
ప్రపంచ నంబర్‌వన్ జంటపై గెలుపు
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్స్ యూకీ బాంబ్రీ, రోహన్ బోపన్నలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ ఏకంగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్ బోపన్న (భారత్)–నునో బోరెజెస్ (పోర్చుగల్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టింది.
ప్రపంచ నంబర్‌వన్ జంట మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మాట్ పావిక్ (క్రొయేషియా)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–డోడిగ్ 2–6, 6–3, 10–8తో విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–డోడిగ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది.
అయితే ‘సూపర్ టైబ్రేక్’లో యూకీ–డోడిగ్ ద్వయం పైచేయి సాధించింది. జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–బోర్జెస్ 4–6, 7–6 (7/5), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment