
రియాద్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పర్పుల్ గ్రూప్ రెండో లీగ్ మ్యాచ్‌లో సబలెంకా 6–3, 7–5తో నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలిచింది. తద్వారా వరుసగా రెండో విజయంతో సబలెంకాకు సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది.
ఇదే గ్రూప్‌లోని మరో లీగ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ కిన్‌వెన్ జెంగ్ (చైనా) 7–6 (7/4), 3–6, 6–1తో ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్)ను ఓడించింది. ఫలితం రెండు పరాజయాలతో రిబాకినా సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. జాస్మిన్, కిన్‌వెన్ జెంగ్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేతకు రెండో సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment