
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 32 ఏళ్ల యూకీ ఐదు స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫ్రాన్స్‌కు చెందిన డబుల్స్ భాగస్వామి అల్బానో ఒలివెట్టితో కలిసి యూకీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో యూకీ ర్యాంక్ మెరుగైంది. భారత స్టార్ రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment