ATP
-
విన్నర్ సినెర్
రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ ఇప్పటికే టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకోగా... సెర్బియా స్టార్ జొకోవిచ్ కూడా త్వరలోనే వీరి బాటలో నడిచే అవకాశముంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ ‘ముఖచిత్రం’ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్ దూసుకొచ్చాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఫైనల్స్‌లో సినెర్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని సినెర్... 1986లో ఇవాన్ లెండిల్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఇటీవల డోపింగ్ వివాదంతో విమర్శలపాలైనా... ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పిదం చేయలేదని వివరణ ఇచి్చన సినెర్... తాజా విజయంతో సీజన్‌ను చిరస్మరణీయంగా ముగించాడు. ట్యూరిన్: సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ అదరగొట్టాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో తొలిసారి విజేతగా అవతరించాడు. అమెరికా ప్లేయర్, యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్‌తో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ తుది సమరంలో సినెర్ 14 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తొలి సర్వీస్ లో 40కుగాను 33 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 16కు 13 పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి సర్వీస్ ను రెండుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. నెట్ వద్దకు 5 సార్లు దూసుకొచ్చిన ఇటలీ స్టార్ మూడుసార్లు పాయింట్లు నెగ్గాడు. 28 విన్నర్స్ కొట్టిన సినెర్ కేవలం 9 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ 8 ఏస్‌లు సంధించి, 2 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 8 సార్లు దూసుకొచ్చి 7 సార్లు పాయింట్లు నెగ్గిన ఫ్రిట్జ్ 15 అనవసర తప్పిదాలు చేశాడు. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా విజేతగా నిలిచినందుకు సినెర్ 48,81,100 డాలర్ల (రూ. 41 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీ, 1500 ర్యాంకింగ్ పాయింట్లు గెల్చుకున్నాడు. టేలర్ ఫ్రిట్జ్కు 22,47,400 డాలర్ల (రూ. 18 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2006లో జేమ్స్ బ్లేక్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో ఆడిన అమెరికన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ఫ్రిట్జ్ కీలక సమరంలో తడబడ్డాడు. ఒకవేళ ఫ్రిట్జ్ గెలిచి ఉంటే 1999లో సంప్రాస్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందేవాడు. మరోవైపు ఇవాన్ లెండిల్ (1986లో; చెక్ రిపబ్లిక్/అమెరికా) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత వహించాడు. 2024 ఏడాదిని సినెర్ 70 విజయాలు, 6 పరాజయాలతో ముగించాడు. ఆండీ ముర్రే (బ్రిటన్; 2016లో) తర్వాత ఒకే సీజన్ లో 70 విజయాలు సాధించిన ప్లేయర్‌గా సినెర్ నిలిచాడు. 8 ఈ ఏడాదిలో సినెర్ సాధించిన టైటిల్స్ సంఖ్య. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, షాంఘై మాస్టర్స్, ఏటీపీ ఫైనల్స్ టోర్నీలలో సినెర్ విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా సినెర్ కెరీర్లో 18 టైటిల్స్ నెగ్గాడు. -
18 ఏళ్ల తర్వాత తొలిసారి..
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో ఈసారి నూతన చాంపియన్ అవతరించనున్నాడు. ఇటలీలోని ట్యూరిన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అమెరికా ప్లేయర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz) 6–3, 3–6, 7–6 (7/3)తో రెండుసార్లు చాంపియన్ (2018, 2021), ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలుపొందాడు.18 ఏళ్ల తర్వాతఫలితంగా 18 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో ఓ అమెరికా ఆటగాడు టైటిల్ కోసం తలపడనున్నాడు. చివరిసారి 2006లో అమెరికా ప్లేయర్ జేమ్స్ బ్లేక్ ఫైనల్లోకి ప్రవేశించి తుది సమరంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1999లో పీట్ సంప్రాస్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ సాధించలేకపోయాడు.ఇక జ్వెరెవ్‌తో 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ఫ్రిట్జ్ 15 ఏస్‌లు సంధించాడు. ఒకసారి తన సర్వీస్‌ను కోల్పోయి, ఒకసారి జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 31 విన్నర్స్ కొట్టిన ఫ్రిట్జ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. ఫ్రిట్జ్‌తో సినెర్ అమీతుమీఇదిలా ఉంటే.. ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ప్రపంచ ఆరో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో.. సినెర్ అద్భుత విజయం సాధించాడు. రూడ్‌ను 6-1, 6-2తో చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ క్రమంలో టేలర్ ఫ్రిట్జ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.రొనాల్డో మ్యాజిక్ పోర్టో: యూరోప్ నేషన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పోలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. పోర్చుగల్ తరఫున రొనాల్డో రెండు గోల్స్ (72వ, 87వ నిమిషాల్లో) సాధించాడు. 87వ నిమిషంలో రొనాల్డో గాల్లో ఎగురుతూ ఓవర్‌హెడ్ కిక్‌తో చేసిన గోల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రాఫెల్ లియో (59వ నిమిషంలో), ఫెర్నాండెస్ (80వ నిమిషంలో), పెడ్రో నెటో (83వ నిమిషంలో) పోర్చుగల్‌కు ఒక్కో గోల్ సాధించి పెట్టారు. పోలాండ్ జట్టుకు మార్జుక్ (88వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. -
విజయంతో ముగించిన బోపన్న–ఎబ్డెన్ జోడీ
ట్యూరిన్: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న 2024 సీజన్‌ను విజయంతో ముగించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచింది. ‘బాబ్ బ్రయాన్ గ్రూప్’లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన బోపన్న–ఎబ్డెన్ ద్వయం... శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7–5, 6–7 (6/8), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది. ఈ క్రమంలో బోపన్న (44 ఏళ్ల 8 నెలలు) ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజయం సాధించిన అతి పెద్ద వయసు్కడిగా రికార్డు నెలకొల్పాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన క్రావిట్జ్–ప్యూట్జ్ జోడీ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. 2023లో ఎబ్డెన్తో జతకట్టిన బోపన్న ఈ టోరీ్నలో చివరిసారి అతనితో కలసి ఆడాడు. వచ్చే సీజన్లో వీరిద్దరు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగుతారు. ఓవరాల్‌గా బోపన్న–ఎబ్డెన్ జంట ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌తో కలిపి నాలుగు ఏటీపీ టోరీ్నల్లో టైటిల్స్ గెల్చుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా సాధించింది. -
సినెర్ అలవోకగా...
ట్యూరిన్ (ఇటలీ): సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్ సూపర్‌స్టార్ యానిక్ సినెర్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సినెర్ వరుసగా రెండో విజయం సాధించాడు. ‘ఇలీ నస్టాసే గ్రూప్’లో భాగంగా టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు. ఈ విజయంతో సినెర్‌కు సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖరారైంది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ ఆరు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఒక్కో సెట్లో ఒక్కోసారి ఫ్రిట్జ్ సర్వీస్‌ను సినెర్ బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచాడు. 21 విన్నర్స్ కొట్టిన అతను 22 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ ఏడు ఏస్‌లతో రాణించినా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. 20 విన్నర్స్ కొట్టిన ఫ్రిట్జ్ 31 అనవసర తప్పిదాలు చేశాడు. ‘జాన్ న్యూకోంబ్ గ్రూప్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ తొలి విజయం నమోదు చేసుకున్నాడు. ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6–3, 7–6 (10/8)తో గెలుపొందాడు. గంటా 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 10 ఏస్‌లు సంధించాడు. రెండుసార్లు రుబ్లెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ 33 విన్నర్స్‌తో అలరించాడు. బోపన్న జోడీకి మరో ఓటమి ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మ్యాట్ పావిచ్ (క్రొయేíÙయా) జంటతో జరిగిన మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 5–7, 3–6తో ఓడిపోయింది. -
మెద్వెదెవ్ విజయం
ట్యూరిన్ (ఇటలీ): టాప్ టెన్నిస్ స్టార్ల మధ్య జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్లో రష్యా ప్లేయర్ డానిలి మెద్వెదెవ్ రెండో లీగ్ మ్యాచ్‌లో గెలిచి గట్టెక్కాడు. మంగళవారం జరిగిన పోరులో మెద్వెదెవ్ 6–2, 6–4తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగిన పోరులో వరుస సెట్లలో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో కంగుతిన్న రష్యన్ స్టార్ ఈ సారి ఆ పొరపాటు చేయలేదు. ఆరంభం నుంచే తన రాకెట్‌కు పదును పెట్టిన మెద్వెదెవ్ ఆస్ట్రేలియా ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించాడు. ఆసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టాప్–8 ర్యాంకింగ్ ప్లేయర్లను గ్రూపులో నలుగురు చొప్పున విభజించి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ సీజన్ ముగింపు టోర్నీని నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి తొలిరెండు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు సెమీఫైనల్స్‌కు అర్హత సంపాదిస్తారు. గురువారం జరిగే పోటీల్లో సినెర్‌తో మెద్వెదెవ్, ఫ్రిట్జ్‌తో డి మినార్ తలపడతారు. మరో గ్రూప్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4తో రుబ్లెవ్ (రష్యా)పై గెలుపొందాడు. డబుల్స్ పోరులో ఏడో సీడ్ హ్యారి హెలియోవార (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జోడీ 7–6 (8/3), 7–5తో ఆస్ట్రేలియాకు చెందిన ఐదో సీడ్ జోర్డాన్ థాంప్సన్–మ్యాక్స్ పుర్సెల్ జంటపై గెలుపొందింది. -
జొకోవిచ్ దూరం
బెల్గ్రేడ్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఈసారి నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈనెల 10 నుంచి 17 వరకు ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. గాయం కారణంగా తాను ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనడంలేదని ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మంగళవారం ప్రకటించాడు. ‘ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఆడాలని ఆసక్తితో ఎదురుచూశా. కానీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ టోర్నీలో ఆడటంలేదు. నా ఆట చూసేందుకు ప్రణాళికలు చేసుకున్న వారికి క్షమించాలని కోరుతున్నాను. ఈ టోరీ్నలో ఆడబోతున్న ఆటగాళ్లందరికీ నా తరఫున శుభాకాంక్షలు. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని జొకోవిచ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నాడు. ఏడుసార్లు విజేతగా... 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ను జొకోవిచ్ ఏడుసార్లు (2008, 2012, 2013, 2014, 2015, 2022, 2023) సొంతం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (6 సార్లు) పేరిట ఉన్న రికార్డును గత ఏడాది జొకోవిచ్ బద్దలు కొట్టాడు. 37 విజయాలతో ముగింపు... ఇప్పటికే అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందిన జొకోవిచ్ ఈ ఏడాది తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న ఒలింపిక్స్ వ్యక్తిగత సింగిల్స్ స్వర్ణ పతకాన్ని అతను ‘పారిస్’లో అందుకున్నాడు.వింబుల్డన్ టోర్నీలో, షాంఘై మాస్టర్స్ టోర్నీలో ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది జొకోవిచ్ 37 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 44,21,916 డాలర్ల (రూ. 37 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీని గెల్చుకున్నాడు. -
