
లండన్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. గతేడాది నవంబర్ 4వ తేదీనే సెర్బియా స్టార్ జొకోవిచ్‌కు టాప్ ర్యాంక్ కోల్పోయిన అతను... సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజున మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలువడం విశేషం.
సోమవారం విడుదల చేసిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో నాదల్ 9,585 పాయింట్లతో తొలి స్థానంలో... 8,945 పాయింట్లతో జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరి మధ్య 640 పాయింట్ల వ్యత్యాసం ఉంది. వచ్చే వారం లండన్‌లో మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ టోర్నీ అనంతరం టాప్ ర్యాంక్ తారుమారయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment