అలెక్స్ డి మినార్‌పై గెలుపు
ఏటీపీ ఫైనల్స్ టోర్నీ
ట్యూరిన్ (ఇటలీ): టాప్ టెన్నిస్ స్టార్ల మధ్య జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్‌లో రష్యా ప్లేయర్ డానిలి మెద్వెదెవ్ రెండో లీగ్ మ్యాచ్‌లో గెలిచి గట్టెక్కాడు. మంగళవారం జరిగిన పోరులో మెద్వెదెవ్ 6–2, 6–4తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగిన పోరులో వరుస సెట్లలో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో కంగుతిన్న రష్యన్ స్టార్ ఈ సారి ఆ పొరపాటు చేయలేదు.
ఆరంభం నుంచే తన రాకెట్‌కు పదును పెట్టిన మెద్వెదెవ్ ఆస్ట్రేలియా ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించాడు. ఆసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టాప్–8 ర్యాంకింగ్ ప్లేయర్లను గ్రూపులో నలుగురు చొప్పున విభజించి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ సీజన్ ముగింపు టోర్నీని నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి తొలిరెండు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు సెమీఫైనల్స్‌కు అర్హత సంపాదిస్తారు.
గురువారం జరిగే పోటీల్లో సినెర్‌తో మెద్వెదెవ్, ఫ్రిట్జ్‌తో డి మినార్ తలపడతారు. మరో గ్రూప్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4తో రుబ్లెవ్ (రష్యా)పై గెలుపొందాడు. డబుల్స్ పోరులో ఏడో సీడ్ హ్యారి హెలియోవార (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జోడీ 7–6 (8/3), 7–5తో ఆస్ట్రేలియాకు చెందిన ఐదో సీడ్ జోర్డాన్ థాంప్సన్–మ్యాక్స్ పుర్సెల్ జంటపై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment