ట్యూరిన్: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న 2024 సీజన్‌ను విజయంతో ముగించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచింది. ‘బాబ్ బ్రయాన్ గ్రూప్’లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన బోపన్న–ఎబ్డెన్ ద్వయం... శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7–5, 6–7 (6/8), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది.
ఈ క్రమంలో బోపన్న (44 ఏళ్ల 8 నెలలు) ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజయం సాధించిన అతి పెద్ద వయసు్కడిగా రికార్డు నెలకొల్పాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన క్రావిట్జ్–ప్యూట్జ్ జోడీ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. 2023లో ఎబ్డెన్‌తో జతకట్టిన బోపన్న ఈ టోరీ్నలో చివరిసారి అతనితో కలసి ఆడాడు.
వచ్చే సీజన్‌లో వీరిద్దరు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగుతారు. ఓవరాల్‌గా బోపన్న–ఎబ్డెన్ జంట ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌తో కలిపి నాలుగు ఏటీపీ టోరీ్నల్లో టైటిల్స్ గెల్చుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment