Ashleigh Barty: Plays Perfect Leg Glance Tennis Racquet Australian Open, Viral - Sakshi
Sakshi News home page

Ashleigh Barty: క్రికెట్‌లో ఆడాల్సిన షాట్‌ టెన్నిస్‌లో ఆడితే..

Published Sat, Jan 22 2022 8:10 PM | Last Updated on Sun, Jan 23 2022 8:45 AM

Ashleigh Barty Plays Perfect Leg Glance Tennis Racquet Australian Open - Sakshi

Ashleigh Barty Pefect Square Leg Glance With Tennis Racquet: యాష్లే బార్టీ.. ఈ ఆస్ట్రేలియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రస్తుతం మహిళల సింగిల్స్‌ టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌. అందుకు తగ్గట్టే యాష్లే బార్టీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో దూసుకెళ్తుంది. గ్రాండ్‌స్లామ్‌లో ఇప్పటికే క్వార్టర్స్‌ చేరుకున్న బార్టీ మరో టైటిల్‌పై కన్నేసింది. ప్రి క్వార్టర్స్‌లో 6–2, 6–3తో కమీలా జార్జి (ఇటలీ)పై ఘన విజయం సాధించింది. ఈ ఏడాది బార్టీకి ఇది వరుసగా ఏడో విజయం. ఈ ఏడుసార్లు ఆమె ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక క్వార్టర్‌ ఫైనల్లో బార్టీ.. ఒసాకాను మట్టికరిపించిన అమండా అనిసిమోవాతో తలపడనుంది.

చదవండి: 'మా ఆటను చూసి భయపడ్డారు.. ఇంకేం ఫైట్‌ చేస్తారు'

కాగా బార్టీ  క్రికెట్‌లో ఆడాల్సిన షాట్‌ను టెన్నిస్‌లో ఆడడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అవతలి ఎండ్‌ నుంచి వచ్చిన బంతిని బార్టీ తన రాకెట్‌తో లెగ్‌స్వేర్‌ దిశగా కట్‌ చేయడం కనిపించింది. వీడియో గమనిస్తే.. అసలు మ్యాచ్‌లో అయితే అందుకు ఆస్కారం లేదు కాబట్టి వార్మప్‌ సందర్భంగా బార్టీ ఈ షాట్‌ ఆడి ఉంటుంది. అయితే ఆమె సరదాగా కొట్టినప్పటికి.. టెన్నిస్‌లో క్రికెట్‌ షాట్‌ ఆడడం చూసేవాళ్లకి మాత్రం కొత్తగా ఉంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.

చదవండి: Syde Modi Tourney: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement