ఎంపిక చేసిన అమెరికా ప్రముఖ మేగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 2024 సంవత్సరానికిగానూ ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్‌గా ఎంపికయ్యాడు. అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ ప్రకటించిన ర్యాంకింగ్స్ జాబితాలో... పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా అగ్రస్థానం దక్కించుకున్నాడు. ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ మేగజైన్‌కు 78 ఏళ్ల చరిత్ర ఉంది.
2024లో డైమండ్ లీగ్‌లో ఒక్క విజయం కూడా సాధించని నీరజ్... దోహా, లుసానే, బ్రస్సెల్స్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ టైటిల్ సాధించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)తో పోటీపడి నీరజ్ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన పీటర్స్... గత ఏడాది డైమండ్ లీగ్ మూడు ఈవెంట్లలో విజేతగా నిలిచాడు. 2023లోనూ నీరజ్ ఈ జాబితాలో ‘టాప్’ ప్లేస్‌లో నిలిచాడు. ‘అగ్రస్థానం కోసం నీరజ్ చోప్రా, పీటర్స్ మధ్య గట్టి పోటీ సాగింది.
గత ఏడాది నీరజ్ డైమండ్ లీగ్ టైటిల్ నెగ్గకపోయినా 3–2తో పీటర్స్‌పై ఆధిక్యంలో నిలిచాడు. ఒలింపిక్ చాంపియన్, పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఐదో స్థానం దక్కించుకున్నాడు’ అని మేగజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment