ఆస్ట్రేలియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీలో భాగంగా రఫెల్ నాదల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 7-6(0), 5-7, 6-4తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ముగియడంతో ఆటగాళ్లిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చకున్నారు. ఆ తర్వాత కోర్టు అంపైర్‌కు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది.
అసలు కథ మొదలైంది ఇక్కడే. నాదల్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయాడేమో.. కిర్గియోస్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. తన చేతిలో ఉన్న రాకెట్‌ను బలంగా నేలకేసి కొట్టడంతో అది కాస్తా పల్టీలు కొట్టుకుంటూ బాల్ బాయ్ వైపు వెళ్లింది. అయితే బాల్‌బాయ్ చాకచక్యంగా వ్యవహరించిన పక్కకు తప్పుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో షాక్ తిన్న అభిమానులు కిర్గియోస్ వైఖరిని తప్పుబట్టారు.
''నాదల్ చేతిలో ఓడినంత మాత్రానా సహనం కోల్పోవాలా.. అయినా రాకెట్‌ను అలా నేలకేసి కొట్టడం ఏంటి.. కాస్తైనా బుద్దుందా.. బాల్‌బాయ్ తగిలిని గాయాలు సీరియస్ అయితే పరిస్థితి ఏంటని'' ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాసేపటికి విషయం తెలుసుకున్న కిర్గియోస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాల్‌బాయ్‌కు క్షమాపణ చెప్పుకున్నాడు.
''ఏదో మ్యాచ్ ఓడిపోయాడననే కోపంలో అలా చేశాను. కావాలని మాత్రం చేయలేదు. నేను నేలకేసి కొట్టిన రాకెట్ యాక్సిడెంటల్‌గా వెళ్లి బాల్‌బాయ్‌కి తగిలింది. అతనికి తగలడం నాకు బాధ కలిగించింది. ఆ బాల్ బాయ్ గురించి ఎవరైనా తెలిస్తే చెప్పండి. వెంటనే అతనికి ఒక టెన్నిస్ రాకెట్‌ను గిఫ్ట్‌గా అందిస్తా. ఆ అబ్బాయి బాగుండాలని కోరుకుంటున్నా'' అంటూ రాసుకొచ్చాడు.
గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలే జర్మనీకి చెందిన 24 ఏళ్ల టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కోర్టు అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ అతన్ని కొట్టినంత పని చేయడం ఎవరు మరిచిపోలేదు. ఈ విషయంలో జ్వెరెవ్ క్షమాపణ కోరడంతో సస్పెన్షన్ నిలిపివేశారు. అంతకముందు సెర్బియా టెన్నిస్‌స్టార్ నొవాక్ జొకోవిచ్.. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చాలా సందర్భాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించారు. దీంతో ఇప్పటికైనా కోర్టులో ఉన్నంతసేపు ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అణిచిపెట్టుకునేలా రూల్స్ సవరించాలని.. మరోసారి ఏ ఆటగాడు కోర్టు ఆవరణలో సహనం కోల్పోకుండా ఉండాలంటే.. మ్యాచ్‌ల నిషేధం లేదా భారీ జరిమానా విధించడం చేస్తే కరెక్ట్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
చదవండి: Avesh Khan- Venkatesh Iyer: అయ్యర్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీసిన ఆవేశ్ ఖాన్.. వీడియో
PAK vs AUS: 24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే
19 and counting 👏@RafaelNadal remains unbeaten this year and defeats Kyrgios to reach his 76th Masters 1000 semi-final of his career!#IndianWells pic.twitter.com/GelYj9S44L
— Tennis TV (@TennisTV) March 18, 2022
Nick Kyrgios’ temper tantrums creating a dangerous environment for everyone involved. barely two weeks after Alexander Zverev whacked his racket against the umpire’s chair. and this is supposed to be a “poised” sport? pic.twitter.com/422PnfesE3
— m⁴⁷ FRAUDIAN WELLS (@tsitschurrow) March 18, 2022
Comments
Please login to add a commentAdd a comment