సెర్గీ బుబ్కా రికార్డు బద్దలు
6.16 మీటర్లతో లావిలెనీ కొత్త రికార్డు
కీవ్: పోల్‌వాల్ట్ రారాజు సెర్గీ బుబ్కా 21 ఏళ్ల క్రితం సాధించిన ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. డోనెస్క్ ఇండోర్ ఈవెంట్‌లో ఫ్రాన్స్‌కు చెందిన రెనాడ్ లావిలెనీ 6.16 మీటర్ల ఎత్తు అధిగమించి ఈ ఘనత సాధించాడు.
1993లో ఇదే ఈవెంట్‌లో ఉక్రెయిన్ దిగ్గజం బుబ్కా 6.15 మీటర్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే 1994లో నెలకొల్పిన అవుట్‌డోర్ ప్రపంచ రికార్డు (6.14 మీటర్లు) మాత్రం ఇంకా బుబ్కా పేరిటే ఉంది. లావిలెనీ ఫీట్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఈ 50 ఏళ్ల మాజీ చాంపియన్ అందరికన్నా ముందు వెళ్లి అతడికి అభినందనలు తెలిపాడు. ‘అంతా అయోమయంగా ఉంది. నా నా శక్తిమేర ప్రయత్నిద్దామనుకున్నాను. కానీ జరిగింది చూసి నమ్మలేకపోతున్నాను’ అని 2012 ఒలింపిక్స్ చాంపియన్ అయిన లావిలెనీ వ్యాఖ్యానించాడు.