olympic champion
-
ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అథ్లెట్.. 32 ఏళ్ల టోరి బోవి హఠాన్మరణం
ఫ్లోరిడా: ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ మహిళా అథ్లెట్ టోరి బోవి (అమెరికా) హఠాన్మరణం చెందింది. ఫ్లోరిడాలోని ఆమె నివాసంలో విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఆమె మరణానికి గల కారణాలను ఇంకా వెల్లడి కాలేదు. కొంత కాలంగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతోందని సమాచారం. 32 ఏళ్ల టోరి బోవి 2016 రియో ఒలింపిక్స్‌లో 4*100 మీటర్ల రిలేలో స్వర్ణం, 100 మీటర్లలో రజతం, 200 మీటర్లలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 2015 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లలో కాంస్యం నెగ్గిన ఆమె... 2017లో లండన్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. అంతేకాకుండా 4*100 మీటర్ల రిలే పసిడి పతకం సొంతం చేసుకున్న అమెరికా జట్టులో సభ్యురాలిగా ఉంది. లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానం డైమండ్ లీగ్ మీట్లో ఆమె నాలుగుసార్లు 100 మీటర్లలో, నాలుగుసార్లు 200 మీటర్లలో స్వర్ణ పతకాలను సాధించింది. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టోరి బోవి 100 మీటర్ల విభాగంలో సెమీఫైనల్‌కు చేరినా ఆమె సెమీఫైనల్ రేసులో పోటీపడలేదు. ఈ మెగా ఈవెంట్లోనే ఆమె లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆమె మరో అంతర్జాతీయ ఈవెంట్లో పోటీపడలేదు. చదవండి: PBKS Vs MI: 4 వికెట్లే కోల్పోయి 7 బంతులు ఉండగానే ఛేదన -
అథ్లెట్ నీరజ్ చోప్రాపై ప్రశంసలు.. ‘భారతీయుడు’ అంటే అది!
అథ్లెట్ సుబేదార్ నీరజ్ చోప్రా ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. దేశానికి బంగారు పతకం అందించి కోట్లాది మందిని తల ఎత్తుకునేలా చేశాడు. తాజాగా మరోసారి నీరజ్ చోప్రా వార్తల్లో నిలిచాడు. తన వినయంతో అందరి మన్ననలు అందుకున్నాడు. కేవలం ఆడిగాడిగానే కాకుండా.. మంచి ప్రవర్తనతో ఫ్యాన్స్, నెటిజన్లతో శభాష్ అనిపించుకున్నాడు. ఓ లీగ్‌లో పాల్గొనేందుకు నీరజ్ చోప్రా.. స్టాక్‌హోమ్‌కు వెళ్లాడు. లీగ్ అనంతరం అక్కడ.. నోరజ్ చోప్రా తన అభిమానులతో ఫొటోలు దిగుతున్నాడు. ఎంతో వినయంతో మర్యాదపూర్వకంగా తన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెప్పాడు. ఆ తర్వాత వారికి కరచాలనం చేశాడు. ఫొటోలు దిగిన అనంతరం వారిలో ఓ వృద్దుడు కనిపించడంతో ఒక్కసారిగా తల వంచి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో, అతడి మర్యాదను చూసి అక్కడున్న వారంతా నీరజ్ చోప్రాను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. నీరజ్ చోప్రా వినయానికి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన యూజర్.. నీరజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. నీరజ్ చోప్రా.. డౌన్ టు ఎర్త్ వ్యక్తివి అంటూ కొనియాడాడు. So down to earth this person @Neeraj_chopra1 ❣️Took blessing from an elderly fan. That speaks volumes. Love you ❤️ pic.twitter.com/jjo9OxHABt — Your ❤️ (@ijnani) June 30, 2022 ఇది కూడా చదవండి: సింధుకు మళ్లీ నిరాశ -
ఇలాంటి ఫొటోలు పెట్టకూడదని తెలియదా?
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఒలింపిక్ స్నోబోర్డ్ ఛాంపియన్ టోరా బ్రైట్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో వివాదాస్పదంగా మారింది. తన ఇంటి ఆవరణలో అర్ధనగ్నంగా శీర్షాషనం వేసి తన చిన్నారికి పాలు ఇస్తున్న ఫొటోను టోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఆమె పెట్టిన ఫోటోపై నెటిజన్లు స్పందిస్తూ ట్రోలింగ్ చేశారు. ''నీకు సిగ్గులేదా.. ఇలాంటి ప్రైవేట్ ఫొటోలు పోస్ట్ చేయకూడదని తెలియదా.. పబ్లిసిటీ కోసం అమ్మతనాన్ని అవమానిస్తావా..'' అంటూ పలువురు కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్లపై టోరా తను చేసిన పనిని సమర్థించుకుంటూ స్పందించడం విశేషం.'' నా ఫొటోపై వచ్చిన కామెంట్లు నాకు బాధ కలిగించాయి. నేను మాతృత్వం కలిగించే ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని కనుగొంటాను. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఉంటారు. అందులో తప్పు.. ఒప్పు అంటూ ఏమీ ఉండదు. మాతృత్వం స్వచ్ఛమైనది. పవిత్రమైన మథర్స్ క్లబ్లో చేరినందుకు ఇప్పుడు నన్ను నేను ఓ వండర్ ఉమెన్‌గా భావిస్తున్నా'' అంటూ రిప్లై ఇచ్చింది. కాగా టోరా బ్రైట్ 2010 వాంకోవర్, 2014 సోచి వింటర్ ఒలింపిక్స్‌లో స్నోబోర్డింగ్ విభాగంలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది. చదవండి: నన్ను, నా భార్యను చంపుతామని బెదిరించారు 'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో' -
కరోనాతో ఒలింపిక్ చాంపియన్ కన్నుమూత
బుడాపెస్ట్: ప్రపంచ షూటింగ్ క్రీడాలోకంలో విషాదం చోటు చేసుకుంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్, ఆరుసార్లు యూరోపియన్ చాంపియన్ అయిన హంగేరి మహిళా షూటర్ డయానా ఇగాలేను కరోనా మహమ్మారి కబళించింది. 56 ఏళ్ల డయానా కరోనా వైరస్ లక్షణాలతో మంగళవారం ఆసుపత్రిలో చేరగా... శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్కీట్ ఈవెంట్లో కాంస్య పతకం నెగ్గిన డయానా... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా షూటింగ్ క్రీడాంశంలో స్వర్ణం నెగ్గిన తొలి హంగేరి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆమె అంతర్జాతీయస్థాయిలో 32 పతకాలు గెల్చుకుంది. -
సున్ యాంగ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం
హాంకాంగ్: మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, చైనా ఫ్రీ స్టయిల్ స్విమ్మర్ సున్ యాంగ్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) శుక్రవారం ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 సెప్టెంబర్‌లో అతడి నుంచి శాంపిల్స్‌ను సేకరించడానికి వెళ్లిన ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రతినిధులకు సహకరించకుండా... వారు సేకరించిన శాంపిల్స్‌ను నాశనం చేశాడనే అభియోగంతో సీఏఎస్ అతడిపై విచారణ చేపట్టింది. తాజాగా ఆ ఘటనలో సున్ యాంగ్‌ను దోషిగా తేలుస్తూ... అతడిపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అయితే దీనిపై స్పందించిన సున్ తానెటువంటి తప్పు చేయలేదని...దీనిపై స్విట్జర్లాండ్ ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తానని మీడియాకు తెలిపాడు. చైనా స్విమ్మింగ్ సంఘం (సీఎస్ఏ) కూడా సున్కు మద్దతు తెలిపింది. ఆ రోజు సున్ శాంపిల్స్ సేకరించడానికి వచ్చిన వారు అర్హత కలిగిన అధికారులు కాదని తెలిపింది. 2014లో కూడా సున్ డోపింగ్‌లో పట్టుబడి నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. -
లిన్ డాన్‌కు ప్రణయ్ షాక్
జకార్తా: భారత షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ తన కెరీర్లో మరో అపూర్వ విజయాన్ని సాధించాడు. ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చైనా దిగ్గజం లిన్ డాన్‌ను కంగుతినిపించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్‌తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ ప్రణయ్ 21–15–9–21, 21–14తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. లిన్ డాన్‌పై ప్రణయ్‌కిది రెండో విజయం. 2015 ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ప్రణయ్ తొలి రౌండ్లోనే లిన్ డాన్‌ను ఓడించాడు. ఇతర పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ ల్లో సమీర్ వర్మ 21–19, 12–21, 22–20తో రస్ముస్ గెమ్కె (డెన్మార్క్)పై నెగ్గగా... సాయిప్రణీత్ 10–21, 13–21తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ 21–12, 21–12తో దినర్ ద్యా అయుస్టిన్ (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా జోడీ 11–21, 18–21తో అగత ఇమానుయెలా–సిటి ఫదియాసిల్వ (ఇండోనేసియా) జంట చేతిలో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 8–21, 15–21తో హిరొయుకి–యుత వతనబె (జపాన్) జంట చేతిలో ఓడిపోయాయి. -
ఒలింపిక్ చాంపియన్ సంచలన నిర్ణయం
మాస్కో : ఒలింపిక్ చాంపియన్, రష్యా జిమ్నాస్ట్ మార్గరిటా మామున్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 22 ఏళ్ల వయసులో కెరీర్‌కు గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని మార్గరిటా కోచ్ ఇరినా వైనర్ ఉస్మనోవా రష్యా మీడియా సంస్థ టాస్కు తెలిపారు. 'మామున్ కెరీర్ క్ స్వస్తి పలికారు. ఇక ఆమె పోటీలో పాల్గొనదు. క్రీడల్లో ఆమె పోరాటం ముగిసింది' అంటూ ఇరినా వెల్లడించారు. గతేడాది (2016) బ్రెజిల్ లోని రియో డీ జనీరోలో జరిగిన రిథమిక్ జిమ్నాస్టిక్ పోటీలో దేశానికే చెందిన యానా కుర్దవత్సేవాను ఓడించి పసిడి పతకాన్ని సగర్వంగా అందుకుంది మార్గరిటా మామున్. 2000 నుంచి జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో కనీసం ఓ పసిడిని తన ఖాతాలో వేసుకుంది మార్గరిటా. రష్యా-బంగ్లాదేశ్ దంపతులకు మాస్కోలో జన్మించిన ఈ ఒలింపిక్ చాంపియన్.. ఏడు ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణాలు సాధించింది. కెరీర్లో ఓవరాల్‌గా 28 స్వర్ణాలు, 13 రజతాలు, ఓ కాంస్యంతో జిమ్నాస్టిక్స్ లో తనకు తిరుగులేదని నిరూపించుకుంది రష్యా జిమ్నాస్ట్. ఆమె ఆకస్మిక నిర్ణయంపై క్రీడా విశ్లేషకులు షాక్‌కు గురయ్యారు. -
భళా... భారత్
బ్రిటన్‌పై 2-1తో విజయం లండన్: ఒలింపిక్ చాంపియన్ జర్మనీపై చివరి నిమిషాల్లో విజయాన్ని చేజార్చుకొని ‘డ్రా’తో సంతృప్తి పడ్డ భారత్... రెండో మ్యాచ్‌లో మాత్రం ఆ పొరపాటు చేయలేదు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ బ్రిటన్‌తో శనివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్‌తో నెగ్గి సంచలనం సృష్టించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (17వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (34వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా.. యాష్లే జాక్సన్ (35వ నిమిషంలో) బ్రిటన్‌కు ఏకైక గోల్ అందించాడు. సోమవారం జరిగే మూడో మ్యాచ్‌లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. -
ఒలింపిక్స్‌కు సీమా అర్హత
న్యూఢిల్లీ: డిస్కస్ త్రోయర్ సీమా పూనియా రియో డి జనీరో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అమెరికాలో జరుగుతున్న పాట్ యంగ్స్ త్రోయర్స్ క్లాసిక్ టోర్నీలో తను డిస్క్‌ను 62.62మీ. దూరం విసిరి రియో బెర్త్ దక్కించుకుంది. దీంతో 32 ఏళ్ల సీమా ఒలింపిక్స్ అర్హత దూరం 61.00మీ. అధిగమించినట్టయ్యింది. ఈ ఈవెంట్లో తను... 2008 ఒలింపిక్ చాంపియన్ స్టెఫానీ బ్రౌన్‌ను అధిగమించి స్వర్ణం దక్కించుకుంది. 2014 ఆసియా గేమ్స్‌లోనూ విజేతగా నిలిచిన సీమాకిది మూడో (2004, 12) ఒలింపిక్స్. ఇప్పటిదాకా భారత్ నుంచి 19 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించారు. -
జర్మనీ జయకేతనం
చాంపియన్స్ ట్రోఫీ కైవసం ఫైనల్లో పాక్‌పై గెలుపు భువనేశ్వర్: టోర్నీ మొత్తం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఒలింపిక్ చాంపియన్ జర్మనీ జట్టు... చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఆదివారం కలింగ మైదానంలో జరిగిన ఫైనల్లో 2-1తో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. 2007 తర్వాత మరోసారి టైటిల్‌ను సాధించిన జర్మనీకి ఓవరాల్‌గా ఇది పదో ట్రోఫీ. వెస్లీ (18వ ని.), ఫ్లోరియన్ ఫుచ్స్ (57వ ని.) జర్మనీకి గోల్స్ అం దించారు. తొలి నిమిషంలోనే పెనాల్టీని సాధిం చిన జర్మనీ మ్యాచ్ మొత్తం దూకుడును ప్రదర్శించింది. ప్రథమార్ధం ముగిసేసరికి 1-0 ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధభాగంలో పాక్ కాస్త పోరాడినా గోల్స్ చేయలేకపోయింది. భారత్‌కు నాలుగో స్థానం 32 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో పతకం గెలుచుకునే మంచి అవకాశాన్ని భారత హాకీ జట్టు జారవిడుచుకుంది. ఆదివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 1-2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 1982లో కాంస్యం సాధించిన భారత్... కనీసం ఈసారి కూడా దాన్ని పునరావృతం చేస్తే బాగుంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. లలిత్ ఉపాధ్యాయ (42వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందిస్తే... ఎడి ఒకెన్డెన్ (18వ ని.), మాట్ గోడెస్ (52వ ని.)లు ఆసీస్ తరఫున చెరో ఫీల్డ్ గోల్ సాధించారు. నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఇంగ్లండ్, బెల్జియం వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. ఇద్దరు పాక్ ఆటగాళ్లపై వేటు సెమీస్‌లో భారత్‌పై గెలిచాక ప్రేక్షకులకు అసభ్య కరంగా సంజ్ఞలు చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఒక మ్యాచ్ నిషేధం విధించింది. ఆ ఘటనలో దోషులుగా తేలిన అంజద్ అలీ, మొహమ్మద్ తౌసీఖ్లను జర్మనీతో ఫైనల్ ఆడకుండా నిషేధించింది. తొలుత వీరిని హెచ్చరించి వదిలేసినా... వాళ్లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో భారత్‌లో అం తర్జాతీయ టోర్నీలు నిర్వహించబోమని హాకీ ఇండియా హెచ్చరించింది. దీంతో ఎఫ్ఐహెచ్ చర్యలు తీసుకుంది. సెమీస్ తమ ప్రవర్తన పట్ల ఫైనల్ అనంతరం పాక్ కోచ్, కెప్టెన్ గులాబీలు ప్రదర్శిస్తూ క్షమాపణలు కోరారు. -
ఆఖరి క్షణాల్లో ఆవిరి
తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి చివరి నిమిషంలో గోల్ చేసి నెగ్గిన జర్మనీ చాంపియన్స్ ట్రోఫీ ఇంకొన్ని క్షణాలు గడిస్తే ఒలింపిక్ చాంపియన్‌ను నిలువరించామన్న ఆనందం కలిగేది. కానీ ఒకే ఒక్క తప్పిదం భారత ఆశలపై నీళ్లు చల్లింది. కేవలం 34 సెకన్లు మిగిలి ఉండగా గోల్‌ను సమర్పించుకున్న టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఆతిథ్య జట్టు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైనప్పటికీ... అంతిమ క్షణం వరకు పోరాడిన జర్మనీ అనుకున్న ఫలితాన్ని సాధించి చాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేసింది. భువనేశ్వర్: సొంతగడ్డపై సంచలన ప్రదర్శనతో శుభారంభం చేయాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో శనివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 0-1 గోల్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ చివరి క్షణాల వరకు జర్మనీని గోల్ చేయనీకుండా నిలువరించిన టీమిండియా ఆఖర్లో పట్టు సడలించింది. కేవలం 34 సెకన్లు మిగిలి ఉండగా గోల్‌ను సమర్పించుకొని పరాజయాన్ని మూటగట్టుకుంది. జర్మనీ తరఫున ఏకైక గోల్‌ను 60వ నిమిషంలో ఫ్లోరియన్ ఫుచ్స్ చేశాడు. అంతకుముందు పలుమార్లు జర్మనీ గోల్ చేసే అవకాశాలను సమర్థంగా అడ్డుకున్న భారత గోల్‌కీపర్ శ్రీజేష్ చివర్లో తడబడటంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది. శ్రీజేష్ అడ్డుగోడలా నిలబడకపోతే జర్మనీ ఖాతాలో మరిన్ని గోల్స్ చేరేవి. చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా తర్వాత... తొలి టోర్నమెంట్లో పాల్గొంటున్న భారత్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించకపోయినా జర్మనీ దూకుడుకు పగ్గాలు వేయడంలో సఫలమైంది. వేగవంతమైన ఆటతీరుకు మారుపేరైన జర్మనీ ఆరంభంలోని 10 నిమిషాల్లోనే రెండు పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. అయితే వీటిని నిలువరించడంలో భారత రక్షణశ్రేణి విజయవంతమైంది. 14వ నిమిషంలో భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్ దక్కినా... గుర్జిందర్ సింగ్ కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్‌కీపర్ జకోబి అడ్డుకున్నాడు. ఆ తర్వాత కూడా రెండు జట్లు వేగంగా ఆడినా... జర్మనీయే గోల్ చేసే అవకాశాలను సృష్టించింది. కానీ భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అప్రమత్తత కారణంగా జర్మనీకి నిరాశ తప్పదేమో అనిపించింది. ఇక మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనుకుంటున్న తరుణంలో... అందివచ్చిన అవకాశాన్ని జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ ఫుచ్స్ సద్వినియోగం చేసుకున్నాడు. ఎడమ వైపు నుంచి రివర్స్ ఫ్లిక్ షాట్ తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి జర్మనీ విజయా న్ని ఖాయం చేశాడు. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్ లో అర్జెంటీనాతో టీమిండియా తలపడుతుంది. శనివా రం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 3-1తో ప్రపం చ చాంపియన్ ఆస్ట్రేలియాపై; బెల్జియం 2-1తో పాకిస్తాన్‌పై; నెదర్లాండ్స్ 3-0తో అర్జెంటీనాపై గెలిచాయి. ‘జర్మనీలాంటి జట్టుతో ఆడుతున్నపుడు సదా అప్రమత్తంగా ఉండాలి. కానీ చివరి నిమిషంలో తప్పిదం చేసి మూల్యం చెల్లించుకున్నాం. ఓడిపోయినా మా ఆటగాళ్ల ఆట ఆకట్టుకుంది’ అని భారత జట్టు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలంట్ ఒల్ట్మన్స్ తెలిపారు. -
మానవ్‌జిత్ పసిడి ‘గురి’
ప్రపంచకప్ ‘ట్రాప్’ షూటింగ్లో అగ్రస్థానం ఫైనల్లో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌పై గెలుపు న్యూఢిల్లీ: తనలో ఇంకా చేవ తగ్గలేదని... పట్టుసడలని ఏకాగ్రత... లక్ష్యంపై గురి ఉంటే పతకాలు వాటంతట అవే వస్తాయని భారత స్టార్ ‘ట్రాప్’ షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధూ మరోసారి నిరూపించాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) షాట్‌గన్ ప్రపంచకప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 37 ఏళ్ల ఈ పంజాబ్ షూటర్ ఏకంగా స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. అమెరికాలోని టక్సన్‌లో భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ‘ట్రాప్’ ఈవెంట్ ఫైనల్లో 2006 వరల్డ్ చాంపియన్ మానవ్‌జిత్ 13-9 పాయింట్లతో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ మైకేల్ డైమండ్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఇద్దరికీ 15 చొప్పున టార్గెట్లు ఇచ్చారు. మానవ్‌జిత్ 13 సార్లు లక్ష్యాన్ని ఛేదించగా... 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన మైకేల్ డైమండ్ 9 సార్లు మాత్రమే సఫలమయ్యాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో డైమండ్ 15 పాయింట్లు సాధించగా... మానవ్‌జిత్, అలెక్సీ అలిపోవ్ (రష్యా), ఆరన్ హెడింగ్ (బ్రిటన్) 14 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లో మానవ్‌జిత్ 6 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. కాంస్య పతక పోటీలో అలిపోవ్ 12-10తో హెడింగ్‌ను ఓడించాడు. క్వాలిఫయింగ్‌లో మానవ్‌జిత్ 121 పాయింట్లు స్కోరు చేసి సెమీఫైనల్‌కు అర్హత పొందాడు. నాలుగేళ్ల విరామం తర్వాత మానవ్‌జిత్ ప్రపంచకప్‌లో పసిడి పతకాన్ని నెగ్గడం విశేషం. చివరిసారి అతను 2010లో మెక్సికోలో జరిగిన ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ (2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్) క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మానవ్‌జిత్ మూడుసార్లూ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. ఈ మెగా ఈవెంట్ కోసం గత శీతాకాలం మొత్తం సాధన చేశాను. ఫైనల్లో ప్రపంచ మేటి షూటర్లు బరిలోకి దిగారు. ముఖ్యంగా మైకేల్ డైమండ్‌తో ఫైనల్ పోటీ సవాల్‌తో కూడుకున్నది. అయితే మన లక్ష్యాన్ని మనమే గురి చూసి కొట్టాలి కదా. ఫైనల్ స్కోరు ఈ విషయాన్ని చెబుతోంది. ఈ ఏడాది భారత షూటర్లకు ఎంతో కీలకం. జూలైలో కామన్వెల్త్ గేమ్స్, సెప్టెంబరులోనే ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు ఉన్నాయి. ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా 2016 ఒలింపిక్స్‌కు 64 మంది షూటర్లు అర్హత సాధించే అవకాశముంది. - మానవ్‌జిత్ -
సెర్గీ బుబ్కా రికార్డు బద్దలు
6.16 మీటర్లతో లావిలెనీ కొత్త రికార్డు కీవ్: పోల్‌వాల్ట్ రారాజు సెర్గీ బుబ్కా 21 ఏళ్ల క్రితం సాధించిన ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. డోనెస్క్ ఇండోర్ ఈవెంట్లో ఫ్రాన్స్‌కు చెందిన రెనాడ్ లావిలెనీ 6.16 మీటర్ల ఎత్తు అధిగమించి ఈ ఘనత సాధించాడు. 1993లో ఇదే ఈవెంట్లో ఉక్రెయిన్ దిగ్గజం బుబ్కా 6.15 మీటర్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే 1994లో నెలకొల్పిన అవుట్డోర్ ప్రపంచ రికార్డు (6.14 మీటర్లు) మాత్రం ఇంకా బుబ్కా పేరిటే ఉంది. లావిలెనీ ఫీట్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఈ 50 ఏళ్ల మాజీ చాంపియన్ అందరికన్నా ముందు వెళ్లి అతడికి అభినందనలు తెలిపాడు. ‘అంతా అయోమయంగా ఉంది. నా నా శక్తిమేర ప్రయత్నిద్దామనుకున్నాను. కానీ జరిగింది చూసి నమ్మలేకపోతున్నాను’ అని 2012 ఒలింపిక్స్ చాంపియన్ అయిన లావిలెనీ వ్యాఖ్యానించాడు. -
ఆస్పత్రి పాలైన ఇయాన్ థోర్ప్
పునరావాస శిబిరానికి స్టార్ స్విమ్మర్ ఇయాన్ థోర్ప్ సిడ్నీ: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ విచక్షణ కోల్పోయిన స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. సిడ్నీ (2000), ఏథెన్స్ (2004) ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు గెలుచుకోవడమే కాకుండా ఒకే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు గె లుచుకున్న తొలి అథ్లెట్‌గానూ 31 ఏళ్ల థోర్ప్ పేరు తెచ్చుకున్నాడు. - పూర్తి షాక్‌లో ఉన్న తను తెల్లవారుజాము 3 గంటలకు సిడ్నీలోని ఓ కుటుంబానికి చెందిన వ్యాన్‌లో కూర్చునేందుకు ప్రయత్నిస్తుండగా 14 ఏళ్ల కుర్రాడు పోలీసులకు ఫోన్ చేశాడు. - దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు థోర్ప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తను పూర్తి దిగ్భ్రమకు లోనై ఉండడమే కాకుండా మత్తులో ఉన్నట్టు తెలిపారు. - అయితే తాము అదుపులో తీసుకున్నది థోర్ప్ అని పోలీసులు వెల్లడించలేదు. వైద్య