World Athletics Championships 2023 Medal Tally: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో భారత్ 18 స్థానంలో నిలిచింది. ఒక్కో స్వర్ణ పతకం గెలిచిన బహ్రెయిన్, బుర్కినా ఫాసో, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా, సెర్బియా దేశాలతో కలిసి భారత్ సంయుక్తంగా 18వ ర్యాంక్ సాధించింది.
ప్రపంచ చాంపియన్‌షిప్-2022లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కారణంగా భారత జట్టు మరో ఐదు దేశాలతో కలసి సంయుక్తంగా 33వ స్థానంలో నిలిచింది. ఈసారి మన బంగారు కొండ నీరజ్ చోప్రా రజతాన్ని స్వర్ణంగా మార్చి దేశానికి గర్వకారణమయ్యాడు.
చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్ నదీం
హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు.
ఇక దాయాది పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి నీరజ్ తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. రజత పతకం గెలిచి తొలిసారి పాక్‌కు మెడల్ అందించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
ఈ విషయాలు తెలుసా!
ఇప్పటి వరకు 19 సార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈసారీ అమెరికా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ పతకాల పట్టికలో 15వసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 12 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 29 పతకాలతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.
ఈసారి ప్రపంచ చాంపియ న్‌షిప్‌లో పాల్గొన్న దేశాలు 195. మొత్తం 2100 మంది అథ్లెట్‌లు పోటీపడ్డారు. 120 దేశాల నుంచి నాలుగు లక్షల మంది ప్రేక్షకులు వచ్చి ఈ మెగా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు.
తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు 46. జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ రజత పతకంతో ఈ పోటీల చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ ఖాతాలో తొలి పతకం చేరింది.
చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment