సెరెనా విలియమ్స్
లాస్‌ఏంజెల్స్: మహిళలకు తొలి కాన్పు పునర్జన్మతో సమానం అనేది మనదగ్గర చెప్పుకొనే మాట. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ కూడా ఎదుర్కొంది. ఆమె గతేడాది సెప్టెంబర్‌లో అమ్మాయి (ఒలింపియా)కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తీవ్ర ఆరోగ్య సమస్య ఎదురైనట్లు సెరెనా వివరించింది. ‘బిడ్డ పుట్టాక నేను దాదాపు చనిపోయినంత పనైంది. నాకది నిజంగా పునర్జన్మే. గుండె స్పందన క్రమేపీ పడిపోతుండటంతో అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ శస్త్రచికిత్స విజయవంతమైంది. అంతకుముందే పాప పుట్టినట్లు తెలిసింది’ అని వివరించింది. ధమనుల్లో గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తుల్లోకీ చేరనుండటం సెరెనాకు ఇబ్బంది తెచ్చిపెట్టింది.
‘శస్త్రచికిత్స అనంతరం శ్వాస సమస్య తలెత్తింది. విపరీతమైన దగ్గు వచ్చింది. ఆస్పత్రివారు సీటీ స్కాన్ చేయించారు. ఉదర ప్రాంతంలో రక్త ప్రసరణ సమస్యను గుర్తించారు. ప్రాణాలు నిలిపే పరికరాలు బిగించారు. ఈ కారణంగా ఆరు వారాలపాటు మంచంపైనే ఉంటూ మాతృత్వ మధురిమలను ఆస్వాదించాల్సి వచ్చింది’ అని వివరించింది. సెరె నా... ఈ నెలలో టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. అక్క వీనస్‌తో కలిసి ఫెడ్ కప్ బరిలో దిగింది.
Comments
Please login to add a commentAdd a comment