
స్టాడ్ (స్విట్జర్లాండ్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్‌లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం విజేతగా నిలిచింది.
66 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ–ఒలివెట్టి జంట 3–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో హంబెర్ట్–మార్టిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది. యూకీ–ఒలివెట్టిలకు 30,610 యూరోల (రూ. 27 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment