మెల్‌బోర్న్: స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ తన కెరీర్‌లో వరుసగా 19వ ఏడాది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కు సంబంధించిన టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెల్‌బోర్న్ సమ్మర్ సెట్ ఏటీపీ–250 టోర్నీలో నాదల్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.
శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 6–4, 7–5తో ఎమిల్ రుసువోరి (ఫిన్‌లాండ్)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో మాక్సిమి క్రెసీ (అమెరికా)తో నాదల్ తలపడతాడు. 2004 నుంచి ప్రతి ఏడాది కనీసం ఓ ఏటీపీ టోర్నీలో నాదల్ ఫైనల్ చేరాడు. కెరీర్‌లో 126వ సింగిల్స్ ఫైనల్ ఆడనున్న నాదల్ 88 టైటిల్స్ సాధించాడు. 37 టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment