ట్యూరిన్ (ఇటలీ): సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్ సూపర్‌స్టార్ యానిక్ సినెర్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సినెర్ వరుసగా రెండో విజయం సాధించాడు. ‘ఇలీ నస్టాసే గ్రూప్’లో భాగంగా టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు.
ఈ విజయంతో సినెర్‌కు సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖరారైంది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ ఆరు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఒక్కో సెట్‌లో ఒక్కోసారి ఫ్రిట్జ్ సర్వీస్‌ను సినెర్ బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచాడు. 21 విన్నర్స్ కొట్టిన అతను 22 అనవసర తప్పిదాలు చేశాడు.
మరోవైపు ఫ్రిట్జ్ ఏడు ఏస్‌లతో రాణించినా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. 20 విన్నర్స్ కొట్టిన ఫ్రిట్జ్ 31 అనవసర తప్పిదాలు చేశాడు.
‘జాన్ న్యూకోంబ్ గ్రూప్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ తొలి విజయం నమోదు చేసుకున్నాడు. ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో అల్‌కరాజ్ 6–3, 7–6 (10/8)తో గెలుపొందాడు. గంటా 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ 10 ఏస్‌లు సంధించాడు. రెండుసార్లు రుబ్లెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్‌కరాజ్ 33 విన్నర్స్‌తో అలరించాడు.
బోపన్న జోడీకి మరో ఓటమి
ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మ్యాట్ పావిచ్ (క్రొయేíÙయా) జంటతో జరిగిన మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 5–7, 3–6తో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment