snowboarding
-
ఇలాంటి ఫొటోలు పెట్టకూడదని తెలియదా?
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఒలింపిక్ స్నోబోర్డ్ ఛాంపియన్ టోరా బ్రైట్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో వివాదాస్పదంగా మారింది. తన ఇంటి ఆవరణలో అర్ధనగ్నంగా శీర్షాషనం వేసి తన చిన్నారికి పాలు ఇస్తున్న ఫొటోను టోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఆమె పెట్టిన ఫోటోపై నెటిజన్లు స్పందిస్తూ ట్రోలింగ్ చేశారు. ''నీకు సిగ్గులేదా.. ఇలాంటి ప్రైవేట్ ఫొటోలు పోస్ట్ చేయకూడదని తెలియదా.. పబ్లిసిటీ కోసం అమ్మతనాన్ని అవమానిస్తావా..'' అంటూ పలువురు కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్లపై టోరా తను చేసిన పనిని సమర్థించుకుంటూ స్పందించడం విశేషం.'' నా ఫొటోపై వచ్చిన కామెంట్లు నాకు బాధ కలిగించాయి. నేను మాతృత్వం కలిగించే ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని కనుగొంటాను. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఉంటారు. అందులో తప్పు.. ఒప్పు అంటూ ఏమీ ఉండదు. మాతృత్వం స్వచ్ఛమైనది. పవిత్రమైన మథర్స్ క్లబ్లో చేరినందుకు ఇప్పుడు నన్ను నేను ఓ వండర్ ఉమెన్‌గా భావిస్తున్నా'' అంటూ రిప్లై ఇచ్చింది. కాగా టోరా బ్రైట్ 2010 వాంకోవర్, 2014 సోచి వింటర్ ఒలింపిక్స్‌లో స్నోబోర్డింగ్ విభాగంలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది. చదవండి: నన్ను, నా భార్యను చంపుతామని బెదిరించారు 'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో' -
స్విట్జర్లాండ్ టూర్‌కే భారతీయుల అధిక ప్రాధాన్యత
స్విట్జర్లాండ్ : మంచు ప్రదేశాలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో భారతీయులైతే మరి ముఖ్యంగా ఇష్టపడుతారు. ఈ విషయాన్నే కొన్ని పర్యాటక సర్వేలు కూడా తేల్చిచెబుతున్నాయి. మంచు ప్రదేశాల పర్యాటక జాబితాలో ముందుండే స్విట్జర్లాండ్‌కు మన భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారంటా. 59 శాతం మంది భారతీయులు సెలవు రోజుల్లో పర్యటించడానికి ఎక్కువగా స్విట్జర్లాండ్‌ను ఎంచుకోవడంలో ఆసక్తిని చూపుతున్నట్లు క్లబ్ మెడ్ చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ క్లబ్ మెడ్ సర్వే ప్రకారం సెలవుల రోజుల్లో భారతీయులు ఎక్కువ మంది స్విట్జర్లాండ్‌లో టూరిస్టులుగా ఉంటున్నారని, దాదాపు 96 శాతం భారతీయ ప్రజలు రాబోయే మూడేళ్లలో యురోపియన్ మంచు ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో అధిక సంఖ్యలో భారతీయులు విహరయాత్రకు యురోపియన్ మంచు ప్రాంతాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టూరిజంలో వైవిధ్యమైన, సాహోసోపేతమైన, ప్రయోగత్మకంగా ఉండే మంచు ప్రదేశాల వైపే పర్యటించడానికి భారతీయులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని గ్లోబల్ స్నో హాలిడే లీడర్, ఆసియా-పసిఫిక్ స్నో బ్రాండ్ స్టడీ 2019(ఏపీఏసీ) నివేదిక పేర్కొంది. ఆసియా-పసిఫిక్ మంచు క్రీడలను భారతీయులు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. స్నో బోర్డింగ్, స్కైయింగ్ స్నో రైడింగ్లు అత్యంత ప్రజాదరణ పోందిన మంచు క్రీడలు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్-మోర్టిజ్ రోయ్ సోలైల్, ఇటలీలోని సెర్వినియా, ఫ్రాన్స్‌లోని లెస్ డ్యూక్స్‌లోని కోన్ని మంచు ప్రదేశాలు స్నో స్కైయ్ డ్రైవింగ్ పర్యాటక ప్రదేశాలు. ఈ ప్రదేశాలకు ప్రతి ఏటా 75 శాతం భారతీయులు వస్తున్నారని, వారు కేవలం స్నో డ్రైవింగ్ కోసమే ఇక్కడికి రావడానికి ఆసక్తిని చూపుతున్నారని ఏపీఏసీ సర్వే వెల్లడించింది. ప్రయాణంలో కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ప్రయాణ విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా కుటుంబానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబంతో కలసి పర్యటించడానికి ఇష్టపడుతున్నట్లు సర్వేలో తెలింది. అన్ని వయసుల వారు సరదగా గడపడానికి, అనుగుణంగా ఉండేటువంటి పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. సోలోగా టూరీస్టుల కంటే 27 శాతం భారతీయులు మూడు తరాలతో కుటుంబీకులతో కలిసి పర్యాటించేందుకు ఇష్టపడే భారతీయులు 27 శాతం ఉన్నారని, ఇది ఆసియా-పసిఫీక్ సగటు 18 శాతాన్ని అధిగమించినట్లు వెల్లడైంది. -
మంచు ప్రపంచం
అలాస్కా స్కీయింగ్, స్నోబోర్డింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు... జీవితంలో ఒక్కసారైనా హెలీ స్కీయింగ్ చేయాలని అనుకోకుండా ఉంటారా? ప్రత్యేక హెలికాప్టర్ గైడ్ చేస్తుండగా... 18వేల అడుగుల ఎత్తు నుంచి స్కీయింగ్ చేయటమంటే...! జీవితాన్ని మార్చేసే అనుభవమిది. డే స్కీయింగ్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమంగా భావించే అలాస్కాలో... దీని చార్జీలు ఒకరికి 1,275 డాలర్ల నుంచి మొదలవుతాయి. అలాస్కా రాష్ట్రం అమెరికాలో భాగమే అయినా... చూస్తే అదొక్కటే ఒక ప్రపంచంలా ఉంటుంది. అలాస్కాలో ఇప్పటికీ మనుషులెవరూ వెళ్లని ప్రాంతాలున్నాయి మరి. క్రూయిజ్‌లో వెళ్లినా, ఏదో ఒక కారవాన్‌ను (ఆర్వీ) అద్దెకు తీసుకుని రోడ్డు మార్గంలో వెళ్లినా... ఆ అనుభూతే వేరు. స్థానిక అలాస్కన్ తెగలతో పాటు ఎలుగుబంట్లు, తోడేళ్ల వంటి ‘బిగ్ ఫైవ్’ వన్య మృగాలనూ చూడొచ్చు. ఇక డెనాలీ నేషనల్ పార్క్‌కు వెళితే అదో ప్రపంచమే. అలాస్కాలో మిస్ కాకూడనివి... * డెనాలీ నేషనల్ పార్క్ మొత్తాన్ని హెలికాప్టర్లో చుట్టే ‘ఫ్లైట్ సీయింగ్’. - ప్రిన్స్ విలియం సౌండ్ లేదా కెనాయ్ ఫోర్డ్స్‌లో గ్లేసియర్ టూర్. * యాంకరేజ్ సిటీలోని అత్యుత్తమ మ్యూజియంల సందర్శన. * మంచులో సాహసాలు, క్రీడలు. అలాస్కాను చేరుకునేదిలా? * అలాస్కాలోని డెనాలీ నేషనల్ పార్క్‌కు వెళ్లాలన్నా, మరో ప్రాంతానికి వెళ్లాలన్నా విమానంలో యాంకరేజ్ విమానాశ్రయాన్ని చేరుకోవాలి. అక్కడి నుంచి డెనాలీ నేషనల్ పార్క్ దాదాపు 200 మైళ్ల దూరం. నాలుగు గంటలు పడుతుంది. ముందుగా బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి ఒకరికి రూ.1.1 నుంచి 1.2 లక్షల వరకూ విమాన ఛార్జీలుంటాయి. అక్కడ ఆర్వీని అద్దెకు తీసుకున్నా, క్రూయిజ్ ద్వారా వెళ్లినా ఛార్జీలు కాస్తంత ఎక్కువే. * దాదాపు అమెరికాకు వెళ్లే విమానాలన్నీ ఢిల్లీ, ముంబాయి మీదుగా వెళతాయి కనక అక్కడి నుంచి అమెరికాకు వెళ్లటం కాస్తంత ఈజీ. ఇక అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నుంచి యాంకరేజ్ (అలాస్కా) కు బోలెడన్ని విమానాలుంటాయి. ఇలా ఢిల్లీ నుంచి ప్లాన్ చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.85వేలలోపే ఉంటాయి. * వీటన్నిటికన్నా ముందు... అమెరికాకు వెళ్లాలంటే వీసా ఉండాలి. టూరిస్టులక్కూడా అమెరికా వీసా అంత తేలిగ్గా రాదు. అందుకని ఇలాంటి యాత్రల్ని బాగా ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు వెళ్లొచ్చు? * జూన్ మధ్య నుంచి ఆగస్టు వరకూ టూరిస్టుల కాలం. ధరలు కూడా ఎక్కువే. * మే మధ్య నుంచి జూన్ మధ్య వరకూ కాస్త ధరలు తక్కువగా ఉంటాయి. ఒకోసారి 25 శాతం డిస్కౌంట్ కూడా దొరుకుతుంటుంది. * ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబరు మధ్య వరకూ కూడా డిస్కౌంట్ల కాలమే. * ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మధ్య వరకూ చలికాలం. బోలెడంత మంచు. ఐస్ స్పోర్ట్స్ కేంద్రాలన్నీ పూర్తిగా పనిచేసేది ఈ కాలంలోనే. -
'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటున్న బుజ్జాయి!
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ 'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటూ అద్భుతంగా స్కేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రేంజ్ లో ఓ బుజ్జాయిలో మంచులో స్కేటింగ్ చేస్తూ అదరగొడుతోంది. నిండా ఏడాదిన్నర వయస్సు కూడా లేని ఆ చిన్నారి నోటిలో పాలపీక పెట్టుకొని అలవోకగా మంచుపై స్కేటింగ్ చేస్తూ.. చూసిన వాళ్లని అబ్బురపరుస్తోంది. అమెరికా ఉటాలోని నార్త్ సాల్ట్ లేక్ కు చెందిన 14 నెలల సోలాన్ హెండర్సన్ మంచు కనబడితే చాలు మురిసిపోతుంది. నెల కిందటే ఈ చిన్నారి బుడిబుడి తప్పటడుగులు వేసే ప్రయత్నం చేసింది. అప్పుడు తమ ముద్దుల బిడ్డ కోసం జాష్ హెండర్సన్, కేటీ దంపతులు స్కేటింగ్ షూస్ కొన్నారు. ఈ ఇద్దరు దంపతులు కూడా స్నోబోర్డింగ్ క్రీడాకారులు. దీంతో వారు సోలాన్ కోసం ఒక చిన్నపాటి స్కేట్ బోర్డు కొనుగోలు చేసి.. అందులో క్రమంగా తనకు శిక్షణ ఇచ్చారు. 13 నెలలకే సోలాన్ కు స్కేటింగ్ షూస్ తొడిగి మంచులో విడిచిపెట్టారు. సరిగ్గా నిలబడటానికి తడబడుతున్న సోలాన్ మంచులో స్కేటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఫ్రొఫెషనల్ ఆటగాడిలో దూసుకుపోతోంది. తాజాగా పార్క్ సిటీ మౌంటైన్ రిసార్టులో సోలాన్ చేసిన స్కేటింగ్ విన్యాసాలను దంపతులు తాజాగా వీడియోలో రికార్డు చేశారు. ఇలా వాళ్లు తమ చిన్నారి వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారో లేదా ఇది వైరల్ అయింది. సహజంగా పిల్లలు 12 నుంచి 15 నెలల వయస్సులో బుడి బుడి అడుగుల వేసే ప్రయత్నం చేస్తారు. కానీ 14 నెలలకు నిలకడగా స్కేట్ బోర్డు మీద నిలబడటమే కాదు మంచులో సోలాన్ అలవోకగా దూసుకుపోవడం ఇప్పుడు అబ్బురపరుస్తోంది. ఇప్పుడు తన స్నో బోర్డింగ్ సాహసాలు నెటిజన్లకు చూపించేందుకు సోలాన్ యూట్యూబ్ లో ఓ చానెల్ కూడా పెట్టింది. ఈ చానెల్ లో సోలాన్ తండ్రి అపలోడ్ చేస్తున్న వీడియోలను చూసి భవిష్యత్తులో ఒక ఒలింపియన్ చాంపియన్ తమకు దొరికినట్టేనని అమెరికన్లు మురిసిపోతున్నారు.