రెప్పపాటులో నేలమట్టం; వైరల్‌ వీడియో | 15 Story Building Demolished In Just 10 Seconds In China | Sakshi
Sakshi News home page

రెప్పపాటులో నేలమట్టం; వైరల్‌ వీడియో

Published Fri, Mar 30 2018 12:44 PM | Last Updated on Fri, Mar 30 2018 5:56 PM

15 Story Building Demolished In Just 10 Seconds In China - Sakshi

బీజింగ్‌: నిర్మాణ రంగంలో ఆధునిక పోకడలు పోయే చైనా.. పాత భవంతులను కూల్చడంలోనూ సిద్ధహస్తురాలన్న సంగతి తెలిసిందే. నైరుతి చైనాలోని సిచువాన్‌ ఫ్రావిన్స్‌ చెంగ్డూ నగరంలో ఇటీవల ఓ భారీ భవంతిని నేలమట్టం చేసినప్పటి వీడియో వైరల్‌ అయింది.

పొగ వ్యాపించకుండా..: 20 ఏళ్లనాటి భవంతిని కూల్చేసి, అక్కడ మల్టీపర్సపస్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలనుకున్న అధికారులు.. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవంతి చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించారు. శక్తిమంతమైన డిటోనేటర్లను అమర్చి, ఒక్కసారే పేల్చడంతో ఆ 15 అంతస్తుల బిల్డింగ్ కేవలం 10 సెకన్లలో నేలమట్టమైంది. బిల్డింగ్‌ కూలిన వెంటనే దట్టమైన పొగ అలముకుంది. అయితే ఆ పొగ చుట్టుపక్కలకు వ్యాపించకుండా భారీ సంఖ్యలో డస్ట్‌ క్వికర్లను అమర్చడంతోపాటు.. పెద్ద పెద్ద పైపులతో నీళ్లను చల్లారు. పకడ్బందీగా సాగిన కూల్చివేత ఆపరేషన్‌ అనుకున్నట్లే సజావుగా జరగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement