tennis racket
-
వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు!
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఓడిపోయాననే బాధలో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టడం వైరల్‌గా మారింది. ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ పేరు సంపాదించిన కిర్గియోస్ ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో చాలాసార్లు తన కోపాన్ని ప్రదర్శించాడు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో కిర్గియోస్లో కోపం కట్టలు తెంచుకుంది. విషయంలోకి వెళితే.. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్థరాత్రి జరిగిన క్వార్టర్స్‌లో రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్ చేతిలో 7-5, 4-6,7-5, 6-7(3-7)తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. దీంతో గ్రాండ్‌స్లామ్ కొట్టాలన్న అతని కల క్వార్టర్స్‌కే పరిమితం కావడంతో కోపం నషాళానికి అంటింది. ప్లేయర్‌కు, అంపైర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన అనంతరం తన బ్యాగు వద్దకు వెళ్లిన కిర్గియోస్.. చేతిలోని రాకెట్‌ను కోపంతో నేలకేసి బాదాడు. అయినా కోపం తగ్గలేదనుకుంటా.. మరో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. అనంతరం బ్యాగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాప్ స్వాప్ అనే సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ''కోపం నషాళానికి అంటింది.. కిర్గియోస్ తన రెండు రాకెట్లను ముక్కలు చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన నిక్ కిర్గియోస్ ఓటమిపై స్పందించాడు. ''నేను ఓడిపోవడం బాధ కలిగించింది. నేను గెలవాలని చాలా మంది మద్దతు ఇచ్చారు. కానీ వారి ఆశలను వమ్ము చేశాను. అందుకే కోపంతో టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టాల్సి వచ్చింది. అయితే కచనోవ్ పోరాటం మెచ్చుకోదగినది. ఈరోజు అతనిలో ఒక ఫైటర్, వారియర్ కనిపించాడు. ఇక ముందు కూడా ఇదే పోరాట పటిమను కనబరిచి గ్రాండ్‌స్లామ్ నెగ్గాలని ఆశిస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక సెమీస్‌కు చేరుకున్న కచనోవ్ నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో తలపడనున్నాడు. ఇప్పటికే నాదల్, మెద్వదేవ్‌లు వెనుదిరగ్గా.. తాజాగా కిర్గియోస్ కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టడంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. Nick Kyrgios restringing his racket after the match pic.twitter.com/Q2TDri1mxa — PropSwap (@PropSwap) September 7, 2022 చదవండి: FIH Awards: ‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్ సింగ్ -
టెన్నిస్ స్టార్ అసహనం.. మతి పోయిందా ఏమన్నా అయ్యుంటే?
ఆస్ట్రేలియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీలో భాగంగా రఫెల్ నాదల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 7-6(0), 5-7, 6-4తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ముగియడంతో ఆటగాళ్లిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చకున్నారు. ఆ తర్వాత కోర్టు అంపైర్‌కు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది. అసలు కథ మొదలైంది ఇక్కడే. నాదల్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయాడేమో.. కిర్గియోస్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. తన చేతిలో ఉన్న రాకెట్‌ను బలంగా నేలకేసి కొట్టడంతో అది కాస్తా పల్టీలు కొట్టుకుంటూ బాల్ బాయ్ వైపు వెళ్లింది. అయితే బాల్‌బాయ్ చాకచక్యంగా వ్యవహరించిన పక్కకు తప్పుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో షాక్ తిన్న అభిమానులు కిర్గియోస్ వైఖరిని తప్పుబట్టారు. ''నాదల్ చేతిలో ఓడినంత మాత్రానా సహనం కోల్పోవాలా.. అయినా రాకెట్‌ను అలా నేలకేసి కొట్టడం ఏంటి.. కాస్తైనా బుద్దుందా.. బాల్‌బాయ్ తగిలిని గాయాలు సీరియస్ అయితే పరిస్థితి ఏంటని'' ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాసేపటికి విషయం తెలుసుకున్న కిర్గియోస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా బాల్బాయ్కు క్షమాపణ చెప్పుకున్నాడు. ''ఏదో మ్యాచ్ ఓడిపోయాడననే కోపంలో అలా చేశాను. కావాలని మాత్రం చేయలేదు. నేను నేలకేసి కొట్టిన రాకెట్ యాక్సిడెంటల్‌గా వెళ్లి బాల్బాయ్కి తగిలింది. అతనికి తగలడం నాకు బాధ కలిగించింది. ఆ బాల్ బాయ్ గురించి ఎవరైనా తెలిస్తే చెప్పండి. వెంటనే అతనికి ఒక టెన్నిస్ రాకెట్‌ను గిఫ్ట్‌గా అందిస్తా. ఆ అబ్బాయి బాగుండాలని కోరుకుంటున్నా'' అంటూ రాసుకొచ్చాడు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలే జర్మనీకి చెందిన 24 ఏళ్ల టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కోర్టు అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ అతన్ని కొట్టినంత పని చేయడం ఎవరు మరిచిపోలేదు. ఈ విషయంలో జ్వెరెవ్ క్షమాపణ కోరడంతో సస్పెన్షన్ నిలిపివేశారు. అంతకముందు సెర్బియా టెన్నిస్‌స్టార్ నొవాక్ జొకోవిచ్.. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చాలా సందర్భాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించారు. దీంతో ఇప్పటికైనా కోర్టులో ఉన్నంతసేపు ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అణిచిపెట్టుకునేలా రూల్స్ సవరించాలని.. మరోసారి ఏ ఆటగాడు కోర్టు ఆవరణలో సహనం కోల్పోకుండా ఉండాలంటే.. మ్యాచ్‌ల నిషేధం లేదా భారీ జరిమానా విధించడం చేస్తే కరెక్ట్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: Avesh Khan- Venkatesh Iyer: అయ్యర్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీసిన ఆవేశ్ ఖాన్.. వీడియో PAK vs AUS: 24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే 19 and counting 👏@RafaelNadal remains unbeaten this year and defeats Kyrgios to reach his 76th Masters 1000 semi-final of his career!#IndianWells pic.twitter.com/GelYj9S44L — Tennis TV (@TennisTV) March 18, 2022 Nick Kyrgios’ temper tantrums creating a dangerous environment for everyone involved. barely two weeks after Alexander Zverev whacked his racket against the umpire’s chair. and this is supposed to be a “poised” sport? pic.twitter.com/422PnfesE3 — m⁴⁷ FRAUDIAN WELLS (@tsitschurrow) March 18, 2022 -
క్రికెట్లో ఆడాల్సిన షాట్ టెన్నిస్‌లో ఆడితే..
Ashleigh Barty Pefect Square Leg Glance With Tennis Racquet: యాష్లే బార్టీ.. ఈ ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ ప్రస్తుతం మహిళల సింగిల్స్ టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్‌వన్. అందుకు తగ్గట్టే యాష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకెళ్తుంది. గ్రాండ్‌స్లామ్‌లో ఇప్పటికే క్వార్టర్స్ చేరుకున్న బార్టీ మరో టైటిల్‌పై కన్నేసింది. ప్రి క్వార్టర్స్‌లో 6–2, 6–3తో కమీలా జార్జి (ఇటలీ)పై ఘన విజయం సాధించింది. ఈ ఏడాది బార్టీకి ఇది వరుసగా ఏడో విజయం. ఈ ఏడుసార్లు ఆమె ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక క్వార్టర్ ఫైనల్లో బార్టీ.. ఒసాకాను మట్టికరిపించిన అమండా అనిసిమోవాతో తలపడనుంది. చదవండి: 'మా ఆటను చూసి భయపడ్డారు.. ఇంకేం ఫైట్ చేస్తారు' కాగా బార్టీ క్రికెట్లో ఆడాల్సిన షాట్‌ను టెన్నిస్‌లో ఆడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవతలి ఎండ్ నుంచి వచ్చిన బంతిని బార్టీ తన రాకెట్‌తో లెగ్స్వేర్ దిశగా కట్ చేయడం కనిపించింది. వీడియో గమనిస్తే.. అసలు మ్యాచ్‌లో అయితే అందుకు ఆస్కారం లేదు కాబట్టి వార్మప్ సందర్భంగా బార్టీ ఈ షాట్ ఆడి ఉంటుంది. అయితే ఆమె సరదాగా కొట్టినప్పటికి.. టెన్నిస్‌లో క్రికెట్ షాట్ ఆడడం చూసేవాళ్లకి మాత్రం కొత్తగా ఉంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. చదవండి: Syde Modi Tourney: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. Ash Barty tucking one off the hips for a single pic.twitter.com/NBX9qe5z8T — Henry Moeran (@henrymoeranBBC) January 22, 2022 -
నల్లకలువ చేతిలో నలిగిన రాకెట్
సింగపూర్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మైదానంలో సహనం కోల్పోయి రాకెట్ ను విరగ్గొట్టింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్ని సెమీఫైనల్ మ్యాచ్ లో సెరెనాకు కోపం వచ్చింది. అంతే చేతిలోని రాకెట్ ను నేలకేసి కొట్టి విరగ్గొట్టింది. శనివారం జరిగిన సెమీస్ లో కరోలైన్ వొజ్నియాకి(డెన్మార్క్)తో సెరెనా తలపడింది. మొదటి సెట్ లో 5-2తో సెరెనా వెనుకడింది. ఈ సమయంలో పాయింట్ కోల్పోవడంతో సెరెనా చిర్రెత్తుకొచ్చింది. చేతిలోని రాకెట్ ను నేలకేసి మూడుసార్లు బాదింది. దీంతో రాకెట్ విరిగిపోయింది. నల్లకలువ చేతిలో నలిగిపోయిన రాకెట్ ను చూసి మైదానంలో ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. అయితే తర్వాత పుంజుకుని సెరెనా ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. కొసమెరుపు: డబ్ల్యూటీఏ ఫైనల్స్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సెరెనా గెల్చుకోవడం విశేషం. ఆదివారం జరిగిన తుదిపోరులో సిమోనా హాలెప్ ను 6-3, 6-0తో ఓడించి సెరెనా విజేతగా నిలిచింది.