతలో కర్నాటక 7 స్వర్ణాలు సాధించడంలో ధినిధి కీలకంగా నిలిచింది. అదే డాల్ఫిన్ ఆక్వాటిక్స్‌లో ద్రోణాచార్య అవార్డీ నిహార్ అమీన్ శిక్షణ మొదలయ్యాక 200 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో ఆమె మరింత ప్రతిభ కనబరిచి 02:04–24 సెకన్ల రికార్డు సొంతం చేసుకుంది.
కఠోర శ్రమ
‘ఈ అవకాశం నాకు ఊరికే రాలేదు. ఫ్రెండ్స్, సినిమా, ఫోన్, వేరే ఆటలు అన్నీ పక్కనపెట్టి రోజుకు ఆరు గంటలు సాధన చేశాను. ఇందులో జిమ్ ఉంటుంది, ఈత కూడా ఉంటుంది. అప్పుడప్పుడు బాగా ఒంటరిగా అనిపించేది. కాని ఒలింపిక్స్‌లో పాల్గొనే నా కల కోసం ముందుకు సాగేదాన్ని. ఒలింపిక్స్‌లో 7సార్లు గోల్డ్ సాధించిన లెజెండ్ స్విమ్మర్ కేటీ లెడెకి నాకు స్ఫూర్తి. ఆమెను పారిస్ ఒలింపిక్స్‌లో కలవబోతున్నానన్న ఊహే నాకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. ఆమె కోసం కొన్ని కానుకలు కూడా తీసుకెళుతున్నాను’ అంది ధీనిధి. పారిస్ ఒలింపిక్స్‌లో «ధీనిధి ఏ మెడల్ సాధించినా ఆమెపొందబోయే ప్రశంసలు ఒక సముద్రాన్నే తలపించకమానవు. వాటిని ఈదుకుంటూ ఆమె మరింత ముందుకు పోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment