ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ | Yuki Bambri Jodi in the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ

Published Tue, Sep 24 2024 4:32 AM | Last Updated on Tue, Sep 24 2024 4:32 AM

Yuki Bambri Jodi in the final

చెంగ్డూ (చైనా): భారత డబుల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో టైటిల్‌ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. చెంగ్డూ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

సోమవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (11/9)తో రెండో సీడ్‌ ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)–రాఫెల్‌ మాటోస్‌ (బ్రెజిల్‌) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో సాడియో డుంబియా–ఫాబియన్‌ రెబూల్‌ (ఫ్రాన్స్‌)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. ఈ ఏడాది యూకీ తన భాగస్వామి ఒలివెట్టితో కలిసి జిస్టాడ్‌ ఓపెన్, మ్యూనిక్‌ ఓపెన్‌ టోరీ్నల్లో టైటిల్స్‌ సాధించాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement