ఒకప్పుడూ ఒలింపిక్ క్రీడాకారుడిగా ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. కానీ నేడు అదే వ్యక్తి సాధారణ క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తన అథ్లెటిక్ కెరీర్‌కి స్పాన్సర్లు లేకపోవడంతో కెరీర్‌కి స్వస్తి పలికి.. క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఫోటోతో సహా ఈ విషయం వైరల్ అవ్వడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ముంబైలోని ఒక సాధారణ క్యాబ్ రైడ్ వ్యవస్థాపకుడు ఆర్యన్ సింగ్ కుష్వా కారణంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఆయన లింక్డ్ ఇన్‌పోస్ట్‌లో తన ఓలా డ్రైవర్ పరాగ్ పాటిల్ మాజీ ఒలింపియన్ అని, అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అని వెల్లడిచారు. పరాగ్ ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్ ఈవెంట్‌లలో రెండు స్వర్ణాలు, 11 రజతాలు, మూడు కాంస్య పతకాలతో అద్భుతమైన రికార్డుని కలిగి ఉన్నాడని అన్నారు.
అయితే అతనికి సరైన స్పాన్సర్‌లు లేకపోవడంతో అథ్లెటిక్‌గా కెరీర్‌ని సాగించడం కష్టమైందని చెప్పారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించేందుకు ఇలా ఓలాడ్రైవర్‌గా మారాడని, అతనికి మద్దతిచ్చేలా ఎవ్వరైనా స్పాన్సర్‌లు ముందుకు రావాలని క్యాబ్ యజమాని కుష్వా పోస్ట్‌లో కోరారు.
అంతేగాదు తన డ్రైవర్‌తో కలిసి దిగిన ఫోటోలని కూడా కుష్వా జోడించడంతో నెటిజన్లను ఈ పోస్ట్ ఎంతగానో ఆకర్షించింది. అస్సలు మనదేశంలో క్రీడాకారులు కెరీర్‌ని ముగించిన తర్వాత లైఫ్‌ని లీడ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది. దేశానికి కీర్తి తెచ్చిపెట్టిన వారికి కనీస మర్యాదగా వారికి తగిన జీవన భృతి అందిచాలని ఒకరూ, మరొకరూ క్రౌడ్ ఫండింగ్‌తో అతడికి స్పాన్సర్‌లు దొరికేలా సాయం చేయలని పిలుపునిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఆ చిత్రాలు జ్ఞాపకాల చీరలు..!)
Comments
Please login to add a commentAdd a comment