
ఫీవర్ ట్రీ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్స్‌కు చేరింది. లండన్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–3, 7–6 (7/3)తో కెవిన్ (దక్షిణాఫ్రికా)–జూలియన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది.
72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి జంట సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఇదే టోర్నీ సింగిల్స్ తొలి రౌండ్‌లో నేడు మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో బాంబ్రీ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment