సాకేత్‌ జోడీకి టైటిల్‌  | Title for Saket Jodi | Sakshi

సాకేత్‌ జోడీకి టైటిల్‌ 

Feb 18 2024 3:26 AM | Updated on Feb 18 2024 3:26 AM

Title for Saket Jodi - Sakshi

బెంగళూరు: భారత డేవిస్‌ కప్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని మరో డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు. బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో రామ్‌కుమార్‌ రామనాథన్‌తో జోడీ కట్టిన ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ స్టార్‌ సాకేత్‌ శనివారం జరిగిన ఫైనల్లో ఫ్రెంచ్‌ జంటపై విజయం సాధించాడు.

భారత ద్వయం 6–3, 6–4తో మ్యాక్సిమ్‌ జాన్‌వియెర్‌–బిటన్‌ కౌజ్మినె జంటపై వరుస సెట్లలో గెలుపొందింది. సింగిల్స్‌లో భారత టాప్‌ర్యాంక్‌ ప్లేయర్‌ సుమిత్‌ నగాల్‌కు మాత్రం సెమీస్‌లో చుక్కెదురైంది. రెండో సీడ్‌ నగాల్‌ 6–7 (2/7), 4–6తో ఇటలీకి చెందిన ఏడో సీడ్‌ స్టెఫానో నెపొలిటనో చేతిలో పరాజయం చవిచూశాడు.

ఆట ఆరంభంలో సుమీత్‌ 4–1తో ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అయితే ఇటలీ ప్లేయర్‌ వరుసగా గేమ్‌లను గెలవడంతో   తొలి సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. భారత ఆటగాడు రెండో సెట్‌ ఆరంభంలో పట్టుదల కనబరిచినప్పటికీ తర్వాత స్టెఫానో జోరు ముందు నిలువలేకపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement