doubles title
-
శభాష్ రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) ద్వయం తమ కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకుంది. కజకిస్తాన్‌లో ఆదివారం ముగిసిన అల్మాటీ ఓపెన్ అసోసియేన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్–అర్జున్ జోడీ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. వీరిద్దరి కెరీర్లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ టైటిల్ కావడం విశేషం. ఒక గంటా 41 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ జంట 3–6, 7–6 (7/3), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ బారింటోస్ (కొలంబియా)–స్కాండర్ మన్సూరి (ట్యూనిషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన రిత్విక్–అర్జున్‌లకు 54,780 డాలర్ల (రూ. 46 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 6–9తో వెనుకబడి... తొలి సెట్‌ను కోల్పోయిన రిత్విక్–అర్జున్రెండో సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గి నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో ఒకదశలో రిత్విక్–అర్జున్ 6–9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచారు. అయితే పట్టుదలతో పోరాడిన రిత్విక్–అర్జున్ స్కోరును సమం చేశారు. చివరకు 14–12తో విజయాన్ని అందుకున్నారు. సాధారణ టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన వారికి సెట్ లభిస్తుంది. ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం తొలుత పది పాయింట్లు నెగ్గిన వారికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు 9–9తో సమమైతే రెండు పాయింట్ల ఆధిక్యం లభించినపుడు గెలుపు ఖరారవుతుంది. 23 ఏళ్ల రిత్విక్ ఈ ఏడాది మూడు ఏటీపీ–250 టోర్నీల్లో (హాంగ్జౌ, అట్లాంటా, న్యూపోర్ట్) ఆడినా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. అయితే నాలుగో ఏటీపీ–250 టోర్నీలో మాత్రం టైటిల్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు రిత్విక్ 10 ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడింటిలో టైటిల్స్ నెగ్గి, ఏడింటిలో రన్నరప్‌గా నిలిచాడు. -
యూకీ–ఒలివెట్టి జోడీకి టైటిల్
స్టాడ్ (స్విట్జర్లాండ్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం విజేతగా నిలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ–ఒలివెట్టి జంట 3–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో హంబెర్ట్–మార్టిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది. యూకీ–ఒలివెట్టిలకు 30,610 యూరోల (రూ. 27 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జీవన్–అర్జున్ జోడీకి డబుల్స్ టైటిల్
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో భారత్‌కు చెందిన జీవన్ నెడున్‌జెళియన్–అర్జున్ ఖడే జోడీ విజేతగా నిలిచింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్–అర్జున్ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ మటుస్‌జెవ్‌స్కీ (పోలాండ్)–రోమియోస్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. జీవన్–అర్జున్ జోడీకి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీ,75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సాకేత్ జోడీకి టైటిల్
బెంగళూరు: భారత డేవిస్ కప్ ప్లేయర్ సాకేత్ మైనేని మరో డబుల్స్ టైటిల్ సాధించాడు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో రామ్‌కుమార్ రామనాథన్‌తో జోడీ కట్టిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ శనివారం జరిగిన ఫైనల్లో ఫ్రెంచ్ జంటపై విజయం సాధించాడు. భారత ద్వయం 6–3, 6–4తో మ్యాక్సిమ్ జాన్వియెర్–బిటన్ కౌజ్మినె జంటపై వరుస సెట్లలో గెలుపొందింది. సింగిల్స్‌లో భారత టాప్‌ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు మాత్రం సెమీస్‌లో చుక్కెదురైంది. రెండో సీడ్ నగాల్ 6–7 (2/7), 4–6తో ఇటలీకి చెందిన ఏడో సీడ్ స్టెఫానో నెపొలిటనో చేతిలో పరాజయం చవిచూశాడు. ఆట ఆరంభంలో సుమీత్ 4–1తో ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అయితే ఇటలీ ప్లేయర్ వరుసగా గేమ్‌లను గెలవడంతో తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. భారత ఆటగాడు రెండో సెట్ ఆరంభంలో పట్టుదల కనబరిచినప్పటికీ తర్వాత స్టెఫానో జోరు ముందు నిలువలేకపోయాడు. -
యూకీ ఖాతాలో మూడో డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన బ్రెస్ట్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–జూలియన్ క్యాష్ (బ్రిటన్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో యూకీ–క్యాష్ జోడీ 6–7 (5/7), 6–3, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ రాబర్ట్ గాలోవే (అమెరికా)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంటను ఓడించింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఏడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. టైటిల్ నెగ్గిన యూకీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది యూకీ గిరోనా చాలెంజర్ టోర్నీ (స్పెయిన్), నొంతబురి (థాయ్‌లాండ్) చాలెంజర్ టోర్నీలో కూడా డబుల్స్ టైటిల్ సాధించాడు. -
యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టైటిల్
మలోర్కా (స్పెయిన్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలి ఏటీపీ టోర్నీ డబుల్స్ టైటిల్ సాధించాడు. మలోర్కా చాంపియన్‌షిప్ ఏటీపీ–250 టోర్నీ లో యూకీ బాంబ్రీ (భారత్) –లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయం విజేతగా నిలి చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ–హారిస్ జోడీ 6–3, 6–4తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)–ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన యూకీ–హారిస్ జోడీకి 48,380 యూరోల (రూ. 43 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సాత్విక్- చిరాగ్ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయ జోడీగా రికార్డు
Satwiksairaj Rankireddy- Chirag Shetty- బాసెల్: కీలకదశలో పట్టుదల కోల్పోకుండా ఆడిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 68 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ గుర్తింపు పొందింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 54 నిమిషాల్లో 21–19, 24–22తో రెన్ జియాంగ్ యు–టాన్ కియాంగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టిలకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కాగా, ఓవరాల్‌గా ఐదో టైటిల్. ఐదో టైటిల్! ఇక విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 16,590 డాలర్ల (రూ. 13 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా సాత్విక్–చిరాగ్ కెరీర్లో గెలిచిన వరల్డ్ టూర్ డబుల్స్ టైటిల్స్. స్విస్ ఓపెన్ కంటే ముందు ఈ జంట హైదరాబాద్ ఓపెన్ (2018), థాయ్‌లాండ్ ఓపెన్ (2019), ఫ్రెంచ్ ఓపెన్ (2022), ఇండియా ఓపెన్ (2022) టోర్నీల్లో విజేతగా నిలిచారు. ఏడోసారి స్విస్ ఓపెన్‌లో భారత్ ప్లేయర్లకు టైటిల్ దక్కడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2011, 2012), పీవీ సింధు (2022)... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2015), హెచ్ఎస్ ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018)... పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ (2023) విజేతగా నిలిచారు. ఇవి కూడా చదవండి: బోపన్న జోడీకి షాక్ ఫ్లోరిడా: గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ... మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో మాత్రం నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 6–4, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ 11 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. కీలకమైన సూపర్ టైబ్రేక్‌లో మాత్రం బోపన్న, ఎబ్డెన్ తడబడి ఓటమి చవిచూశారు. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 18,020 డాలర్ల (రూ. 14 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హంపి, హారిక తొలి గేమ్ ‘డ్రా’ న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీని భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడ్డారు. తెల్లపావులతో ఆడిన హంపి 31 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. భారత్‌కే చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) వైశాలికి తొలి గేమ్‌లో ‘వాకోవర్’ లభించింది. ఆమెతో తొలి రౌండ్లో తలపడాల్సిన జర్మనీ గ్రాండ్‌మాస్టర్ ఎలిజబెత్ పాట్జ్ టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో తొలి గేమ్‌లో వైశాలిని విజేతగా ప్రకటించారు. టోర్నీ నిర్వాహకుల నిర్వహణ వైఫల్యాల కారణంగానే తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని ఎలిజబెత్ తెలిపింది. నిర్వాహకుల తీరుపై ఆగ్రహంతో కజకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ జాన్సయ అబ్దుమలిక్ కూడా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి టైటిల్
భారత సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 23వ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. దోహాలో శుక్రవారం జరిగిన ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిచింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (5/7), 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్స్టంట్ లెస్టిన్ (ఫ్రాన్స్)–బోటిక్ జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జోడీ ఆ తర్వాత రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అనంతరం నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో తొలుత పది పాయింట్లు స్కోరు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది.బోపన్న–ఎబ్డెన్‌లకు 72,780 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
Guangzhou Open 2022: గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో రన్నరప్ సాకేత్ జోడీ
ఈ ఏడాది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాలని ఆశించిన భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. కొరియాలో జరిగిన గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ జోడీ 6–2, 3–6, 6–10తో టాప్ సీడ్ బారియెంటోస్ (కొలంబియా)–రెయస్ వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. సాకేత్–యూకీ జోడీకి 1,800 డాలర్ల (రూ. లక్షా 48 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
టైటిల్ పోరులో సిక్కి–అశ్విని జంట
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించేందుకు నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి–అశ్విని జంట 21–12, 21–12తో ఫాన్ కా యాన్–వు యి టింగ్ (హాంకాంగ్) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో సిక్కి–అశ్విని జంట తలపడుతుంది. ఫైనల్లో సౌరభ్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్ సౌరభ్ 23–21, 21–16తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో లో కీన్ యె (సింగపూర్)తో సౌరభ్ తలపడతాడు. -
సాకేత్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చెంగ్డూ చాలెంజర్ టూర్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 0–6, 10–6తో జి సంగ్ నామ్–మిన్ యు సంగ్ (కొరియా) జంటపై నెగ్గింది. 62 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట 4 ఏస్‌లు సంధించి, 3 డబుల్స్ ఫాల్ట్‌లు చేసింది. ఈ విజయంతో సాకేత్ జోడీకి 7,750 డాలర్ల (రూ. 5 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీ, 110 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
గాయత్రి డబుల్ ధమాకా
హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి సత్తా చాటింది. పీజీబీఏలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 21–19, 21–16తో తన్వి లాడ్‌పై కేవలం 37 నిమిషాల్లోనే గెలుపొంది కెరీర్లో తొలి సీనియర్ ర్యాంకింగ్ టైటిల్‌ను అందుకుంది. డబుల్స్ టైటిల్‌పోరులో గాయత్రి –రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 19–21, 21–14, 21–10తో నాలుగో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీకి షాకిచ్చి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ) 25–23, 14–21, 13–21తో లక్ష్యసేన్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ గారగ (ఆంధ్రప్రదేశ్)–ద్రువ్ కపిల(ఎయిరిండియా) ద్వయం 23–21, 21–17తో ఏడో సీడ్ శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్) జంటపై, మిక్స్డ్ డబుల్స్‌లో గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంట 21–19, 13–21, 21–12తో కృష్ణ ప్రసాద్–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతలుగా నిలిచాయి. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్–వరేలా (మెక్సికో) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పేస్–వరేలా జోడీ 6–3, 4–6, 2–10తో శాండర్–వీజెన్ (బెల్జియం) జంట చేతిలో ఓడింది. రన్నరప్‌గా నిలిచిన పేస్ జోడీకి 3,820 యూరోలు (రూ. 3 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. యూపీ యోధ గెలుపు పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో రైడర్లు శ్రీకాంత్, ప్రశాంత్ కుమార్ చెలరేగడంతో యూపీ యోధ జట్టు మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో యూపీ యో«ధ 38–36తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. విజేత జట్టు తరఫున శ్రీకాంత్ 12, ప్రశాంత్ 11 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో నితీశ్ కుమార్ (4 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 43–32తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యచ్‌ల్లో పుణేరీ పల్టన్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
చెంగ్డూ ఓపెన్ రన్నరప్ జీవన్ జంట
కెరీర్లో రెండో ఏటీపీ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ క్రీడాకారుడు జీవన్ నెడుంజెళియన్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం చైనాలో ముగిసిన చెంగ్డూ ఓపెన్‌లో జీవన్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో జీవన్–ఆస్టిన్ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. రన్నరప్ జీవన్–ఆస్టిన్ జంటకు 30,490 డాలర్ల (రూ. 22 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
వియత్నాం ఓపెన్ విజేత సాకేత్ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని మరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. హోచి మిన్ సిటీలో ఆదివారం జరిగిన వియత్నాం ఓపెన్ టోర్నమెంట్లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–విజయ్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గో సొయెదా–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంటపై విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ కెరీర్లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్–విజయ్ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
విష్ణు జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్ (భారత్)–తొషిహిదె మత్సుయ్ (జపాన్) జోడీ 7–6 (7/3), 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎవ్‌గెని కర్లోవ్‌స్కీ–తుర్నెవ్ (రష్యా) జంటపై గెలిచింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు ద్వయం ఎనిమిది ఏస్‌లు సంధించింది. రెండు జోడీలు తమ సర్వీస్‌ను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో విష్ణు జోడీదే పైచేయిగా నిలిచింది. ఈ సీజన్లో విష్ణుకిది రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గత నెలలో భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి అతను ఫెర్గానా ఓపెన్ టైటిల్‌ను గెలిచాడు. మరోవైపు అమెరికాలో జరుగుతున్న న్యూపోర్ట్ ఓపెన్ టోర్నీ సెమీఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)–సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జంట 6–4, 6–7 (6/8), 9–11తో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
పేస్ జంటకు టైటిల్
ఇల్‌క్లే (బ్రిటన్): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. శనివారం ముగిసిన ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో తన భాగస్వామి ఆదిల్ షమస్దీన్ (కెనడా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్–షమస్దీన్ ద్వయం 2–6, 6–2, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో బ్రిడాన్ క్లియెన్–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. 45 ఏళ్ల పేస్ ఈ సీజన్లో తలాసీ, లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించాడు. -
రన్నరప్ సానియా జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొమ్మిదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. చైనాలో శనివారం జరిగిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సానియా-స్ట్రికోవా జోడీ 1-6, 4-6తో బెథానీ మాటెక్ సాండ్స (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోరుుంది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోరుు, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 68 వేల 200 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 45 లక్షల 39 వేలు)తోపాటు 585 ర్యాంకింగ్ పారుుంట్లు... విజేతగా నిలిచిన బెథానీ-సఫరోవా జంటకు లక్షా 35 వేల డాలర్ల (రూ. 89 లక్షల 85 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. -
సాయి దేదీప్యకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) జాతీయ అండర్-16 సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌లో శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో సాయి దేదీప్య-ధరణ ముదలియార్ (చత్తీస్‌గఢ్) జంట 4-6, 7-6 (7/1), 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో షేక్ హుమేరా-షేక్ ముబాషిరా (ఆంధ్రప్రదేశ్) ద్వయంపై గెలిచింది. -
సానియాకు మరో డబుల్స్ టైటిల్
న్యూ హవెన్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన కనెక్టికట్ డబ్ల్యూటీఏ ఓపెన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)-మోనికా నికెలెస్కూ (రొమేనియా) ద్వయం 7-5, 6-4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెరుున్)-చువాంగ్ చియా జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది. ఈ ఏడాది సానియాకిది ఏడో టైటిల్‌కాగా... కెరీర్లో 38వది. విజేతగా నిలిచిన సానియా జంటకు 40,650 డాలర్ల (రూ. 27 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సానియా-మోనికా జంట 2-6, 6-3, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆంద్రెజా క్లెపాక్-కాటరీనా స్రెబెత్నిక్ (స్లొవేనియా) జోడీపై గెలిచింది. -
రన్నరప్ పేస్ జంట
విన్స్టన్-సాలెమ్ (అమెరికా): ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశే మిగిలింది. శనివారం జరిగిన విన్స్టన్-సాలెమ్ ఓపెన్ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో పేస్-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) ద్వయం 6-4, 6-7 (6/8), 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెరుున్)-హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్) జంట చేతిలో ఓడిపోరుుంది. రెండో సెట్లో టైబ్రేక్‌లో పేస్ జంటకు మూడు మ్యాచ్ పారుుంట్లు లభించినా ఫలితం లేకపోరుుంది. 2015 జనవరిలో ఆక్లాండ్ ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత పేస్ మరో డబుల్స్ టైటిల్ గెలువలేకపోయాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో పేస్-బెగెమన్ ద్వయం 1-6, 7-6 (7/5), 10-4తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ లిండ్‌స్టెడ్ (స్వీడన్)-ఐజామ్ ఉల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్) జోడీపై గెలిచింది. రన్నరప్‌గా నిలిచిన పేస్ జంటకు 18,470 డాలర్ల (రూ. 12 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. -
ఇంకొక్క అడుగే...
♦ టైటిల్‌కు విజయం దూరంలో సానియా-హింగిస్ జంట ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఇండో-స్విస్ ద్వయం మెల్బోర్న్: జతగా వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ సాధించే దిశగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ మరో అడుగు ముందుకేశారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జోడీగా మహిళల డబుల్స్ టైటిల్స్ నెగ్గిన వీరిద్దరు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-0తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) జంటను చిత్తుగా ఓడించింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సానియా-హింగిస్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మొత్తానికి సానియా-హింగిస్‌లకిది వరుసగా 35వ విజయం కావడం విశేషం. శుక్రవారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్ ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జంటతో ఈ ఇండో-స్విస్ ద్వయం తలపడుతుంది. సెమీస్‌లో హలవకోవా-హర్డెకా 3-6, 6-3, 6-1తో యి ఫాన్ జు-సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)లపై గెలిచారు. బోపన్న జంటకు నిరాశ మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది. అన్‌సీడెడ్ జంట ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)-ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్) ద్వయం 6-2, 7-5తో మూడో సీడ్ బోపన్న-జాన్ చాన్ జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముగిసిన ప్రాంజల పోరాటం జూనియర్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల, కర్మాన్ కౌర్ థండి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. పదో సీడ్ ప్రాంజల 5-7, 5-7తో ఎనిమిదో సీడ్ అనస్తాసియా పొటపోవా (రష్యా) చేతిలో; కర్మాన్ కౌర్ 6-3, 5-7, 5-7తో సారా టామిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-కర్మాన్ జంట 6-7 (3/7), 5-7తో మాడిఇంగ్లిస్-జైమీ జోడీ చేతిలో ఓడారు. -
బోపన్న జంటకు నిరాశ
రెండోసారీ రన్నరప్‌తో సరి * రోజర్-టెకావ్ జోడీకి డబుల్స్ టైటిల్ * ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ లండన్: ప్రతిష్టాత్మక ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం 4-6, 3-6తో రెండో సీడ్ హొరియా టెకావ్ (రుమేనియా)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది. 2012లో భారత్‌కే చెందిన మహేశ్ భూపతితో కలిసి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన బోపన్న రన్నరప్‌గా నిలువగా... ఈసారి మెర్జియాతో కూడా రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్నాడు. డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌తో ఈ సీజన్‌ను ముగించనున్న టెకావ్-రోజర్ ద్వయం ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ సాధించడం విశేషం. 1986లో ఈ టోర్నీలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిని ప్రవేశపెట్టాక ఈ ఘనతను సాధించడం ఇదే తొలిసారి. గంటపాటు జరిగిన ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం సర్వీస్‌లలో నిలకడ లోపించింది. ఈ జంట ఏడు ఏస్‌లు సంధించినప్పటికీ మరోవైపు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు టెకావ్-రోజర్ జోడీ ఏడు ఏస్‌లు సంధించి, ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం బోపన్న-మెర్జియాలకు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. టెకావ్-రోజర్ మాత్రం బోపన్న జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. ఇప్పటిదాకా టెకావ్-రోజర్ జంటతో ఆడిన నాలుగు పర్యాయాలు బోపన్న-మెర్జియాలకు ఓటమే ఎదురైంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ సెమీఫైనల్లో, ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో, రోమ్ మాస్టర్స్ సిరీస్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న ద్వయం టెకావ్-రోజర్ల చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచి విజేతగా అవతరించిన టెకావ్-రోజర్ జంటకు 4,23,000 డాలర్లు (రూ. 2 కోట్ల 79 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 2,29,000 డాలర్లు (రూ. కోటీ 51 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సాకేత్ జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఇజ్మీర్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. భారత్‌కే చెందిన తన భాగస్వామి దివిజ్ శరణ్‌తో కలిసి సాకేత్ విజేతగా నిలిచాడు. టర్కీలోని ఇజ్మీర్ పట్టణంలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-దివిజ్ శరణ్ ద్వయం 7-6 (7/5), 4-6, 9-8తో ఆధిక్యంలో ఉన్న దశలో నాలుగో సీడ్, ప్రత్యర్థి జంట మాలిక్ జజిరి (టర్కీ)-మొల్చనోవ్ (ఉక్రెయిన్) గాయం కారణంగా వైదొలిగింది. విజేతగా నిలిచిన సాకేత్ జోడీకి 3,950 యూరోల (రూ. 2 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గతంలో అతను సనమ్ సింగ్‌తో కలిసి పుణే, ఢిల్లీ, కోల్‌కతాలలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లలో డబుల్స్ టైటిల్స్‌ను సాధించాడు. -
సానియాకు ‘ఖేల్ రత్న'!
క్రీడా మంత్రిత్వ శాఖ యోచన న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో అద్వితీయ విజయాలు సాధిస్తోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు సిఫారసు చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. గత ఏప్రిల్‌లో మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించి... ఇటీవల వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌నూ నెగ్గి చరిత్ర సృష్టించిన సానియా ఇప్పటివరకు ఈ అవార్డుకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోలేదు. అయితే నిబంధనల ప్రకారం క్రీడా మంత్రిత్వ శాఖ అర్హత ఉన్న వారి ఎవరి పేరునైనా ఈ అవార్డుకు సిఫారసు చేసే వీలుంది. సానియా గతేడాది ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేనితో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం, ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించింది. అంతేకాకుండా బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ‘ఖేల్త్న్ర’ అవార్డు విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ తెలిపారు.