నల్లకలువ చేతిలో నలిగిన రాకెట్ | Serena Williams destroys her tennis racket | Sakshi
Sakshi News home page

నల్లకలువ చేతిలో నలిగిన రాకెట్

Published Sun, Oct 26 2014 7:00 PM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

విరిగిన రాకెట్ తో సెరెనా విలియమ్స్

విరిగిన రాకెట్ తో సెరెనా విలియమ్స్

సింగపూర్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ మైదానంలో సహనం కోల్పోయి రాకెట్ ను విరగ్గొట్టింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్ని సెమీఫైనల్ మ్యాచ్ లో సెరెనాకు కోపం వచ్చింది. అంతే చేతిలోని రాకెట్ ను నేలకేసి కొట్టి విరగ్గొట్టింది.

శనివారం జరిగిన సెమీస్ లో కరోలైన్ వొజ్నియాకి(డెన్మార్క్)తో సెరెనా తలపడింది. మొదటి సెట్ లో 5-2తో సెరెనా వెనుకడింది.  ఈ సమయంలో పాయింట్ కోల్పోవడంతో సెరెనా చిర్రెత్తుకొచ్చింది. చేతిలోని రాకెట్ ను నేలకేసి మూడుసార్లు బాదింది. దీంతో రాకెట్ విరిగిపోయింది. నల్లకలువ చేతిలో నలిగిపోయిన రాకెట్ ను చూసి మైదానంలో ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. అయితే తర్వాత పుంజుకుని సెరెనా ఈ మ్యాచ్ లో విజయం సాధించింది.

కొసమెరుపు:  డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ మహిళల సింగిల్స్ టైటిల్ ను సెరెనా గెల్చుకోవడం విశేషం. ఆదివారం జరిగిన తుదిపోరులో సిమోనా హాలెప్ ను 6-3, 6-0తో ఓడించి సెరెనా విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement