nick kyrgios
-
టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి
ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఒక ఆగంతకుడు బ్లాక్పాయింట్లో ఆమె తలకు తుపాకీ గురిపెట్టి కారును దొంగలించడం కలకలం రేపింది. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(ABC) వివరాల వెల్లడించింది. కిర్గియోస్ తల్లి నొర్లాలియా టెస్లా కారులో షాపింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమె కారుకు ఒక దుండగుడు అడ్డు వచ్చాడు. కారు ఆపి ప్రశ్నించేలోపే దుండగుడు నొర్లాలియా తలకు తుపాకీ గురిపెట్టాడు. టెస్లా కారు తాళాలు ఇవ్వమని బెదిరించాడు. దీంతో నొర్లాలియా భయపడిపోయి పక్కకు తప్పుకోవడంతో సదరు దుండగుడు కారుతో ఉడాయించాడు. ఆ తర్వాత నొర్లాలియా పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న కిర్గియోస్ తల్లిని కలిసి జరిగిందంతా తెలుసుకున్నాడు. అయితే తన ఫోన్లో ఉన్న యాప్ సాయంతో కారు ఎక్కడుందో కనుక్కోగలిగాడు. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని కారును స్వాధీనం చేసుకొని.. దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. The mother of Aussie tennis champion @NickKyrgios was left terrified after she was carjacked at gunpoint in Canberra, the thief stole her son's @Tesla. But in a fighting twist, Kyrgios then used the car's technology to stop the offender in his tracks. https://t.co/ywidXMpIlD pic.twitter.com/mXh0f2Ga0M — 7NEWS Sydney (@7NewsSydney) May 2, 2023 చదవండి: Serena Williams: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్‌తో.. -
వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు!
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఓడిపోయాననే బాధలో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టడం వైరల్‌గా మారింది. ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ పేరు సంపాదించిన కిర్గియోస్ ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో చాలాసార్లు తన కోపాన్ని ప్రదర్శించాడు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో కిర్గియోస్లో కోపం కట్టలు తెంచుకుంది. విషయంలోకి వెళితే.. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్థరాత్రి జరిగిన క్వార్టర్స్‌లో రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్ చేతిలో 7-5, 4-6,7-5, 6-7(3-7)తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. దీంతో గ్రాండ్‌స్లామ్ కొట్టాలన్న అతని కల క్వార్టర్స్‌కే పరిమితం కావడంతో కోపం నషాళానికి అంటింది. ప్లేయర్‌కు, అంపైర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన అనంతరం తన బ్యాగు వద్దకు వెళ్లిన కిర్గియోస్.. చేతిలోని రాకెట్‌ను కోపంతో నేలకేసి బాదాడు. అయినా కోపం తగ్గలేదనుకుంటా.. మరో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. అనంతరం బ్యాగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాప్ స్వాప్ అనే సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ''కోపం నషాళానికి అంటింది.. కిర్గియోస్ తన రెండు రాకెట్లను ముక్కలు చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన నిక్ కిర్గియోస్ ఓటమిపై స్పందించాడు. ''నేను ఓడిపోవడం బాధ కలిగించింది. నేను గెలవాలని చాలా మంది మద్దతు ఇచ్చారు. కానీ వారి ఆశలను వమ్ము చేశాను. అందుకే కోపంతో టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టాల్సి వచ్చింది. అయితే కచనోవ్ పోరాటం మెచ్చుకోదగినది. ఈరోజు అతనిలో ఒక ఫైటర్, వారియర్ కనిపించాడు. ఇక ముందు కూడా ఇదే పోరాట పటిమను కనబరిచి గ్రాండ్‌స్లామ్ నెగ్గాలని ఆశిస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక సెమీస్‌కు చేరుకున్న కచనోవ్ నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో తలపడనున్నాడు. ఇప్పటికే నాదల్, మెద్వదేవ్‌లు వెనుదిరగ్గా.. తాజాగా కిర్గియోస్ కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టడంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. Nick Kyrgios restringing his racket after the match pic.twitter.com/Q2TDri1mxa — PropSwap (@PropSwap) September 7, 2022 చదవండి: FIH Awards: ‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్ సింగ్ -
మెద్వెదెవ్కు చుక్కెదురు
న్యూయార్క్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా వివాదాస్పద టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్ యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం సృష్టించాడు. తన దూకుడైన ఆటతో కిరియోస్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఇంటిదారి పట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ కిరియోస్ 7–6 (13/11), 3–6, 6–3, 6–2తో మెద్వెదెవ్పై విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిరియోస్, మెద్వెదెవ్ ఏస్‌లతో హడలెత్తించారు. కిరియోస్ 21, మెద్వెదెవ్ 22 ఏస్‌లు సంధించారు. అయితే అందివచ్చిన బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్న కిరియోస్ విజయం రుచి చూశాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన కిరియోస్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో మరో రష్యా ప్లేయర్ ఖచనోవ్‌తో కిరియోస్ ఆడతాడు. తాజా ఓటమితో మెద్వెదెవ్ వచ్చే సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. మెద్వెదెవ్ స్థానంలో నాదల్ (స్పెయిన్), అల్కరాజ్ (స్పెయిన్), కాస్పర్ రూడ్ (నార్వే)లలో ఒకరు ప్రపంచ నంబర్‌వన్ అవుతారు. మరోవైపు ఐదో ర్యాంకర్ కాస్పర్ రూడ్, ఖచనోవ్ కూడా తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రూడ్ 6–1, 6–2, 6–7 (4/7), 6–2తో ముటెట్ (ఫ్రాన్స్)పై, ఖచనోవ్ 4–6, 6–3, 6–1, 4–6, 6–3తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, బెరెటిని (ఇటలీ) 3–6, 7–6 (7/2), 6–3, 4–6, 6–2తో ఫోకినా (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 6–4తో ఏడో సీడ్ కామెరూన్ నోరి (బ్రిటన్)పై గెలిచారు. కోకో గాఫ్, జబర్ తొలిసారి... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), 46వ ర్యాంకర్ ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 7–5, 7–5తో షుయె జాంగ్ (చైనా)పై గెలుపొందగా... జబర్ 7–6 (7/1), 6–4తో కుదెర్మెటోవా (రష్యా)ను ఓడించింది. మూడో రౌండ్లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించిన తొమ్లాయనోవిచ్ అదే జోరు కొనసాగించి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–1తో సమ్సోనోవా (రష్యా)పై గెలిచింది. కెరీర్లో 42వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న గార్సియా 6–4, 6–1తో అలీసన్ రిస్కే అమృత్‌రాజ్ (అమెరికా)ను ఓడించింది. -
జొకోవిచ్‌దే వింబుల్డన్.. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్
'నా హృదయంలో ఈ టోర్నీకి ప్రత్యేక స్థానం ఉంది. నా వివాహ వార్షికోత్సవం రోజున నా శ్రీమతికి వింబుల్డన్ ట్రోఫీ రూపంలో కానుక ఇచ్చాను.' –జొకోవిచ్ లండన్: పచ్చిక కోర్టులపై తనకు ఎదురులేదని నిరూపిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఏడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 4–6, 6–3, 6–4, 7–6 (7/3)తో అన్‌సీడెడ్, ప్రపంచ 40వ ర్యాంకర్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్‌కిది వరుసగా నాలుగో వింబుల్డన్ టైటిల్ కావడం విశేషం. 2018, 2019, 2021లలోనూ జొకోవిచ్ విజేతగా నిలిచాడు. అంతకుముందు 2011, 2014, 2015లలో కూడా ఈ సెర్బియా స్టార్ చాంపియన్ అయ్యాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించలేదు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల బ్రిటిష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్ కిరియోస్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 35 ఏళ్ల జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను తొమ్మిదిసార్లు, ఫ్రెంచ్ ఓపెన్‌ను రెండుసార్లు, యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు గెలిచాడు. తొలి సెట్ కోల్పోయినా... కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన కిరియోస్ తొలి సెట్లో జొకోవిచ్పై ఆధిక్యం ప్రదర్శించాడు. ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–2తో ముందంజ వేసిన కిరియోస్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే కెరీర్లో 32వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్ తొలి సెట్ చేజార్చుకున్నా ఆందోళన చెందకుండా నెమ్మదిగా జోరు పెంచాడు. కచ్చితమైన సర్వీస్‌లతోపాటు నెట్ వద్దకు దూసుకొస్తూ కిరియోస్‌ను ఒత్తిడికి గురి చేశాడు. నాలుగో గేమ్‌లో కిరియోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో తొమ్మిదో గేమ్‌లో కిరియోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పదో గేమ్‌లో తన సర్వీస్ నిలబెట్టుకొని జొకోవిచ్ సెట్‌ను గెలిచాడు. నాలుగో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కోల్పోలేదు. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. కాగా నిక్ కిరియోస్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం. సెమీస్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ పొత్తి కడుపు నొప్పితో మ్యాచ్ మధ్యలోనే వైదొలగొడంతో కిరియోస్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాడు. 🙏🏼❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/MWP4VRwvfg — Novak Djokovic (@DjokerNole) July 10, 2022 😘#Wimbledon | #CentreCourt100 | @DjokerNole pic.twitter.com/Y6K5hPs58K — Wimbledon (@Wimbledon) July 10, 2022 Magnificent. In its 100 years, Centre Court has seen few champions like @DjokerNole#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/vffvL2f08Q — Wimbledon (@Wimbledon) July 10, 2022 -
Wimbledon 2022: నిక్ కిరియోస్‌పై 10 వేల డాలర్ల జరిమానా
ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్‌పై వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు 10 వేల డాలర్ల (రూ. 7 లక్షల 90 వేలు) జరిమానా విధించారు. తొలి రౌండ్ మ్యాచ్ అనంతరం గ్యాలరీలోని ఓ ప్రేక్షకుడివైపు కిరియోస్ ఉమ్మి వేశాడు. మ్యాచ్ సందర్భంగా ఆ ప్రేక్షకుడు విసిగించాడని, అందుకే అతనివైపు ఉమ్మి వేశానని కిరియోస్ అన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు అనుచిత ప్రవర్తన కారణంగా 13 మంది ప్లేయర్లపై జరిమానా విధించారు. -
'తెలుసుకొని మాట్లాడితే మంచిది'.. రిఫరీతో దురుసు ప్రవర్తన
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్‌కు కోపం ఎక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టెన్నిస్ స్టార్ కోర్టులో సీరియస్‌గా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఎవరైనా గెలికారో ఇక అంతే సంగతులు. తాజాగా నిక్ కిర్గియోస్ తన కోపాన్ని మరోసారి చూపించాడు. ఏటీపీ 500 హాలే ఓపెన్‌లో బుధవారం రాత్రి నిక్ కిర్గియోస్, సిట్సిపాస్ మధ్య నాలుగో రౌండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కిర్గియోస్ 5-7, 6-2, 6-4తో సిట్సిపాస్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరాడు. అయితే మ్యాచ్‌లో రెండో రౌండ్ సందర్భంగా సిట్సిపాస్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కిర్గియోస్ సర్వీస్ చేయడంలో సమయం ఎక్కువ తీసుకున్నాడు. తనకు సర్వీస్ వచ్చిన ప్రతీసారి అదే చేయడంతో లైన్ అంపైర్(రిఫరీ)..''తొందరగా సర్వీస్ చెయ్.. నీ వల్ల సమయం వృథా అవుతుంది.. ప్రత్యర్థి ఆటగాడి ఫోకస్ దెబ్బ తింటుంది'' అంటూ కిర్గియోస్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇది విన్న కిర్గియోస్‌కు కోపం నషాళానికి అంటింది. అంపైర్‌వైపు కోపంగా చూస్తూ.. ''నేను టైం వేస్ట్ చేయడం లేదు.. కాస్త అలసటగా ఉండడంతో మెళ్లిగా సర్వీస్ చేస్తున్నా.. అనే ముందు తెలుసుకొని మాట్లాడితే మంచిది'' అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్వార్టర్స్‌లో కిర్గియోస్.. కారెన్నోతో తలపడనున్నాడు. *time violation warning mr Kyrgios* the supervisor arrives, Tsitsipas keeps serving, everything is so perfect pic.twitter.com/yJT79W3U9M — Garbee|| Serena is coming ❤️ (@muguruthlessN1) June 15, 2022 చదవండి: Base Ball Game: అది బేస్‌బాల్ గేమ్.. ఏమరపాటుగా ఉంటే అంతే సంగతి! -
నాదల్ ఖాతాలో 19వ విజయం
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ ఏడాది వరుసగా 19వ విజయం నమోదు చేశాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో నాదల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–6 (7/0), 5–7, 6–4తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. ఈ సీజన్లో మెల్బోర్న్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, మెక్సికో ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాదల్ నాలుగో టైటిల్‌కు రెండు విజయాల దూరంలో ఉన్నాడు. -
టెన్నిస్ స్టార్ అసహనం.. మతి పోయిందా ఏమన్నా అయ్యుంటే?
ఆస్ట్రేలియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీలో భాగంగా రఫెల్ నాదల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 7-6(0), 5-7, 6-4తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ముగియడంతో ఆటగాళ్లిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చకున్నారు. ఆ తర్వాత కోర్టు అంపైర్‌కు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది. అసలు కథ మొదలైంది ఇక్కడే. నాదల్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయాడేమో.. కిర్గియోస్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. తన చేతిలో ఉన్న రాకెట్‌ను బలంగా నేలకేసి కొట్టడంతో అది కాస్తా పల్టీలు కొట్టుకుంటూ బాల్ బాయ్ వైపు వెళ్లింది. అయితే బాల్‌బాయ్ చాకచక్యంగా వ్యవహరించిన పక్కకు తప్పుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో షాక్ తిన్న అభిమానులు కిర్గియోస్ వైఖరిని తప్పుబట్టారు. ''నాదల్ చేతిలో ఓడినంత మాత్రానా సహనం కోల్పోవాలా.. అయినా రాకెట్‌ను అలా నేలకేసి కొట్టడం ఏంటి.. కాస్తైనా బుద్దుందా.. బాల్‌బాయ్ తగిలిని గాయాలు సీరియస్ అయితే పరిస్థితి ఏంటని'' ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాసేపటికి విషయం తెలుసుకున్న కిర్గియోస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా బాల్బాయ్కు క్షమాపణ చెప్పుకున్నాడు. ''ఏదో మ్యాచ్ ఓడిపోయాడననే కోపంలో అలా చేశాను. కావాలని మాత్రం చేయలేదు. నేను నేలకేసి కొట్టిన రాకెట్ యాక్సిడెంటల్‌గా వెళ్లి బాల్బాయ్కి తగిలింది. అతనికి తగలడం నాకు బాధ కలిగించింది. ఆ బాల్ బాయ్ గురించి ఎవరైనా తెలిస్తే చెప్పండి. వెంటనే అతనికి ఒక టెన్నిస్ రాకెట్‌ను గిఫ్ట్‌గా అందిస్తా. ఆ అబ్బాయి బాగుండాలని కోరుకుంటున్నా'' అంటూ రాసుకొచ్చాడు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలే జర్మనీకి చెందిన 24 ఏళ్ల టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కోర్టు అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ అతన్ని కొట్టినంత పని చేయడం ఎవరు మరిచిపోలేదు. ఈ విషయంలో జ్వెరెవ్ క్షమాపణ కోరడంతో సస్పెన్షన్ నిలిపివేశారు. అంతకముందు సెర్బియా టెన్నిస్‌స్టార్ నొవాక్ జొకోవిచ్.. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చాలా సందర్భాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించారు. దీంతో ఇప్పటికైనా కోర్టులో ఉన్నంతసేపు ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అణిచిపెట్టుకునేలా రూల్స్ సవరించాలని.. మరోసారి ఏ ఆటగాడు కోర్టు ఆవరణలో సహనం కోల్పోకుండా ఉండాలంటే.. మ్యాచ్‌ల నిషేధం లేదా భారీ జరిమానా విధించడం చేస్తే కరెక్ట్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: Avesh Khan- Venkatesh Iyer: అయ్యర్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీసిన ఆవేశ్ ఖాన్.. వీడియో PAK vs AUS: 24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే 19 and counting 👏@RafaelNadal remains unbeaten this year and defeats Kyrgios to reach his 76th Masters 1000 semi-final of his career!#IndianWells pic.twitter.com/GelYj9S44L — Tennis TV (@TennisTV) March 18, 2022 Nick Kyrgios’ temper tantrums creating a dangerous environment for everyone involved. barely two weeks after Alexander Zverev whacked his racket against the umpire’s chair. and this is supposed to be a “poised” sport? pic.twitter.com/422PnfesE3 — m⁴⁷ FRAUDIAN WELLS (@tsitschurrow) March 18, 2022 -
కుడిచేయిపై కత్తి గాట్లు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టెన్నిస్ స్టార్
ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2019 తనకు డార్క్ పీరియడ్‌లా అనిపించిందని.. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలిగాయంటూ పేర్కొన్నాడు. నిక్ కిర్గియోస్ తన మెంటల్ హెల్త్ సమస్యలపై గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘ సందేశాన్ని రాసుకొచ్చాడు. ''ఇదంతా మూడేళ్ల కిందటి మాట. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ నాకు డార్క్ పీరియడ్ లాంటిది. పైకి మంచిగ కనిపిస్తున్నప్పటికి మానసికంగా చాలా దెబ్బతిన్నా. డ్రగ్స్ అలవాటు, విపరీతంగా తాగేయడం, ఫ్యామిలీ గొడవలు నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. సరైన నిద్ర లేకపోవడం.. పడుకున్న మంచంపై నుంచి లేచినా ఏదో బరువు ఉన్నట్లుగా అనిపించేది. మెంటల్ డిప్రెషన్లో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఎవరిని నమ్మేవాడిని కాదు.. ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఇవన్నీ చూసి ఒక దశలో నాకు ఆత్మహత్య ఆలోచనలు కలిగాయి. మీరు నా కుడి చేయిని దగ్గరగా గమనిస్తే.. కత్తిగాట్లు కనిపిస్తాయి. ఆ గాట్లు నేనే పెట్టుకున్నా. పిచ్చి ఆలోచనల నుంచి బయటపడడానికి చాలా సమయమే పట్టింది. ఒక పాజిటివ్ ఎనర్జీని పొందడానికి చాలా కష్టపడ్డా. ఇప్పుడు మాత్రం ఒంటరి అనే భావన పూర్తిగా పోయింది. ప్రతి చిన్న విషయానికి కుంగిపోకుండా.. పాజిటివ్ మైండ్‌తో ఉండడం నేర్చుకున్నా. మనం ఉన్నంతకాలం చిరునవ్వుతో బతకాలి.. ఈ జీవితం చాలా అందమైనది'' అంటూ ముగించాడు. ఇక గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో నిక్ కిర్గియోస్ మూడో రౌండ్లో వెనుదిరిగి కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా ఆరునెలల పాటు సుధీర్ఘ బ్రేక్ తీసుకున్న కిర్గియోస్.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. సింగిల్స్‌లో ఆకట్టులేకపోయినప్పటికి డబుల్స్‌లో మాత్రం తానఇస కొక్కినాకిస్తో కలిసి టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. కాగా ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నిక్ కిర్గియోస్ 38వ ర్యాంక్‌తో కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. చదవండి: 'పేరులోనే వ్లాదిమిర్.. ఉక్రెయిన్ తరపునే పోరాటమన్న బాక్సింగ్ లెజెండ్స్' Ind Vs SL 1st T20I: అక్కడ ఉంది శ్రేయాస్ అయ్యర్.. డౌట్ అక్కర్లేదు View this post on Instagram A post shared by Nick Kyrgios (@k1ngkyrg1os) -
'మా ఆటను చూసి భయపడ్డారు.. ఇంకేం ఫైట్ చేస్తారు'
ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ డబుల్స్ నెంబర్ వన్ జంట నికోలా మెక్టిక్, మేట్ పావిక్లు మాతో ఫైట్ చేయడానికి భయపడ్డారంటూ పేర్కొనడం సంచలనం రేపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ రెండో రౌండ్లో నిక్ కిర్గియోస్, తానాసి కొక్కినకిస్ జంట క్రొయేషియాకు చెందిన నికోలా మెక్టిక్, మేట్ పావిక్ జంటను 7-6, 6-3 ఓడించింది. ఈ మ్యాచ్‌ను గెలిచిన నిక్ కిర్గియోస్.. ప్రత్యర్థిపై తన మాటలతోనూ మానసికంగానూ పైచేయి సాధించాలనుకున్నాడు. చదవండి: Australian Open 2022: డిఫెండింగ్ చాంపియన్‌కు షాకిచ్చిన అన్‌సీడెడ్ ప్లేయర్ మ్యాచ్ ముగిసిన అనంతరం లాకర్ రూమ్‌కు వెళ్లిన కిర్గియోస్.. అక్కడ నికోలా మెక్టిక్, మేట్ పావిక్ల కోచ్, ట్రైనర్ కనిపించారు. వారి వద్దకు వెళ్లిన కిర్గియోస్ డిబేట్ చేశాడు. ''ఆ ఇద్దరు మా ఆటను చూసి భయపడిపోయారు.. ఇంకేం ఫైట్ చేస్తారు'' అంటూ పేర్కొన్నాడు. ఇక కిర్గియోస్ ప్రవర్తనపై టెన్నిస్ అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. మొన్న సింగిల్స్ మ్యాచ్‌లో డేనియల్ మెద్వదేవ్‌ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన కిర్గియోస్.. ఆ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యి చేతలు కాల్చుకున్నాడు. తాజాగా డబుల్స్ మ్యాచ్‌లో విజయం సాధించగానే తనలోని మరో కోణాన్ని బయటకు తీశాడు. సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నాననే గర్వం కిర్గియోస్లో కనిపిస్తుంది.. అదే అతని పతనానికి కారణమవుతుందని కామెంట్స్ చేశారు. అయితే లాకర్ రూమ్‌లో కిర్గియోస్ పెట్టిన డిబేట్ వీడియో ప్రత్యక్షమవడం.. క్షణాల్లో వైరల్ కావడం జరిగిపోయింది. చదవండి: Daniil Medvedev: గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం Things got HEATED in the locker room after Nick Kyrgios and Thanasi Kokkinakis' doubles win 😳 Grothy got the inside word 🌶️#AusOpen - Live on Channel 9 and 9Now pic.twitter.com/iD26iHnUW1 — Wide World of Sports (@wwos) January 21, 2022 -
గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో పరుషుల ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డేనియల్ మెద్వదెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు పదేపదే మెద్వదేవ్‌ను తమ మాటలతో అవమానపరచడం అతన్ని బాధించింది. ఈ విషయాన్ని మెద్వదేవ్ మ్యాచ్ ముగిసిన అనంతరం కోర్టులో కామెంటేటర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు లో ఐక్యూ. ఒక క్రీడాకారుడితో ఎలా ప్రవర్తించాలన్న కనీస పరిజ్ఞానం లేదు. ఒకప్పుడు నేను తెలిసి తెలియకుండా చేసిన తప్పుకు ఇలా అవమానించడం కరెక్టు కాదు. ఆటగాళ్లకు కాస్త గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. మనషులమన్న సంగతి మరిచి రోబోల్లా ప్రవర్తించారు..'' అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన క్రమంలో డేనియల్ మెద్వదేవ్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు వింత అనుభవం చూపించాడు. మ్యాచ్ సమయంలో గట్టిగట్టిగా అరుస్తూ.. తన చర్యలతో ప్రేక్షకులకు కాస్త విసుగు పుట్టించాడు. అప్పట్లో ఈ ఘటన మెద్వదేవ్‌ను విలన్‌గా మార్చేసింది. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో రెండోరౌండ్ మ్యాచ్‌లో లోకల్ ఆటగాడు నిక్ కిర్గియోస్‌తో తలపడ్డాడు. మ్యాచ్ ఆడుతున్నంతసేపు నిక్ కిర్గియోస్ పదే పదే ప్రేక్షకుల వైపు చూస్తూ మెద్వదేవ్‌ను రెచ్చగొట్టండంటూ ఎంకరేజ్ చేయడం విశేషం. మ్యాచ్ ముగిసేవరకు సైలెంట్‌గా ఉన్న మెద్వదేవ్... ఆ తర్వాత కామెంటరీ ఇంటర్వ్యూలో తన ఆగ్రహాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డేనియల్ మెద్వదేవ్ రెండో రౌండ్లో నిక్ కిర్గియోస్‌పై 7-6, 6-4,4-6,6-2తో ఓడించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ముర్రే రెండో రౌండ్లోనే వైదొలగడంతో.. నాదల్ తర్వాత మెద్వదేవ్ టైటిల్ ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. కాగా మెద్వదేవ్ 2021 యూఎస్ ఓపెన్ విజేత అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. గతేడాది యూఎస్ ఓపెన్ గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునన్న మెద్వదేవ్ కెరీర్లో 13 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. "Show some respect." 😡😡 Daniil Medvedev was NOT happy with the crowd behaviour tonight and he let them know in the on-court interview! 😳 #AusOpen - Live on Channel 9 and 9Now pic.twitter.com/5UKAFOuV9v — Wide World of Sports (@wwos) January 20, 2022 -
యూఎస్ ఓపెన్‌కు కిరియోస్ దూరం
సిడ్నీ: ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తాను బరిలోకి దిగడంలేదని ఆస్ట్రేలియా వివాదాస్పద ఆటగాడు, ప్రపంచ 40వ ర్యాంకర్ నిక్ కిరియోస్ తెలిపాడు. మూడు రోజుల క్రితమే మహిళల ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) కూడా కరోనా కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు కరోనాతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో మరోవైపు టెన్నిస్ ఆడటం ఏంటని కిరియోస్ ప్రశ్నించాడు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావంగానే తానీ నిర్ణయం తీసుకున్నాని అన్నాడు. ‘ఈ ఏడాది జరిగే యూఎస్ ఓపెన్‌లో నేను పాల్గొనడం లేదు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం’ అని 25 ఏళ్ల కిరియోస్ పేర్కొన్నాడు. -
కిర్గియోస్‌కు రూ.80 లక్షల జరిమానా!
సిన్సినాటి: కెరీర్ ఆరంభంనుంచి వివాదాలతో సహవాసం చేస్తున్న ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ ఇప్పుడు దూషణల పర్వాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాడు! ఫలితంగా భారీ జరిమానాకు గురవడంతో పాటు నిషేధానికి కూడా చేరువయ్యాడు. సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్లో పరాజయం అనంతరం అతని ప్రవర్తన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ మ్యాచ్‌లో కరెన్ కచనోవ్ (రష్యా) 6–7, 7–6, 6–2తో కిర్గియోస్‌ను ఓడించాడు. మ్యాచ్ ముగిశాక కిర్గియోస్ అంపైర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చెత్త అంపైర్ అంటూ దుర్భాషలాడుతూ అతని వైపు ఉమ్మేశాడు! మ్యాచ్‌లో అప్పటికే టైమ్ నిబంధనను అతిక్రమించడం, అనుమతి లేకుండా కోర్టును వీడటం, రెండు సార్లు రాకెట్లు విరగ్గొట్టడంవంటి చేసేశాడు. దాంతో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ ఏటీపీ ఏకంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే 9 అభియోగాలు నమోదు చేసింది. అన్నీ కలిపి లక్షా 13 వేల డాలర్లు (సుమారు రూ. 80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇది తక్షణ చర్య మాత్రమేనని, మున్ముందు పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కిర్గియోస్‌పై మరింత తీవ్ర చర్య ఉండవచ్చని కూడా ఏటీపీ ప్రకటించింది. ప్రపంచ 27వ ర్యాంకర్ అయిన 24 ఏళ్ల కిర్గియోస్‌పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో శిక్షలకు గురయ్యాడు. -
విజేత కిరియోస్
అకాపుల్కో (మెక్సికో): వివాదాస్పద ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్ ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాడు. మెక్సికో ఓపెన్‌లో అతను విజేతగా అవతరించాడు. ఫైనల్లో కిరియోస్ 6–3, 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించి కెరీర్లో ఐదో సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన కిరియోస్‌కు 3,67,630 డాలర్ల (రూ. 2 కోట్ల 61 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ స్థానంలో ఉన్న కిరియోస్ ఈ టోర్నీలో పలు సంచలన విజయాలు నమోదు చేశాడు. రెండో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని నెగ్గగా... క్వార్టర్ ఫైనల్లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను... సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ జాన్ ఇస్నెర్ (అమెరికా)ను ఓడించి ఫైనల్‌కు చేరాడు. -
వెక్కి వెక్కి ఏడ్చిన బాల్ గర్ల్
లండన్: టెన్నిస్ టోర్నీల్లో బాల్ బాయ్స్, బాల్‌గర్ల్స్ కీలకంగా వ్యవహారిస్తుంటారు. టెన్నిస్ ఆటగాళ్లు కొట్టిన సర్వ్‌లకు బంతి బయటకు వెళ్లినా.. కోర్టులో పడినా పరుగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆటగాళ్లు కొట్టిన బంతులు తగిలి గాయపడే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి సంఘటనే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో బుధవారం చోటు చేసుకుంది. ఉబ్బెకిస్తాన్ ప్లేయర్ ఇస్టోమిన్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ కొట్టిన బలమైన సర్వ్ ప్రమాదవశాత్తూ ఒక బాల్‌గర్ల్‌కు తగిలింది. 217 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి తగలడంతో నొప్పి తట్టుకోలేకపోయిన ఆ బాల్ గర్ల్ వెక్కి వెక్కి ఏడ్చింది. దాంతో, ఇస్టోమిన్‌తో పాటు కిర్గియోస్ ఆమె దగ్గరికి వచ్చి ఓదార్చారు. ‘ బంతి తగిలిన శబ్ధాన్ని నేను విన్నాను. అయితే స్కోరు బోర్డును తాకిందని అనుకున్నా. ఆ తర్వాత ఆమె చేతికి తగిలిందనే విషయం అర్ధమైంది. దాంతో ఆమె ఏడ్చేసింది. నాకు తగిలినా ఏడ్చేసేవాడిని. ఇది చాలా బాధాకరం. ఆమె ఒక చాంపియన్. త్వరగా ఆమె కోలుకుని ఎప్పటిలాగే విధులకు హాజరవుతుందని ఆశిస్తున్నా’ అని మ్యాచ్ తర్వాత కిర్గియోస్ పేర్కొన్నాడు. -
కిర్గియోస్ కొట్టిన బలమైన సర్వ్ ప్రమాదవశాత్తూ..
-
కావాలని ఓటమి.. భారీ జరిమానా
షాంఘై: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫేషనల్స్(ఏటీపీ) ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ కు 16,500 డాలర్ల జరిమానా(భారత కరెన్సీలో రూ.11.02 లక్షలు) విధించింది. షాంఘై మాస్టర్స్ టోర్నీలో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఉద్దేశపూర్వకంగా ఓటమిపాలయ్యాడన్న ఆరోపణలతో ఆ మరుసటి రోజు ఏటీపీ చర్యలు తీసుకుంది. వరల్డ్ ర్యాంకర్.14 అయిన కిర్గియోస్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శని కారణంగా 10,000 డాలర్లు, మ్యాచ్ వీక్షిస్తున్న ఓ అభిమానిపై నోరు పారేసుకుని దూషించినందుకు 5000డాలర్ల జరిమానా, క్రమశిక్షణ ఉల్లంఘన కింద మరో 1500 డాలర్ల ఫైన్ వేశారు. జర్మనీ ప్లేయర్ మిస్కా జ్వెరేవ్ చేతిలో బుధవారం జరిగిన మ్యాచ్ లో రెండో రౌండ్లో ఓటమిపాలయ్యాడు. ఉద్దేవపూర్వకంగానే ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాచ్ లో స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేదని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతడు మాట్లాడిన తీరు కూడా టెన్నిస్ అసోసియేషన్ కు విసుగు తెప్పించింది. అతడి సమాధానం కూడా పొంతనలేనిదిగా ఉండటంతో కిర్గియోస్ కు భారీ జరిమానా వేశారు. -
'నాపై ఎందుకింత పక్షపాతం'
మెల్బోర్న్: రియో ఒలింపిక్స్ కు వెళ్లనున్న ఆస్ట్రేలియా టెన్నిస్ జట్టు నుంచి ఆ దేశ స్టార్ ఆటగాడు నిక్ కిరియోస్ ను పక్కకు పెట్టడంతో అతను ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీపై మండిపడ్డాడు. ఆస్ట్రేలియా ఒలింపిక్ చీఫ్ తనను కావాలనే తప్పించారని విమర్శించాడు. తాను రియోలో దేశానికి పతకం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతానని స్పష్టం చేసినా పట్టించుకోలేదన్నాడు. ఇలా జరగడం నిజంగా దురదృష్టమని కిరియోస్ పేర్కొన్నాడు. 'గత నాలుగు వారాల నుంచి నా పట్ల మా ఒలింపిక్ చీఫ్ ప్రవర్తన బాగాలేదు. నాతో పక్షపాతంగా వ్యవహరించారు. రియోలో పాల్గొనే ఆస్ట్రేలియా ఒలింపిక్స్ జట్టులో నేను పాల్గొనే అర్హత ఉన్నా, మా ఒలింపిక్ చీఫ్ మాత్రం అన్యాయంగా ప్రవర్తించారు. నాపై ఎందుకింత పక్షపాతం. ఇక ఈ అంశంపై ఒలింపిక్ కమిటీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు' అని కిరియోస్ స్పష్టం చేశాడు. -
కిరియోస్ కేక
ఏడో సీడ్ రావ్నిక్పై సంచలన విజయం 11వ సీడ్ దిమిత్రోవ్‌కు గాస్కే షాక్ ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, వావ్రింకా వింబుల్డన్ టోర్నమెంట్ లండన్: గతేడాది మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్‌ను మట్టికరిపించి వెలుగులోకి వచ్చిన ఆస్ట్రేలియా యువతార నిక్ కిరియోస్ ఈసారి మరో సంచలనం సృష్టించాడు. నిరుడు సెమీఫైనల్ చేరుకున్న ఏడో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా)పై కిరియోస్ అద్భుత విజయం సాధించి వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో 27వ సీడ్ కిరియోస్ 5-7, 7-5, 7-6 (7/3), 6-3తో రావ్నిక్ను కంగుతినిపించాడు. 2 గంటల 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 20 ఏళ్ల కిరియోస్ 34 ఏస్‌లు సంధించాడు. రెండో సెట్లో ఒకసారి, నాలుగో సెట్లో మరోసారి రావ్‌నిక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ ఆసీస్ రైజింగ్ స్టార్ కేవలం 13 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు షరపోవా ప్రియుడు, 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 21వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-4తో నిరుటి సెమీఫైనలిస్ట్ దిమిత్రోవ్‌ను ఓడించి 2012 తర్వాత ఈ టోర్నీలో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గాస్కే ప్రతి సెట్లో ఒక్కోసారి దిమిత్రోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. సోమవారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో కిరియోస్తో గాస్కే తలపడతాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), 14వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. జొకోవిచ్ 6-3, 6-3, 6-3తో 27వ సీడ్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించగా... వావ్రింకా 6-4, 6-3, 6-4తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)ను ఓడించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై ఐదు సెట్ల పోరాటంలో నెగ్గిన వెర్దాస్కో ఈసారి వావ్రింకా ధాటికి వరుస సెట్లలో చేతులెత్తేశాడు. డేవిడ్ గాఫిన్ 6-3, 6-4, 6-2తో బగ్ధాటిస్ (సైప్రస్)పై, అండర్సన్ 6-4, 7-6 (8/6), 6-3తో 24వ సీడ్ మాయెర్ (అర్జెంటీనా)పై గెలిచారు. షరపోవా జోరు మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) తన విజయపరంపరను కొనసాగిస్తోంది. మూడో రౌండ్లో నాలుగో సీడ్ షరపోవా 6-4, 6-3తో ఇరీనా కామెలియా బెగూ (రుమేనియా)ను ఓడించింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 3-6, 6-3, 6-1తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, 16వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-3, 6-2తో అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)పై, కోకో వాండెవెగె (అమెరికా) 6-2, 6-0తో 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, 23వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-4, 6-4తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)పై, 30వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 7-5, 7-5తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)పై నెగ్గారు. మరో మ్యాచ్‌లో జరీనా దియాస్ (కజకిస్తాన్) 7-5, 6-4తో 14వ సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జంట పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్లో బోపన్న-మెర్జియా 7-5, 7-6 (7/5), 7-6 (7/5)తో థామస్ బెలూచీ (బ్రెజిల్)-గిలెర్మో దురాన్ (అర్జెంటీనా)లపై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మహేశ్ భూపతి (భారత్)-అలా కుద్రయెత్సోవా (రష్యా) జంట 7-5, 3-6, 2-6తో నికొలస్ మోన్రో-మాడిసన్ బ్రెంగిల్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది.