Wimbledon 2022: నిక్‌ కిరియోస్‌పై 10 వేల డాలర్ల జరిమానా | Wimbledon 2022: Nick Kyrgios punished for spitting at fan in Wimbledon | Sakshi
Sakshi News home page

Wimbledon 2022: నిక్‌ కిరియోస్‌పై 10 వేల డాలర్ల జరిమానా

Published Sat, Jul 2 2022 5:17 AM | Last Updated on Sat, Jul 2 2022 5:24 AM

Wimbledon 2022: Nick Kyrgios punished for spitting at fan in Wimbledon - Sakshi

ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద టెన్నిస్‌ ప్లేయర్‌ నిక్‌ కిరియోస్‌పై వింబుల్డన్‌ టోర్నీ నిర్వాహకులు 10 వేల డాలర్ల (రూ. 7 లక్షల 90 వేలు) జరిమానా విధించారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ అనంతరం గ్యాలరీలోని ఓ ప్రేక్షకుడివైపు కిరియోస్‌ ఉమ్మి వేశాడు.

మ్యాచ్‌ సందర్భంగా ఆ ప్రేక్షకుడు విసిగించాడని, అందుకే అతనివైపు ఉమ్మి వేశానని కిరియోస్‌ అన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు అనుచిత ప్రవర్తన కారణంగా 13 మంది ప్లేయర్లపై జరిమానా విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement