కావాలని ఓటమి.. భారీ జరిమానా | Australian tennis player Nick Kyrgios fined | Sakshi
Sakshi News home page

కావాలని ఓటమి.. భారీ జరిమానా

Published Thu, Oct 13 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

కావాలని ఓటమి.. భారీ జరిమానా

కావాలని ఓటమి.. భారీ జరిమానా

షాంఘై: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫేషనల్స్(ఏటీపీ) ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ కు 16,500 డాలర్ల జరిమానా(భారత కరెన్సీలో రూ.11.02 లక్షలు) విధించింది. షాంఘై మాస్టర్స్ టోర్నీలో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఉద్దేశపూర్వకంగా ఓటమిపాలయ్యాడన్న ఆరోపణలతో ఆ మరుసటి రోజు ఏటీపీ చర్యలు తీసుకుంది. వరల్డ్ ర్యాంకర్.14 అయిన కిర్గియోస్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శని కారణంగా 10,000 డాలర్లు, మ్యాచ్ వీక్షిస్తున్న ఓ అభిమానిపై నోరు పారేసుకుని దూషించినందుకు 5000డాలర్ల జరిమానా, క్రమశిక్షణ ఉల్లంఘన కింద మరో 1500 డాలర్ల ఫైన్ వేశారు.

జర్మనీ ప్లేయర్ మిస్కా జ్వెరేవ్ చేతిలో బుధవారం జరిగిన మ్యాచ్ లో రెండో రౌండ్లో ఓటమిపాలయ్యాడు. ఉద్దేవపూర్వకంగానే ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాచ్ లో  స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేదని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతడు మాట్లాడిన తీరు కూడా టెన్నిస్ అసోసియేషన్ కు విసుగు తెప్పించింది. అతడి సమాధానం కూడా పొంతనలేనిదిగా ఉండటంతో కిర్గియోస్ కు భారీ జరిమానా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement