భారత డేవిస్‌కప్‌ జట్టులో రిత్విక్‌ | Rithvik in Indias Davis Cup team | Sakshi
Sakshi News home page

భారత డేవిస్‌కప్‌ జట్టులో రిత్విక్‌

Published Sat, Dec 28 2024 3:55 AM | Last Updated on Sat, Dec 28 2024 3:55 AM

Rithvik in Indias Davis Cup team

న్యూఢిల్లీ: డేవిస్‌కప్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో పోటీపడే భారత పురుషుల టెన్నిస్‌ జట్టును ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా టోగో జట్టుతో భారత బృందం తలపడుతుంది. అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) సెలెక్షన్‌ ప్యానెల్‌ ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించగా... ఈ ఏడాది అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) సర్క్యూట్‌లో నిలకడగా రాణించిన తెలంగాణ ప్లేయర్‌ బొల్లిపల్లి రితి్వక్‌ చౌదరీ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. 

శశికుమార్‌ ముకుంద్, రామ్‌కుమార్‌ రామనాథన్, శ్రీరామ్‌ బాలాజీ, కరణ్‌ సింగ్‌ జట్టులోని ఇతర సభ్యులు. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్, డబుల్స్‌లో భారత రెండో ర్యాంకర్‌ యూకీ బాంబ్రీ టోగోతో మ్యాచ్‌కు తాము అందుబాటులో ఉండటం లేదని ఏఐటీఏకి తెలిపారు. సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో శశికుమార్, రామ్‌కుమార్‌... డబుల్స్‌ మ్యాచ్‌లో శ్రీరామ్‌ బాలాజీ–రిత్విక్‌ చౌదరీ ఆడే అవకాశం ఉంది. 

ఆర్యన్‌ షా, మానస్‌ ధామ్నె, దక్షిణేశ్వర్‌ సురేశ్, యువన్‌ నందల్‌లను డేవిస్‌కప్‌ సన్నాహక శిబిరానికి ఎంపిక చేశారు. ఈ నలుగురిలో నుంచి ఇద్దరిని రిజర్వ్‌ ప్లేయర్లుగా ఎంపిక చేస్తామని భారత జట్టు నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌ తెలిపారు. స్వీడన్‌తో గత సెప్టెంబర్‌లో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ పోటీలో ఆడిన సిద్ధార్థ విశ్వకర్మ, నిక్కీ పునాచాలను టోగోతో మ్యాచ్‌కు ఎంపిక చేయలేదు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement