మాస్కో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత జుజానా హెజ్‌నోవా (చెక్) సత్తా చాటింది. గురువారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ను 52.83 సెకన్లలో ముగించి స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో కెరీర్‌లో తొలి ప్రపంచ పతకాన్ని సొంతం చేసుకుంది. పోటీ ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన హెజ్‌నోవా ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన దాలిలా మహ్మద్ (54.09 సెకన్లు), లషిండా డెముస్ (54.27 సెకన్లు)లకు వరుసగా రజతం, కాంస్య పతకాలు దక్కాయి. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో ఒలింపిక్ చాంపియన్ ఎజాకిల్ కెంబోయ్ 8:06.01 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిని సొంతం చేసుకోగా... సహచరుడు కన్సెస్‌లస్ కిప్రుటో (8:06.37 సెకన్లు)కు రతజం లభించింది.
పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జెహు గోర్డాన్ (ట్రినిడాడ్-47.69 సెకన్లు) విజేతగా నిలిచాడు. సెకన్‌లో వందో వంతు తేడాతో మైకేల్ టిన్‌స్లే (అమెరికా-47.70 సెకన్లు)ను ఓడించాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో క్యాటరిన్ ఇజార్జున్ (కొలంబియా), పురుషుల హైజంప్‌లో బోదాన్ బొండారెంకో (ఉక్రెయిన్-2.41 మీటర్లు), మహిళల 1500 మీటర్ల ఫైనల్లో అబెబా అర్గెవీ (స్వీడన్) స్వర్ణాలు గెలుచుకున్నారు.
హర్డిల్స్‌లో హెజ్‌నోవాకు స్వర్ణం
Published Fri, Aug 16 2013 1:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement