Chengdu
-
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
చెంగ్డూ (చైనా): భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. చెంగ్డూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (11/9)తో రెండో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో సాడియో డుంబియా–ఫాబియన్ రెబూల్ (ఫ్రాన్స్)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. ఈ ఏడాది యూకీ తన భాగస్వామి ఒలివెట్టితో కలిసి జిస్టాడ్ ఓపెన్, మ్యూనిక్ ఓపెన్ టోరీ్నల్లో టైటిల్స్ సాధించాడు. -
మను భాకర్‌కు రెండు స్వర్ణాలు
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత అగ్రశ్రేణి షూటర్ మనూ భాకర్ రెండు పసిడి పతకాలతో మెరిసింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో శనివారం భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. భారత్ ఖాతాలో చైనాలోని చెంగ్డూలో జరుగుతున్న క్రీడల్లో భాకర్ 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణాలు సాధించింది. టీమ్ ఈవెంట్లో ఆమెతో పాటు యశస్విని సింగ్ దేశ్వాల్, అభింద్య అశోక్ పాటిల్ సభ్యులుగా ఉన్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలోనూ భారత్‌కు చెందిన ఎలవెనిల్ వలరివన్ స్వర్ణ పతకం గెలుచుకుంది. మరో వైపు జూడో 57 కేజీల మహిళల విభాగంలో భారత్‌కు చెందిన యామిని మౌర్య కాంస్య పతకం సాధించింది. -
‘ముందెన్నడూ లేని ఉపద్రవం’
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య నెలకొన్న దౌత్య యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. కాన్సులేట్ మూసివేత ఆదేశాలతో రాజుకున్న వేడి ‘పతాక’స్థాయికి చేరుకుంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో గల చైనా కాన్సులేట్‌ను మూసివేయించడంతో ఇప్పటికే ప్రతీకార చర్యలు ప్రారంభించిన డ్రాగన్.. మరింత దూకుడుగా ముందు సాగుతోంది. అగ్రరాజ్యానికి ఎంతో వ్యూహాత్మకమైన చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్ మూసివేతకు ఆదేశించిన చైనా.. సోమవారం ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ జెండాను అవనతం చేస్తున్న దృశ్యాలు అధికార మీడియాలో ప్రసారమయ్యాయి. అదే విధంగా చెంగ్డూలోని కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బందిని అక్కడి నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకే ఖాళీ చేయించారని.. అలాగే కాన్సులేట్‌కు చేరుకునే రోడ్డు మార్గాన్ని కూడా పోలీసులు దిగ్బంధనం చేసినట్లు మీడియా వెల్లడించింది.(దెబ్బకు దెబ్బ.. ) 21వ శతాబ్దం అంధకారంగా మారే అవకాశం ఇక ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన యుద్ధానికి అమెరికా నిర్ణయాలే కారణమన్న డ్రాగన్.. యూఎస్ తన తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని శనివారం ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా జాతీయ మీడియా గ్లోబల్ టైమ్స్ సోమవారం నాటి ఎడిటోరియల్‌లో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పర్యవసానాలు ఘోరంగా ఉంటాయని, ఊహించని ఉపద్రవం ముంచుకు వస్తుందని అభిప్రాయపడింది. ‘‘చైనా- అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను మరింత దిగజార్చే ప్రయత్నాలు జరిగితే.. 21వ శతాబ్దం అంధకారంగా మారే అవకాశం ఉంది. ప్రచ్చన్న యుద్ధం నాటి పరిస్థితుల కంటే మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని తన కథనంలో హెచ్చరించింది. (‘చైనాను మార్చకుంటే అది మనల్ని మింగేస్తుంది’) కాగా హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. 72 గంటల్లోగా కాన్సులేట్‌ను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఇందుకు స్పందించిన చైనా అగ్రరాజ్యంపై అదే తరహా ఆరోపణలు గుప్పించింది. చెంగ్డూ అమెరికా కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్న కారణంగా.. కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇందుకు ఎటువంటి గడువు విధించనప్పటికీ సోమవారం భవనాన్ని ఖాళీ చేయించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
ప్రతీకార చర్యలు ప్రారంభించిన చైనా
బీజింగ్: అమెరికా, చైనా మధ్య దౌత్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్‌ను మూసివేయించడంతో చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆగ్నేయ సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్‌ను మూసివేయాలని ఆదేశించినట్టు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘చైనా అమెరికా మధ్య సంబంధాలు ఇలా క్షీణించాలని మేము కోరుకోవడం లేదు. దీనికంతటికీ అమెరికాదే బాధ్యత. అమెరికా తన తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం’’అని ఆ ప్రకటన పేర్కొంది. భద్రతకు భంగం కలిగిస్తున్నారు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ గూఢచర్య ఆరోపణలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించినట్టుగానే చైనా కూడా అదే బాటలో నడిచింది. చెంగ్డూ కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేయాలన్న అమెరికా నిర్ణయానికి ఇది సరైన ప్రతిస్పందనని ఆయన అన్నారు. తమ నిర్ణయం చట్టబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకి వ్యూహాత్మక ప్రాంతం చెంగ్డూలో అమెరికా కాన్సులేట్‌ని 1985లో ప్రారంభించారు. అందులో 200మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 150 మందికిపైగా స్థానికులే. సమస్యాత్మక ప్రాంతమైన టిబెట్ గురించి సమాచారాన్ని సేకరించడానికి చెంగ్డూలో కాన్సులేట్ అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. అంతేకాదు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ ఎంత పెద్దదో, ఎందరు ఉద్యోగులు ఉంటారో, సరిగ్గా చెంగ్డూలో కూడా అంతే మంది పనిచేస్తారు. వాటి ప్రాధాన్యాలు కూడా ఒకటే. తొలుత వూహాన్లో అమెరికా కాన్సులేట్ మూసివేయాలన్న ఆదేశాలిస్తారని భావించారు కానీ చెంగ్డూ అయితేనే దెబ్బకి దెబ్బ తీసినట్టు అవుతుందని చైనా ప్రభుత్వం భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో చైనా విద్యార్థుల అరెస్ట్ వీసాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నలుగురు చైనీయులపై కేసు నమోదు చేసింది. వీరు చైనా సైన్యంలో పనిచేసినప్పటికీ, ఆ వివరాలు దాచిపెట్టి, రీసెర్చ్ కోసం అమెరికాకి వచ్చినట్టు ఆరోపించింది. ఇందులో ముగ్గురిని ఎఫ్‌బీఐ అరెస్టు చేయగా, నాలుగో వ్యక్తి శాన్ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్ కార్యాలయంలో ఆశ్రయం పొందినట్లు వారు చెప్పారు. వీరందరిపై వీసా మోసానికి సంబంధించిన కేసు నమోదయ్యింది. నేర నిరూపణ అయితే పదేళ్ల జైలు శిక్ష, రూ.1.88 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
సాకేత్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చెంగ్డూ చాలెంజర్ టూర్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 0–6, 10–6తో జి సంగ్ నామ్–మిన్ యు సంగ్ (కొరియా) జంటపై నెగ్గింది. 62 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట 4 ఏస్‌లు సంధించి, 3 డబుల్స్ ఫాల్ట్‌లు చేసింది. ఈ విజయంతో సాకేత్ జోడీకి 7,750 డాలర్ల (రూ. 5 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీ, 110 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రెప్పపాటులో నేలమట్టం; వైరల్ వీడియో
బీజింగ్: నిర్మాణ రంగంలో ఆధునిక పోకడలు పోయే చైనా.. పాత భవంతులను కూల్చడంలోనూ సిద్ధహస్తురాలన్న సంగతి తెలిసిందే. నైరుతి చైనాలోని సిచువాన్ ఫ్రావిన్స్ చెంగ్డూ నగరంలో ఇటీవల ఓ భారీ భవంతిని నేలమట్టం చేసినప్పటి వీడియో వైరల్ అయింది. పొగ వ్యాపించకుండా..: 20 ఏళ్లనాటి భవంతిని కూల్చేసి, అక్కడ మల్టీపర్సపస్ కాంప్లెక్స్ నిర్మించాలనుకున్న అధికారులు.. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవంతి చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించారు. శక్తిమంతమైన డిటోనేటర్లను అమర్చి, ఒక్కసారే పేల్చడంతో ఆ 15 అంతస్తుల బిల్డింగ్ కేవలం 10 సెకన్లలో నేలమట్టమైంది. బిల్డింగ్ కూలిన వెంటనే దట్టమైన పొగ అలముకుంది. అయితే ఆ పొగ చుట్టుపక్కలకు వ్యాపించకుండా భారీ సంఖ్యలో డస్ట్ క్వికర్లను అమర్చడంతోపాటు.. పెద్ద పెద్ద పైపులతో నీళ్లను చల్లారు. పకడ్బందీగా సాగిన కూల్చివేత ఆపరేషన్ అనుకున్నట్లే సజావుగా జరగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
రెప్పపాటులో నేలమట్టం
-
మాల్ మయసభ
భారతంలో మయసభ ఉందంటారు. అలాంటి వింతలు, విడ్డూరాల వంటివే ఈ చైనా షాపింగ్ మాల్లోనూ ఉన్నాయి. వింటే భారతం వినాలి... తింటే గారెలు తినాలన్నది తెలుగు సామెత. దీనికి ఇప్పుడు.. ‘చూస్తే చైనానే చూడాలన్న’ వాక్యాన్ని జోడించుకోవాలేమో. ఎందుకంటారా? ఫొటో చూడండి మీకే అర్థమవుతుంది. ఏ పనైనా, భవనమైనా భారీగా, గ్రాండ్‌గా చేయడం చైనాకు అలవాటుగా... ఆ జాబితాలోకి చేరిందే ఈ న్యూ సెంచురీ గ్లోబల్ సెంటర్లోని కాంక్రీట్ బీచ్. దీని సంగతి కాసేపు పక్కనబెడదాం. ఈ గ్లోబల్ సెంటర్ ఉందే... అది కూడా చాలా పెద్దది. అంకెల్లో చెప్పాలంటే దాదాపు 17,60,000 చదరపు మీటర్ల విశాలమైందన్నమాట. కొన్ని వందల దుకాణాలు, హోటళ్లు, కార్యాలయాలు, సినిమాహాళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్‌లు ఉన్న ఈ సూపర్ షాపింగ్‌మాల్‌కు అదనపు అట్రాక్షన్ కాంక్రీట్ బీచ్. సముద్ర తీరానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో చెంగ్డూ నగరంలో ఉన్న కాంక్రీట్ బీచ్‌లో కొన్ని వందల మంది హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. అప్పుడప్పుడూ ఎగసిపడే అలల్లో జలకాలాడవచ్చు... స్కీయింగ్ చేయవచ్చు... కావాలంటే సర్ఫింగ్కూ అవకాశముంది. షాపింగ్‌తో అలసిపోతే సేదదీరేందుకు, ఎక్కువ మంది విజిటర్స్‌ను ఆకర్షించేందుకు ఈ కాంక్రీట్ బీచ్ ఎంతో ఉపయోగపడుతున్నట్లు సమాచారం. చెంగ్డూ ప్రభుత్వం దాదాపు 600 కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించిన గ్లోబల్ సెంటర్లోని కార్యాలయాల్లో పనిచేసేందుకు రోజూ 8000 మంది వచ్చిపోతున్నారు. రెండేళ్ల క్రితం ఈ సూపర్‌మాల్ ప్రారంభమైనప్పుడు డబ్బు దండగ వ్యవహారమని కొందరు విమర్శించినప్పటికీ 90 శాతం స్పేస్ అమ్ముడుపోయి ఇప్పుడు సూపర్‌హిట్ అనిపించుకుంటోంది.