సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చెంగ్డూ చాలెంజర్ టూర్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 0–6, 10–6తో జి సంగ్ నామ్–మిన్ యు సంగ్ (కొరియా) జంటపై నెగ్గింది. 62 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట 4 ఏస్‌లు సంధించి, 3 డబుల్స్ ఫాల్ట్‌లు చేసింది. ఈ విజయంతో సాకేత్ జోడీకి 7,750 డాలర్ల (రూ. 5 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీ, 110 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment