
భారత సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్‌లో 23వ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. దోహాలో శుక్రవారం జరిగిన ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిచింది.
గంటా 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (5/7), 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్‌స్టంట్ లెస్టిన్ (ఫ్రాన్స్)–బోటిక్ జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జోడీ ఆ తర్వాత రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అనంతరం నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో తొలుత పది పాయింట్లు స్కోరు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది.బోపన్న–ఎబ్డెన్‌లకు 72,780 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment