
డమాస్కస్: సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా తిరుగుబాటు నేత అహ్మెద్ అల్ షరా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాత్కాలిక శాసనసభను ఏర్పాటు చేసే బాధ్యతను షరాకు అప్పగించినట్లు సిరియా సైనిక అధికారి హసన్ అబ్దెల్ ఘనీ ప్రకటించారు.
షరా నాయ కత్వం వహిస్తున్న హయత్ తహ్రీర్ అల్–షామ్ (హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగు బాటు కూటమి మెరుపు దాడులు చేసి గత ఏడాది డిసెంబర్ ఎనిమిదో తేదీన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనకు చరమగీతం పాడిన విషయం విదితమే.