శభాష్ రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) ద్వయం తమ కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకుంది. కజకిస్తాన్‌లో ఆదివారం ముగిసిన అల్మాటీ ఓపెన్ అసోసియేన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్–అర్జున్ జోడీ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. వీరిద్దరి కెరీర్లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ టైటిల్ కావడం విశేషం. ఒక గంటా 41 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ జంట 3–6, 7–6 (7/3), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ బారింటోస్ (కొలంబియా)–స్కాండర్ మన్సూరి (ట్యూనిషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన రిత్విక్–అర్జున్‌లకు 54,780 డాలర్ల (రూ. 46 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 6–9తో వెనుకబడి... తొలి సెట్‌ను కోల్పోయిన రిత్విక్–అర్జున్రెండో సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గి నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో ఒకదశలో రిత్విక్–అర్జున్ 6–9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచారు. అయితే పట్టుదలతో పోరాడిన రిత్విక్–అర్జున్ స్కోరును సమం చేశారు. చివరకు 14–12తో విజయాన్ని అందుకున్నారు. సాధారణ టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన వారికి సెట్ లభిస్తుంది. ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం తొలుత పది పాయింట్లు నెగ్గిన వారికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు 9–9తో సమమైతే రెండు పాయింట్ల ఆధిక్యం లభించినపుడు గెలుపు ఖరారవుతుంది. 23 ఏళ్ల రిత్విక్ ఈ ఏడాది మూడు ఏటీపీ–250 టోర్నీల్లో (హాంగ్జౌ, అట్లాంటా, న్యూపోర్ట్) ఆడినా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. అయితే నాలుగో ఏటీపీ–250 టోర్నీలో మాత్రం టైటిల్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు రిత్విక్ 10 ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడింటిలో టైటిల్స్ నెగ్గి, ఏడింటిలో రన్నరప్‌గా నిలిచాడు. -
అనిరుధ్‌కు రెండో టైటిల్
విలేనా (స్పెయిన్): హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఈ ఏడాది తన ఖాతాలో రెండో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. స్పెయిన్‌లో జరిగిన విలేనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోరీ్నలో భారత్‌కే చెందిన నిక్కీ కలియంద పునాచాతో కలిసి అనిరుధ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అనిరు«ద్–నిక్కీ ద్వయం 7–6 (7/2), 6–4తో రొమైన్ అర్నియోదో (మొనాకో)–ఇనిగో సెర్వాంటెస్ (స్పెయిన్) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరు«ద్–నిక్కీ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. టైటిల్ గెలిచే క్రమంలో భారత జంట ఈ టోర్నీలో ఒక్క సెట్ మాత్రమే కోల్పోయింది. అనిరుధ్–నిక్కీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 26 ఏళ్ల అనిరుధ్ ఈ ఏడాది మనాకోర్ ఓపెన్, ఓల్‌రాస్ ఓపెన్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి... ఓల్‌రాస్ ఓపెన్, విలేనా ఓపెన్లలో టైటిల్స్ సాధించాడు. -
నిరీక్షణ ముగిసె...
హాంగ్జౌ (చైనా): భారత టెన్నిస్ ప్లేయర్ విజయ్ సుందర్ ప్రశాంత్ తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ తన కెరీర్లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల విజయ్ మంగళవారం ముగిసిన హాంగ్జౌ ఓపెన్ టోరీ్నలో భారత్‌కే చెందిన తమిళనాడు ప్లేయర్ జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్‌ను దక్కించుకున్నాడు. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో విజయ్–జీవన్ ద్వయం 4–6, 7–6 (7/5), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్‌స్టన్‌టిన్ ఫ్రాంట్జెన్–హెండ్రిక్ జెబెన్స్ (జర్మనీ) జోడీని ఓడించింది. విజయ్–జీవన్‌లకు 52,880 డాలర్ల (రూ. 44 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో రెండో సీడ్, మూడో సీడ్ జోడీలను విజయ్–జీవన్ ఓడించడం విశేషం. 35 ఏళ్ల జీవన్కిది రెండో ఏటీపీ డబుల్స్ టైటిల్. 2017లో రోహన్ బోపన్నతో కలిసి జీవన్ చెన్నై ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. -
సిలిచ్ కొత్త చరిత్ర... 777వ ర్యాంక్‌తో బరిలోకి దిగి ఏటీపీ సింగిల్స్ టైటిల్ సొంతం
హాంగ్జౌ (చైనా): క్రొయేషియా టెన్నిస్ ప్లేయర్ మారిన్ సిలిచ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ చరిత్రలో కొత్త ఘనతను నమోదు చేశాడు. ఏటీపీ టైటిల్ నెగ్గిన అతి తక్కువ ర్యాంకింగ్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. మంగళవారం ముగిసిన హాంగ్జౌ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సిలిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–6 (7/5), 7–6 (7/5)తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్‌ను ఓడించి తన కెరీర్లో 21వ టైటిల్ గెలుచుకున్నాడు. హౌంగ్జౌ ఓపెన్‌లో బరిలోకి దిగే సమయానికి సిలిచ్ ఏటీపీ ర్యాంక్ 777 కావడం విశేషం. 35 ఏళ్ల సిలిచ్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇక్కడ ఆడే అవకాశం లభించింది. ఒకప్పుడు పురుషుల సింగిల్స్‌లో మంచి విజయాలతో టాప్ ఆటగాళ్లలో ఒకడిగా సిలిచ్ కొనసాగాడు. 2014లో తన ఏకైక గ్రాండ్‌స్లామ్ (యూఎస్ ఓపెన్) నెగ్గిన అతను ఆ్రస్టేలియన్ ఓపెన్, వింబుల్డన్‌లలో రన్నరప్‌గా నిలిచాడు. 2018లో అతను వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకును కూడా అందుకున్నాడు. గత కొంత కాలంగా గాయాలతో అతను చాలా వరకు ఆటకు దూరమయ్యాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో యూకీ బాంబ్రీ
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 32 ఏళ్ల యూకీ ఐదు స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫ్రాన్స్‌కు చెందిన డబుల్స్ భాగస్వామి అల్బానో ఒలివెట్టితో కలిసి యూకీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో యూకీ ర్యాంక్ మెరుగైంది. భారత స్టార్ రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. -
రిత్విక్–నిక్కీ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: సాన్ లూయిస్ ఓపెన్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో రెండో సీడ్ రిత్విక్–నిక్కీ కలియంద పునాచా (భారత్) ద్వయం చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–నిక్కీ జంట 6–3, 6–2తో ఆంటోనీ బెలీర్–మార్క్ హ్యుస్లెర్ (స్విట్జర్లాండ్) జోడీపై గెలిచి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 88 వేలు)ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లను సొంతం చేసుకుంది. రిత్విక్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గత ఏడాది అక్టోబర్‌లో ఇటలీలో జరిగిన ఒల్బ్లా ఓపెన్‌లో అర్జున్ ఖడేతో కలిసి రిత్విక్ తొలిసారి చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెలిచాడు. -
జొకోవిచ్ రికార్డు విజయం
టురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా 36 ఏళ్ల జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–3తో నెగ్గి ఈ టోర్నీని రికార్డుస్థాయిలో ఏడోసారి సొంతం చేసుకున్న తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. గతంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఆరుసార్లు ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు విన్నర్స్ ట్రోఫీతోపాటు 44,11,500 డాలర్ల (రూ. 36 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జొకోవిచ్ 2008, 2012, 2013, 2014, 2015, 2022లలో కూడా ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో చాంపియన్ గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఏడా ది జొకోవిచ్ ఏడు టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. అడిలైడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జొకోవిచ్ ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, యూఎస్ ఓపెన్, పారిస్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ సాధించాడు. కెరీర్లో 98వ సింగిల్స్ టైటిల్‌తో జొకోవిచ్ టెన్నిస్ చరిత్రలో 400 వారాలు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. -
రిత్విక్–అర్జున్ జోడీకి ఏటీపీ చాలెంజర్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో హైదరాబాద్ యువ క్రీడాకారుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ కెరీర్లో తొలి చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటలీలో జరిగిన ఒల్బియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–1, 6–3తో ఇవాన్ సబనోవ్–మాతెజ్ సబనోవ్ (సెర్బియా) జంటపై గెలిచింది. ఈ ఏడాది రిత్విక్ –అర్జున్ జోడీ పోర్టో ఓపెన్, బ్రాన్òÙ్వగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలలో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డారు. మూడో ప్రయత్నంలో ఈ జంట తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ 6–3, 6–4తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఆండ్రీ బెగెమన్ (జర్మనీ)లపై... క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4తో ఆండ్రూ హారిస్–జాన్ ప్యాట్రిక్ (ఆ్రస్టేలియా)లపై... సెమీఫైనల్లో 2–6, 7–6 (11/9), 10–7తో జెబవి–జెడెనెక్ (చెక్ రిపబ్లిక్)లపై గెలుపొందారు. టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ జోడీకి 8,420 యూరోల (రూ. 7 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీ, 125 పాయింట్లు లభించాయి. -
యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టైటిల్
మలోర్కా (స్పెయిన్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలి ఏటీపీ టోర్నీ డబుల్స్ టైటిల్ సాధించాడు. మలోర్కా చాంపియన్‌షిప్ ఏటీపీ–250 టోర్నీ లో యూకీ బాంబ్రీ (భారత్) –లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయం విజేతగా నిలి చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ–హారిస్ జోడీ 6–3, 6–4తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)–ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన యూకీ–హారిస్ జోడీకి 48,380 యూరోల (రూ. 43 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
రాఫెల్ నాదల్కు చుక్కెదురు.. తొలి మ్యాచ్‌లోనే ఓటమి
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్కు తొలి లీగ్ మ్యాచ్‌లో చుక్కెదురైంది. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో గ్రీన్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో తొమ్మిదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7–6 (7/3), 6–1తో నాదల్ (స్పెయిన్)ను ఓడించి శుభారంభం చేశాడు. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రిట్జ్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు నాదల్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవాలంటే నాదల్ ఈ టోర్నీలో విజేతగా నిలవాల్సి ఉంటుంది. -
ATP Belgrade: సెమీ ఫైనల్లో జొకోవిచ్
సొంతగడ్డపై జరుగుతున్న ఏటీపీ 250 టోర్నీ బెల్గ్రేడ్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ దూసుకుపోతున్నాడు. ఈ టోర్నీలో సెర్బియా స్టార్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో జొకోవిచ్ 4–6, 6–3, 6–3 తేడాతో కెక్మనోవిక్ (సెర్బియా)ను ఓడించాడు. తన దేశానికే చెందిన ఆటగాడినుంచి పోటీ ఎదుర్కొని తొలి సెట్ కోల్పోయినా...2 గంటల 18 నిమిషాల ఈ పోరులో చివరకు జొకోవిచ్ తన అనుభవంతో ముందంజ వేశాడు. -
దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్
ఉక్రెయిన్‌పై రష్యా దుందుడుకు వైఖరిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన క్రీడాకారులు తమ దేశంపై రష్యా జరుపుతున్న అమానుష దాడిని వ్యతిరేకిస్తూ పలు విధాలుగా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందని ఫుట్‌బాలర్స్ తాము ఆడుతున్న మ్యాచ్‌ల్లో దేశానికి తమ వంతు మద్దతు తెలుపుతూ అభిమానుల మనసులు చూరగొంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గత శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ క్రీడల్లో రష్యా, బెలారస్‌కు చెందిన జాతీయ జెండాలను ప్రదర్శన చేయొద్దని కోరింది. ఇక దీనికి అదనంగా జాతీయ గీతం, సింబల్స్, కలర్స్‌ను కూడా ఎక్కడా వాడకూడదంటూ ఐవోసీ అధికారి సోమవారం ప్రకటన విడుదల చేశారు. తాజాగా ఐవోసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ ఎలినా విటోలినా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా వైఖరిని ఎండగడుతూ.. మాంటేరీ ఓపెన్‌లో ఆ దేశానికి చెందిన టెన్నిస్ ప్లుయర్ అనస్థీషియా పోటాపోవాతో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ ఆడేది లేదంటూ పేర్కొంది.