
మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–ఎడువార్డో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటకు నిరాశ ఎదురైంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–4, 6–7 (4/7), 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది.
రెండో రౌండ్‌లో నిష్క్రమించిన బోపన్న జోడీకి 24,020 యూరోల (రూ. 19లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.