
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఒలింపిక్ స్నోబోర్డ్ ఛాంపియన్ టోరా బ్రైట్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో వివాదాస్పదంగా మారింది. తన ఇంటి ఆవరణలో అర్ధనగ్నంగా శీర్షాషనం వేసి తన చిన్నారికి పాలు ఇస్తున్న ఫొటోను టోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఆమె పెట్టిన ఫోటోపై నెటిజన్లు స్పందిస్తూ ట్రోలింగ్ చేశారు. ''నీకు సిగ్గులేదా.. ఇలాంటి ప్రైవేట్ ఫొటోలు పోస్ట్ చేయకూడదని తెలియదా.. పబ్లిసిటీ కోసం అమ్మతనాన్ని అవమానిస్తావా..'' అంటూ పలువురు కామెంట్లు చేశారు.
అయితే ఈ కామెంట్లపై టోరా తను చేసిన పనిని సమర్థించుకుంటూ స్పందించడం విశేషం.'' నా ఫొటోపై వచ్చిన కామెంట్లు నాకు బాధ కలిగించాయి. నేను మాతృత్వం కలిగించే ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని కనుగొంటాను. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఉంటారు. అందులో తప్పు.. ఒప్పు అంటూ ఏమీ ఉండదు. మాతృత్వం స్వచ్ఛమైనది. పవిత్రమైన మథర్స్ క్లబ్‌లో చేరినందుకు ఇప్పుడు నన్ను నేను ఓ వండర్ ఉమెన్‌గా భావిస్తున్నా'' అంటూ రిప్లై ఇచ్చింది. కాగా టోరా బ్రైట్ 2010 వాంకోవర్, 2014 సోచి వింటర్ ఒలింపిక్స్‌లో స్నోబోర్డింగ్ విభాగంలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది.
చదవండి: నన్ను, నా భార్యను చంపుతామని బెదిరించారు
Comments
Please login to add a commentAdd a comment