ఈ విషయాన్ని ట్విటర్లో సుధీర్ఘంగా రాసుకొచ్చింది. ''డియర్ ఆల్.. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్ తరపున ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్ ఆర్గనైజేషన్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఐవోసీ పేర్కొన్న నిబంధనల ప్రకారం రష్యా, బెలారస్‌కు చెందిన అథ్లెట్లను మాములుగా పరిగణించండి. ఆ దేశం తరపున ఎలాంటి జాతీయ జెండాలు, సింబల్స్, కలర్స్, జాతీయ గీతాలు ప్రదర్శన చేయకూడదు. ఇందులో భాగంగానే మాంటేరీ ఓపెన్‌లో రష్యా క్రీడాకారిణితో జరగనున్న మ్యాచ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. సదరు ఆర్గనైజేషన్స్ తమ వైఖరిని తెలిపే వరకు రష్యాతో ఎలాంటి మ్యాచ్ ఆడదలచుకోలేదు. అయితే రష్యన్ అథ్లెట్స్‌ను అవమానించడం ఎంతమాత్రం కాదు. మా దేశంపై దాడి చేయడంలో రష్యా ఆటగాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడాకారులందరూ మద్దతుగా నిలవాల్సినవ అవసరం ఉంది. ముఖ్యంగా రష్యా, బెలారస్‌కు చెందిన ఆటగాళ్లు ముందు నిలబడాల్సిన అవసరం ఉంది.'' అంటూ పేర్కొంది. చదవండి: Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ Rohit Sharma-Saba Karim: కెప్టెన్‌గా ఓకే రోహిత్.. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి ?: భారత మాజీ క్రికెటర్ ✊🏼🇺🇦 #Ukraine #Україна #StandWithUkriane pic.twitter.com/1LT4WjrYI9 — Elina Monfils (@ElinaSvitolina) February 28, 2022 -
19వ 'సారి ఫైనల్‌కు చేరిన రాఫెల్ నాదల్
మెల్బోర్న్: స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ తన కెరీర్లో వరుసగా 19వ ఏడాది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కు సంబంధించిన టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెల్బోర్న్ సమ్మర్ సెట్ ఏటీపీ–250 టోర్నీలో నాదల్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 6–4, 7–5తో ఎమిల్ రుసువోరి (ఫిన్లాండ్)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో మాక్సిమి క్రెసీ (అమెరికా)తో నాదల్ తలపడతాడు. 2004 నుంచి ప్రతి ఏడాది కనీసం ఓ ఏటీపీ టోర్నీలో నాదల్ ఫైనల్ చేరాడు. కెరీర్లో 126వ సింగిల్స్ ఫైనల్ ఆడనున్న నాదల్ 88 టైటిల్స్ సాధించాడు. 37 టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. చదవండి: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
వరల్డ్ నెంబర్ వన్‌పై విజయం.. ఏటీపీ టోర్నీ ఫైనల్స్‌కు అర్హత
Nitto ATP Finals: వచ్చే నెలలో ఇటలీలో జరిగే టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌కు ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) వరుసగా మూడో ఏడాది అర్హత సాధించాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలవడంతో మెద్వెదెవ్కు ఏటీపీ ఫైనల్స్ టోర్నీ బెర్త్ ఖరారైంది. కాగా సోమవారం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్ వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. రెండు గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ... మెద్వెదెవ్ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఇదిలా ఉండగా.. గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. It was @DaniilMedwed's moment to shine at the #USOpen Highlights from the men's singles final 👇 pic.twitter.com/hfP58Ilnio — US Open Tennis (@usopen) September 12, 2021 చదవండి: VIDEO: యూఎస్ ఓపెన్ ఫైనల్లో మరోసారి బయటపడ్డ వెర్రితనం! రాకెట్ విరగొట్టి.. బాల్గర్ల్ను భయపెట్టి.. -
ఫైనల్లో డొమినిక్ థీమ్
లండన్: ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో గతేడాది రన్నరప్ థీమ్ 7–5, 6–7 (10/12), 7–6 (7/5)తో గెలుపొందాడు. రెండో సెట్లో నాలుగు మ్యాచ్ పాయింట్లు వదులుకున్న థీమ్... నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో ఒకదశలో 0–4తో వెనుకబడ్డాడు. కానీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన థీమ్ 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్ మరో పాయింట్ గెలిచినా... ఆ వెంటనే థీమ్ మరో పాయింట్ సాధించి 7–5తో టైబ్రేక్తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. థీమ్ కెరీర్లో ఇది 300వ విజయం కావడం విశేషం. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మెద్వెదేవ్ (రష్యా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో థీమ్ ఆడతాడు. -
సంప్రాస్‌ను దాటిన జొకోవిచ్
రోమ్: ఈ ఏడాది ఓటమి లేకుండా తన జైత్రయాత్ర కొనసాగిస్తున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన కెరీర్లో మరో మైలురాయి అందుకున్నాడు. సోమవారం ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో విజేతగా నిలిచిన జొకోవిచ్ అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ నంబర్‌వన్ ర్యాంకర్ మరో ఘనత వహించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక వారాలపాటు టాప్ ర్యాంక్‌లో నిలిచిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ టాప్ ర్యాంక్‌లో నిలువడంతో అతను ఈ స్థానంలో 287 వారాలు ఉన్నట్టయింది. దాంతో 286 వారాలతో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న అమెరికా దిగ్గజం పీట్ సంప్రాస్ మూడో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో 310 వారాలతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలి స్థానంలో ఉన్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ‘టాప్ ర్యాంక్’ ఘనత స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ–377 వారాలు) పేరిట ఉంది. -
చైనాలో 11 అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు రద్దు
వాషింగ్టన్: చైనాలో జరగాల్సిన పలు అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలపై కరోనా ప్రభావం చూపింది. ఈ దెబ్బకి సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌తో పాటు మరో 10 టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఏటీపీ, డబ్ల్యూటీఏ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. దీంతో చైనా వేదికగా అక్టోబర్–నవంబర్ మధ్య పురుషుల, మహిళల విభాగాల్లో జరగాల్సిన మొత్తం 11 టోర్నీలు రద్దు అయ్యాయి. ఇందులో ఏడు మహిళల విభాగంలో (చైనా ఓపెన్, వుహాన్, జియాంగ్జి , జెంగ్జూ డబ్ల్యూటీఏ ఫైనల్స్, గ్వాంగ్జూ, జుహై ఓపెన్) ఉండగా... మిగతా నాలుగు (చైనా ఓపెన్, షాంఘై మాస్టర్స్ సిరీస్, చెంగ్డూ, జుహై ఓపెన్) పురుషుల విభాగానికి చెందినవి. చైనా ప్రభుత్వ క్రీడా పాలకుల సూచనల ప్రకారమే ఏటీపీ, డబ్ల్యూటీఏ ఈ నిర్ణయం తీసుకున్నాయి. -
ఇదేం షెడ్యూల్: టోనీ నాదల్
మాడ్రిడ్ (స్పెయిన్): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) విడుదల చేసిన కొత్త క్యాలెండర్‌పై 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) అంకుల్, మాజీ కోచ్ టోనీ నాదల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదేం షెడ్యూల్ అంటూ ఏటీపీపై విరుచుకుపడ్డాడు. రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల మధ్య రెండు వారాల వ్యవధి మాత్రమే ఉండటం ఏంటని ఏటీపీని టోనీ ప్రశ్నించాడు. తాజా షెడ్యూల్ ప్రకారం యూఏస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13... ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 మధ్య జరగనున్నాయి. వీటి మధ్యలో మాడ్రిడ్, రోమ్ మాస్టర్స్ టోర్నీలను కూడా నిర్వహించనున్నారు. ఇటువంటి షెడ్యూల్ శారీరకంగా ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూçపుతుందని... ముఖ్యంగా నాదల్, జొకోవిచ్ లాంటి వెటరన్స్‌పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నాడు. -
క్రీడాకారుల సహాయనిధికి రూ. 45 కోట్లు
పారిస్: కరోనా కారణంగా టోర్నీలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్ధమాన క్రీడాకారులను ఆదుకునేందుకు టెన్నిస్ క్రీడా పాలక మండళ్లు నడుం బిగించాయి. వారి సహాయార్థం 60 లక్షల డాలర్ల (రూ. 45.57 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి. ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్లతో పాటు గ్రాండ్‌స్లామ్ టోర్నీ కమిటీలు సంయుక్తంగా ఈ నిధిని ఏర్పాటు చేశాయి. 800 మంది టెన్నిస్ క్రీడాకారులు ఈ నిధితో లబ్ధి పొందే అవకాశముంది.