చికిత్స కోసం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. థోర్ప్‌ను ఆస్ప్రతికి తీసుకెళ్లడం గత రెండు వారాల్లో రెండోసారి కావడం గమనార్హం. - అయితే అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, తాము కూడా ఏ చర్యలు తీసుకోలేదని పోలీసులు చెప్పారు. - థోర్ప్ మేనేజిమెంట్ ఈ ఘటనపై స్పందించనప్పటికీ అతడు డిప్రెషన్ చికిత్స కోసం పునరావాస శిబిరానికి వెళ్లినట్టు తెలిపింది. పెయిన్ కిల్లర్స్, యాంటీ డిప్రెసెంట్స్ వల్లే థోర్ప్ స్పృహలో లేకుండా కనిపించాడని చెప్పింది. - 2006లో కెరీర్ నుంచి తప్పుకున్నాక అతడి జీవితం గతి తప్పింది. 2011లో పునరాగమనం చేసినా... జాతీయ జట్టు ట్రయల్స్‌లో విఫలమై 2012 ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అప్పటి నుంచి థోర్ప్ కోలుకోలేకపోయాడు. -
‘వాడా’ వార్నింగ్ సరికాదు: బోల్ట్
మొనాకో: జమైకా స్టార్, స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) హెచ్చరికలపై మండిపడ్డాడు. తాజాగా ఐదో సారి ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికైన ఒలింపిక్ చాంపియన్... వాడా వార్నింగ్‌లతో తను కోట్ల రూపాయల స్పాన్సర్‌షిప్‌లు కోల్పోతానని వాపోయాడు. జమైకాకు చెందిన చాలా మంది అథ్లెట్లు ఇటీవల డోప్ టెస్టుల్లో పట్టుబడ్డారు. దీంతో విచారణకు అదేశించిన వాడా డోపీలపై కఠిన చర్యలుంటాయని, ఏకంగా జమైకా అథ్లెట్లందరినీ రియో ఒలింపిక్స్ (2016)లో పాల్గొనకుండా వేటు వేస్తామని గట్టిగా హెచ్చరించింది. దీనిపై స్పందించిన బోల్ట్... ‘వాడా నిర్ణయం నన్ను నిరాశపరిచింది. అది నిజంగా నా ఆదాయానికి గండికొట్టే హెచ్చరిక. నాకు తెలిసిందల్లా ట్రాక్ అండ్ ఫీల్డే. అదే నా లోకం. ఇందులో రాణించేందుకు ఎంతో కష్టపడతా. వాడా, ఐఏఏఎఫ్ల నుంచి ఎన్నో పరీక్షలెదుర్కొంటా’ అని అన్నాడు. కానీ వ్యక్తిగత పరీక్షల ఆధారంగా కాకుండా ఏకంగా టీమ్ మొత్తాన్ని నిషేధిస్తామనడం సబబు కాదని అన్నాడు. దీని వల్ల తనకు ఎండార్స్మెంట్లు తెచ్చే ఏజెంట్లు అయోమయానికి గురవుతారని... తాను ఆ జాబితాలో ఉన్నాననే అనుమానంతో స్పాన్సర్‌షిప్‌లు కట్టబెట్టరని బోల్ట్ వివరించాడు. తప్పుచేసినవారిపైనే చర్యలుండాలి గానీ టీమ్ మొత్తంపై వేటు తగదన్నాడు. -
హర్డిల్స్‌లో హెజ్నోవాకు స్వర్ణం
మాస్కో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత జుజానా హెజ్నోవా (చెక్) సత్తా చాటింది. గురువారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ను 52.83 సెకన్లలో ముగించి స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో కెరీర్లో తొలి ప్రపంచ పతకాన్ని సొంతం చేసుకుంది. పోటీ ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన హెజ్నోవా ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన దాలిలా మహ్మద్ (54.09 సెకన్లు), లషిండా డెముస్ (54.27 సెకన్లు)లకు వరుసగా రజతం, కాంస్య పతకాలు దక్కాయి. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో ఒలింపిక్ చాంపియన్ ఎజాకిల్ కెంబోయ్ 8:06.01 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిని సొంతం చేసుకోగా... సహచరుడు కన్సెస్లస్ కిప్రుటో (8:06.37 సెకన్లు)కు రతజం లభించింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జెహు గోర్డాన్ (ట్రినిడాడ్-47.69 సెకన్లు) విజేతగా నిలిచాడు. సెకన్లో వందో వంతు తేడాతో మైకేల్ టిన్స్లే (అమెరికా-47.70 సెకన్లు)ను ఓడించాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో క్యాటరిన్ ఇజార్జున్ (కొలంబియా), పురుషుల హైజంప్‌లో బోదాన్ బొండారెంకో (ఉక్రెయిన్-2.41 మీటర్లు), మహిళల 1500 మీటర్ల ఫైనల్లో అబెబా అర్గెవీ (స్వీడన్) స్వర్ణాలు గెలుచుకున్నారు.