Neeraj Chopra Touches Feet Of Elderly Fan Video Goes Viral - Sakshi
Sakshi News home page

Neeraj Chopra Video Viral: నువ్వు మాములోడివి కాదు సామీ.. అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాపై ప్రశంసలు

Published Sat, Jul 2 2022 10:15 AM | Last Updated on Sat, Jul 2 2022 11:31 AM

Neeraj Chopra Touches Feet Of Elderly Fan - Sakshi

అథ్లెట్‌ సుబేదార్ నీరజ్ చోప్రా ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. దేశానికి బంగారు పతకం అందించి కోట్లాది మందిని  తల ఎత్తుకునేలా చేశాడు. తాజాగా మరోసారి నీరజ్‌ చోప్రా వార్తల్లో నిలిచాడు. తన వినయంతో అందరి మన్ననలు అందుకున్నాడు. 

కేవలం ఆడిగాడిగానే కాకుండా.. మంచి ప్రవర్తనతో ఫ్యాన్స్‌, నెటిజన్లతో శభాష్‌ అనిపించుకున్నాడు. ఓ లీగ్‌లో పాల్గొనేందుకు నీరజ్‌ చోప్రా.. స్టాక్‌హోమ్‌కు వెళ్లాడు. లీగ్‌ అనంతరం అక్కడ.. నోరజ్‌ చోప్రా తన అభిమానులతో ఫొటోలు దిగుతున్నాడు. ఎంతో వినయంతో మర్యాదపూర‍్వకంగా తన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెప్పాడు. ఆ తర్వాత వారికి కరచాలనం చేశాడు. ఫొటోలు దిగిన అనంతరం వారిలో ఓ వృద్దుడు కనిపించడంతో ఒక్కసారిగా తల వంచి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. 

దీంతో, అతడి మర్యాదను చూసి అక్కడున్న వారంతా నీరజ్‌ చోప్రాను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. నీరజ్‌ చోప్రా వినయానికి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన యూజర్‌.. నీరజ్‌పై ప్రశంసల వర‍్షం కురిపించాడు. నీర‌జ్ చోప్రా.. డౌన్ టు ఎర్త్ వ్య‌క్తివి అంటూ కొనియాడాడు. 

ఇది కూడా చదవండి: సింధుకు మళ్లీ నిరాశ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement