'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటున్న బుజ్జాయి! | Toddler snowboards like a pro | Sakshi
Sakshi News home page

'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటున్న బుజ్జాయి!

Published Mon, Feb 8 2016 2:30 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటున్న బుజ్జాయి!

'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటున్న బుజ్జాయి!

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ 'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటూ అద్భుతంగా స్కేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రేంజ్ లో ఓ బుజ్జాయిలో మంచులో స్కేటింగ్ చేస్తూ అదరగొడుతోంది. నిండా ఏడాదిన్నర వయస్సు కూడా లేని ఆ చిన్నారి నోటిలో పాలపీక పెట్టుకొని అలవోకగా మంచుపై స్కేటింగ్ చేస్తూ.. చూసిన వాళ్లని అబ్బురపరుస్తోంది.

అమెరికా ఉటాలోని నార్త్ సాల్ట్ లేక్ కు చెందిన 14 నెలల సోలాన్ హెండర్సన్ మంచు కనబడితే చాలు మురిసిపోతుంది. నెల కిందటే ఈ చిన్నారి బుడిబుడి తప్పటడుగులు వేసే ప్రయత్నం చేసింది. అప్పుడు తమ ముద్దుల బిడ్డ కోసం జాష్ హెండర్సన్, కేటీ దంపతులు స్కేటింగ్ షూస్ కొన్నారు. ఈ ఇద్దరు దంపతులు కూడా స్నోబోర్డింగ్ క్రీడాకారులు. దీంతో వారు సోలాన్ కోసం ఒక చిన్నపాటి స్కేట్ బోర్డు కొనుగోలు చేసి.. అందులో క్రమంగా తనకు శిక్షణ ఇచ్చారు.  13 నెలలకే సోలాన్ కు స్కేటింగ్ షూస్ తొడిగి మంచులో విడిచిపెట్టారు. సరిగ్గా నిలబడటానికి తడబడుతున్న సోలాన్ మంచులో స్కేటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఫ్రొఫెషనల్ ఆటగాడిలో దూసుకుపోతోంది. తాజాగా పార్క్ సిటీ మౌంటైన్ రిసార్టులో సోలాన్ చేసిన స్కేటింగ్ విన్యాసాలను దంపతులు తాజాగా వీడియోలో రికార్డు చేశారు. ఇలా వాళ్లు తమ చిన్నారి వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారో లేదా ఇది వైరల్ అయింది.

సహజంగా పిల్లలు 12 నుంచి 15 నెలల వయస్సులో బుడి బుడి అడుగుల వేసే ప్రయత్నం చేస్తారు. కానీ 14 నెలలకు నిలకడగా స్కేట్ బోర్డు మీద నిలబడటమే కాదు మంచులో సోలాన్ అలవోకగా దూసుకుపోవడం ఇప్పుడు అబ్బురపరుస్తోంది. ఇప్పుడు తన స్నో బోర్డింగ్ సాహసాలు నెటిజన్లకు చూపించేందుకు సోలాన్ యూట్యూబ్ లో ఓ చానెల్ కూడా పెట్టింది. ఈ చానెల్ లో సోలాన్ తండ్రి అపలోడ్ చేస్తున్న వీడియోలను చూసి భవిష్యత్తులో ఒక ఒలింపియన్ చాంపియన్ తమకు దొరికినట్టేనని అమెరికన్లు మురిసిపోతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement