Ashleigh Barty
-
ప్రపంచ మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్.. నంబర్‌వన్‌గా స్వియాటెక్
ప్రపంచ మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా అవతరించనుంది. మయామి ఓపెన్ టోర్నీ రెండో రౌండ్లో రెండో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 6–0తో గొలుబిక్ (స్విట్జర్లాండ్)పై నెగ్గడంతో ఆమెకు నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమైంది. ప్రస్తుత నంబర్‌వన్ యాష్లే బార్టీ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాంతో ఏప్రిల్ 4న విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా స్వియాటెక్‌కు టాప్ ర్యాంక్ ఖరారవుతుంది. చదవండి: ipl 2022: "ఉమేశ్ అన్న ముందే చెప్పాడు.. నిజం చేశాడు కదా -
Ashleigh Barty: శిఖరం నుంచే సాగిపోనీ...
సాక్షి క్రీడా విభాగం: ‘ప్రొఫెషనల్ క్రీడల్లో అనుకున్న లక్ష్యాలు చేరుకోకుండానే ఆట నుంచి తప్పుకునే వారు 99 శాతం మంది ఉంటారు. కానీ యాష్లే బార్టీ మిగిలిన ఆ 1 శాతం మందిలో ఉంటుంది’ 25 ఏళ్ల వయసుకే బార్టీ సాధించిన ఘనతలు చూస్తే ఈ వ్యాఖ్య ఆమెకు సరిగ్గా సరిపోతుంది. మూడు వేర్వేరు సర్ఫేస్‌లలో (హార్డ్, క్లే, గ్రాస్‌కోర్టు) మూడు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్ పతకం, ఓవరాల్‌గా 121 వారాలు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్, సంపాదనలో మేటి... ఇంకా సాధించడానికి ఏముంది! బార్టీ కూడా ఇలాగే ఆలోచించి ఉంటుంది. శిఖరాన చేరుకున్న తర్వాత ఇక ఎక్కడానికి ఎత్తులు లేవు అనిపించినప్పుడు ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఎలా మొదలు పెట్టామనే దానికంటే ఎలా ముగించామన్నదే ముఖ్యం అని భావిస్తే బార్టీ తన ఘనమైన కెరీర్‌కు అద్భుత రీతిలో గుడ్‌బై పలికింది. సొంతగడ్డపై భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన బార్టీ దానినే చివరి ఘట్టంగా మార్చుకుంది. నిజానికి కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు దానికి ముగింపు పలకడం అంత సులువు కాదు. దానికి ఎంతో సాహసం, మానసిక దృఢత్వం కావాలి. బార్టీ తాజా ఫామ్, వయసును బట్టి చూస్తే రాబోయే కొన్నేళ్లు ఆమె మహిళల టెన్నిస్‌ను శాసించే స్థితిలో ఉంది. ఆర్జనపరంగా చూస్తే మహిళల వరల్డ్ నంబర్‌వన్‌తో ఒప్పందాల కోసం పెద్ద పెద్ద బ్రాండింగ్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆమె ప్రచార కార్యక్రమాల ద్వారానే లెక్కలేనంత సంపదనను సొంతం చేసుకోవచ్చు. ఇలాంటివి ఊరిస్తున్నా, వెనక్కి లాగే అవకాశం ఉన్నా బార్టీ ‘ఇట్స్ జస్ట్ మై వే’ అంటూ తనదైన దారిని ఎం చుకుంది. తన ప్రస్తుత స్థాయి ఏమిటో ఆమె పట్టించుకోలేదు. టెన్నిస్ మాత్రమే తనకు ప్రపం చం కాదని, కొత్త కలలను సాకారం చేసుకోవా ల్సి ఉందంటూ ముందుకు వెళ్లేందుకు నిశ్చ యించుకుంది. తానేంటో, తనకు కావాల్సింది ఏమిటో, తాను ఎలా సంతోషంగా ఉండగలనో గుర్తించి దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంది. బార్టీ కెరీర్ ఆసాంతం ఆసక్తికరం. నాలుగేళ్ల వయసులో రాకెట్ పట్టిన ఈ బ్రిస్బేన్ అమ్మాయి 14 ఏళ్ల వయసులో ఐటీఎఫ్ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత సంవత్సరమే వింబుల్డన్ జూనియర్ టైటిల్ గెలవడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. కేసీ డెలాక్వా తోడుగా మహిళల డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఫైనల్ చేరగా, సింగిల్స్‌లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. అయితే 2014లో అనూహ్యంగా ఆటకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘చిన్నప్పటి నుంచే ఆడుతున్న నేను ఇంత ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. ఒక సాధారణ టీనేజర్‌గా నా జీవితం గడపాలని ఉంది’ అంటూ దాదాపు 18 నెలలు టెన్నిస్ నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో క్రికెట్‌పై దృష్టి పెట్టింది. ప్రాథమిక స్థాయిలో ఎలాంటి శిక్షణ లేకపోయినా కొద్ది రోజుల్లోనే ఆటపై పట్టు సాధించి ఏకంగా ‘మహిళల బిగ్‌బాష్ లీగ్’లో బ్రిస్బేన్ హీట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత 2016 ఫిబ్రవరిలో మళ్లీ టెన్నిస్‌లోకి వచ్చిన యాష్లే బార్టీకి వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. -
అద్భుతమా! వి మిస్ యూ
-
Ashleigh Barty: బార్టీ బై..బై..!
అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్య పరిణామం... వరల్డ్ నంబర్‌వన్‌గా వెలుగొందుతున్న వేళ ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ స్టార్ యాష్లే బార్టీ సంచలన ప్రకటన... ఆడింది చాలని, కోర్టు బయట చేయాల్సింది చాలా ఉందంటూ టెన్నిస్‌కు గుడ్‌బై... సొంతగడ్డపై 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సాధించి రెండు నెలలు కూడా గడవక ముందే రాకెట్‌ను పక్కన పెట్టేయాలని నిర్ణయం... మున్ముందు మరెంతో సాధించాల్సి ఉందంటూ క్రీడాకారులు లక్ష్యాలు పెట్టుకునే 25 ఏళ్ల వయసులోనే బార్టీ ఆటకు వీడ్కోలు పలకడం అసాధారణం! బ్రిస్బేన్: మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత యాష్లే బార్టీ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మాజీ డబుల్స్ భాగస్వామి కేసీ డెలాక్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపై టెన్నిస్‌లో ఏదైనా సాధించాలనే తపన తనలో తగ్గిందని, అందుకు తగిన ప్రేరణ లభించకపోవడం కూడా రిటైర్మెంట్ కు కారణమని బార్టీ స్పష్టం చేసింది. 25 ఏళ్ల బార్టీ గత రెండేళ్లకు పైగా (114 వారాలు) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ► బార్టీ గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. సింగిల్స్‌లో 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్, 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్... డబుల్స్‌లో 2018 యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. ► బార్టీ సాధించిన మొత్తం టైటిల్స్. (సింగిల్స్‌లో 15, డబుల్స్‌లో 12) తన ప్రొఫెషనల్ సింగిల్స్ కెరీర్లో బార్టీ గెలిచిన మ్యాచ్‌లు. ► 2,38,29,071 డాలర్లు (రూ. 182 కోట్లు) కెరీర్ మొత్తంలో బార్టీ గెలిచిన ప్రైజ్‌మనీ ఈ ఏడాది జనవరి 29న స్వదేశంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన బార్టీ ఆ తర్వాత మరే టోర్నీలోనూ బరిలోకి దిగలేదు. 2008లో జస్టిన్ హెనిన్ (బెల్జియం) కూడా ఇదే తరహాలో వరల్డ్ నంబర్‌వన్‌గా ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించింది. బార్టీ నిర్ణయం ప్రపంచ టెన్నిస్‌ను నిర్ఘాంతపరచింది. సహచర ప్లేయర్లు, మాజీలు, అభిమానులు ఈ ప్రకటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె సరైన నిర్ణయం తీసుకుందని పలువురు అభినందనలు తెలుపగా... కొన్నాళ్ల తర్వాత బార్టీ పునరాగమనం చేస్తుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో కూడా ఒకసారి టెన్నిస్‌కు నిరవధిక విరామం ఇచ్చి క్రికెట్‌వైపు వెళ్లిన బార్టీ ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టి ఆపై వరుస విజయాలు సాధించింది. కొంత కష్టంగానే అనిపిస్తున్నప్పటికీ భావోద్వేగంతో నా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తున్నాను. టెన్నిస్ నాకు ఎంతో ఇచ్చింది. గర్వంగా, ఎంతో సాధించిన సంతృప్తితో ఆటను వీడుతున్నా. జీవితకాల జ్ఞాపకాలను నాతో పదిలంగా ఉంచుకుంటా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో సాధించిన తర్వాత శారీరకంగా, మానసికంగా కూడా నన్ను ఆట ఉత్తేజపరచడం లేదు. నేను టెన్నిస్‌లో చేయగలిగిందంతా చేశాను. కొత్త కలలను నెరవేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిర్ణయం సరైందా, కాదా అనే చర్చ అనవసరం. ఇది నాకు నచ్చినట్లుగా నేను తీసుకున్న నిర్ణయం. వింబుల్డన్ సాధించాలనే నా లక్ష్యం. అది నెరవేరినప్పుడే ఇక చాలని అనిపించింది. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో మరో సవాల్ వచ్చింది. ఆ విజయం నా అద్భుత ప్రయాణానికి తగిన ముగింపుగా భావిస్తున్నా. –యాష్లే బార్టీ చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. View this post on Instagram A post shared by Ash Barty (@ashbarty) 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
యాష్లే బార్టీ.. మనకు తెలియని యాంగిల్ ఏంటంటే
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022 టైటిల్‌ను యాష్లే బార్టీ తొలిసారి గెలిచిన సంగతి తెలిసిందే. డానియెల్ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో బార్టీ 6-3, 7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది. 25 ఏళ్ల యాష్లే బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్‌ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ బార్టీ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం. ఇక యూఎస్ ఓపెన్ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకోనుంది. కాగా 2021 ఏడాదిని నెంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన బార్టీ.. స్టెఫీ గ్రాఫ్, మార్టినా నవ్రతిలోవా, సెరెనా విలియమ్స్, క్రిస్ ఎవర్ట్ సరసన నిలిచింది. చదవండి: Ashleigh Barty: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్.. ఇక యాష్లే బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్ ఒకటి దాగుంది. అదేంటో తెలుసా 2015లో కొన్ని రోజులు బిగ్‌బాష్ లీగ్‌లో క్రికెట్ ఆడింది. బార్టీ వుమెన్స్ క్రికెటర్‌గా మారడానికి ఒక కారణం ఉంది. 2014 యూఎస్ ఓపెన్ తర్వాత యాష్లే బార్టీ సుధీర్ఘ విరామం తీసుకుంది. ఆ సమయంలో ఆమెను టెన్నిస్‌ను పూర్తిగా వదిలేసి.. ఒక సాధారణ టీనేజీ అమ్మాయిలా జీవితం కొనసాగించింది. ఈ సమయంలోనే ఆమెకు క్రికెట్‌వైపు మనసు మళ్లింది. అలా 2015లో బార్టీ క్రికెట్‌వైపు అడుగులు వేసింది. అనుకుందే తడవుగా క్వీన్స్లాండ్ ఫైర్‌కు క్రికెట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆండీ రిచర్డ్స్‌ను కలిసి తన మనసులోని కోరికను బయటపెట్టింది. బార్టీ వచ్చి తనను అడిగిన విధానం రిచర్డ్స్కు బాగా నచ్చి ఆమెకు క్రికెట్లో మెళుకువలు నేర్పాడు. కొన్ని నెలల్లోనే క్రికెట్‌పై మంచి పట్టు సాధించిన బార్టీ వెస్ట్రన్ సబరబ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్‌కు ఆడింది. ఆ తర్వాత బ్రిస్బేన్ వుమెన్స్ ప్రీమియర్ టి20 లీగ్‌లో యాష్లే బార్టీ పాల్గొంది. చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరపున.. భారత్‌తో ఐపీఎల్ ఎంత పాపులరో.. ఆస్ట్రేలియా క్రికెట్లో బిగ్‌బాష్ లీగ్‌కు అంతే ప్రాధాన్యముంది. వెస్ర్టన్ సబ్రబ్స్ తరపున ఫైనల్లో బార్టీ 39 బంతుల్లో 37 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ బ్రిస్బేన్ హీట్ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరపున బరిలోకి దిగిన యాష్లే బార్టీ మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన డెబ్యూ మ్యాచ్‌లో 27 బంతుల్లో 39 పరుగులు చేసింది. ఆ సీజన్లో బార్టీ రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగింది. ఈ సీజన్లో బ్రిస్బేన్ హీట్ 14 మ్యాచ్‌ల్లో ఏడు మ్యాచ్‌లు గెలిచింది. ఇక 2016లో యాష్లే బార్టీ తిరిగి టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది. వస్తూనే పారిస్ వేదికగా రోలాండ్ గారోస్ టెన్నిస్ టోర్నమెంట్లో విజృంభించిన బార్టీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుంచి బార్టీకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేత యాష్లే బార్టీ
-
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022 మహిళల సింగిల్స్ విజేతగా ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీ నిలిచింది. అమెరికాకు చెందిన డానియెల్ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో.. బార్టీ 6-3,7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది. టోర్నీలో ఫెవరెట్‌గా బరిలోకి దిగిన బార్టీ సొంతగడ్డపై చెలరేగి ఆడింది. ముఖ్యంగా డానియెల్ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది. చదవండి: Australian Open: చరిత్రకు చేరువగా... తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న బార్టీ.. రెండో సెట్లో కొలిన్స్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. రెండో సెట్ 6-6తో టై బ్రేక్‌కు దారి తీసింది. అయితే సెట్ చివరి గేమ్‌లో ఫుంజుకున్న బార్టీ మొత్తంగా 7-6(7-2)తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన బార్టీ మెయిడెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.మ్యాచ్‌లో బార్టీ 10 ఏస్‌లు సందించి.. మూడు డబుల్ ఫాల్ట్‌లు నమోదు చేయగా.. కొలిన్స్ ఒక ఏస్ సందించి.. రెండు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. ఇక 25 ఏళ్ల యాష్లే బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్‌ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ బార్టీ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం. ఇక యూఎస్ ఓపెన్ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకోనుంది. ఈ విజయంతో బార్టీ 44 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సాధించిన రెండో ఆస్ట్రేలియన్ మహిళా ప్లేయర్‌గా బార్టీ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు 1978లో క్రిస్ ఓనిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియన్ వుమెన్‌గా నిలిచింది. చదవండి: Daniil Medvedev: అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 Win a Grand Slam on home soil? Completed it mate 🇦🇺🏆@ashbarty defeats Danielle Collins 6-3 7-6(2) to become the #AO2022 women’s singles champion. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen pic.twitter.com/TwXQ9GACBS — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో బార్టీ సంచలనం... ఫైనల్లో తలపడబోయేది ఆమెతోనే..
స్వదేశీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి యాష్లే బార్టీ తెరదించింది. 42 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన ఆసీస్ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. 1980లో చివరిసారిగా వెండీ టర్న్‌బుల్ రూపంలో ఆసీస్ మహిళా క్రీడాకారిణి ఈ మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆస్ట్రేలియన్ క్రీడాకారిణిగా ఘనత సాధించేందుకు బార్టీ మరో విజయం దూరంలో నిలిచింది. అమెరికా క్రీడాకారిణి డానియెల్ కొలిన్స్‌తో శనివారం జరిగే ఫైనల్లో బార్టీ గెలిస్తే 1978లో క్రిస్టీన్ ఒనీల్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల చాంపియన్‌గా నిలిచిన ఆసీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియ ఓపెన్‌లో ఈ ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా) తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో యాష్లే బార్టీ 62 నిమిషాల్లో 6–1, 6–3తో అన్‌సీడెడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై... కొలిన్స్ 78 నిమిషాల్లో 6–4, 6–1తో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై విజయం సాధించారు. శనివారం జరిగే ఫైనల్లో బార్టీతో కొలిన్స్ తలపడనుంది. ముఖాముఖి రికార్డులో బార్టీ 3–1తో కొలిన్స్‌పై ఆధిక్యంలో ఉంది. బారీ్టకిది మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా... 28 ఏళ్ల కొలిన్స్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరింది. 25 ఏళ్ల బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2021లో వింబుల్డన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. అదే జోరు... టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఈ టోర్నీలో బార్టీ ఆడుతోంది. ఫైనల్ చేరే క్రమంలో ఆరు మ్యాచ్‌లు ఆడిన బార్టీ 6 గంటల 6 నిమిషాలు మాత్రమే టెన్నిస్ కోర్టులో గడిపింది. ఒక్క సెట్ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోని బార్టీ కేవలం 21 గేమ్‌లు మాత్రమే సమర్పించుకుంది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ మాడిసన్ కీస్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్లో బార్టీకి ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. ఐదు ఏస్‌లు సంధించి ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని బార్టీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. 20 విన్నర్స్ కొట్టిన బార్టీ 13 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు 2015 తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ సెమీఫైనల్ ఆడిన కీస్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ సంపాదించలేదు. ‘బ్రేక్’తో మొదలు... 2020 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్‌తో జరిగిన సెమీఫైనల్లో కొలిన్స్ ఆరంభం నుంచే ఆధిపత్యం చలాయించింది. తొలి సెట్లో, రెండో సెట్లో ఆరంభంలోనే రెండుసార్లు చొప్పున స్వియాటెక్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన కొలిన్స్ 4–0తో, 4–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి సెట్లో 0–4తో వెనుకబడ్డాక స్వియాటెక్ కోలుకొని రెండుసార్లు కొలిన్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే 5–4తో స్కోరు వద్ద కొలిన్స్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లోనూ 0–4తో వెనుకబడ్డ స్వియాటెక్ ఈసారి మాత్రం ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది. ఏడో గేమ్‌లో స్వియాటెక్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన కొలిన్స్ సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఏడు ఏస్‌లు సంధించిన కొలిన్స్ 27 విన్నర్స్ కొట్టింది. స్వియాటెక్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 13 అనవసర తప్పిదాలు చేసింది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Made Down Under ™️ 🇦🇺 @ashbarty defeats Madison Keys 6-1 6-3 to become the first home representative to reach the #AusOpen women's singles final since 1980. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/C7NtLJySmp — #AusOpen (@AustralianOpen) January 27, 2022 The finishing touch to the opening set 🎨 🇦🇺 @ashbarty draws first blood against Madison Keys, taking the first set 6-1. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen • #AO2022 pic.twitter.com/i37x16v6oP — #AusOpen (@AustralianOpen) January 27, 2022 Cool ✅ Calm ✅ Calculated ✅ Swiatek looking as sharp as ever with a beautiful finish 🙌#bondisands • @bondisands pic.twitter.com/2fnl0nLTMh — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
Australian Open: ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆష్లే బార్టీ.. సరికొత్త చరిత్ర
Ashleigh Barty dismantles Madison Keys: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ ఆష్లే బార్టీ అద్భుత విజయం సాధించింది. అమెరికన్ ప్లేయర్ మేడిసన్ కీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. 1980 తర్వాత మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా నిలిచింది. ఇక వరల్డ్ నెంబర్ 1 ఆష్లే.. మేడిసన్ను 6-1, 6-3 తేడాతో మట్టికరిపించి టైటిల్ రేసులోకి దూసుకువెళ్లింది. ఫైనల్లో ఆమె.. ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) లేదంటే... 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా)తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్లో గెలిస్తే ఆష్లే కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరుతుంది. కాగా 1980లో వెండీ టర్న్‌బల్ తొలిసారిగా మహిళల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆష్లే ఆ రికార్డును సవరించింది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Made Down Under ™️ 🇦🇺 @ashbarty defeats Madison Keys 6-1 6-3 to become the first home representative to reach the #AusOpen women's singles final since 1980. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/C7NtLJySmp — #AusOpen (@AustralianOpen) January 27, 2022 The finishing touch to the opening set 🎨 🇦🇺 @ashbarty draws first blood against Madison Keys, taking the first set 6-1. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen • #AO2022 pic.twitter.com/i37x16v6oP — #AusOpen (@AustralianOpen) January 27, 2022 -
సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్‌బుల్ రాఫెల్ నాద్ల్ అదరగొడుతున్నాడు. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్ మరో రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నాదల్.. కెనడాకు చెందిన డెనిస్ షాపోవలోవ్ను 6-3,6-4,4-6, 3-6,6-3తో ఓడించాడు. దాదాపు 4 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మారథాన్ గేమ్‌లో తొలి రెండు సెట్లను నాదల్ గెల్చుకోగా.. ఫుంజుకున్న డెనిస్ షాపోవలోవ్ తర్వాతి రెండు సెట్స్‌లో నాదల్‌ను మట్టికరిపించాడు. అయితే కీలకమైన ఆఖరి సెట్లో జూలు విదిల్చిన నాదల్ 6-3 తేడాతో సెట్‌ను కైవసం చేసుకొని సెమీస్‌లో అడుగుపెట్టాడు. చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ' మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీ హోంగ్రౌండ్లో దుమ్మురేపింది. 21వ సీడ్ జెస్సికా పెగులాను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వన్‌సైడ్‌గా జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 6-2తో గెలుచుకున్న బార్టీ.. రెండో సెట్లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 6-0తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని దర్జాగా సెమీస్‌కు చేరింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్బోరా క్రెజికోవాకు క్వార్టర్ఫైనల్లో గట్టిషాక్ తగిలింది. అమెరికాకు చెందిన కీస్ మాడిసన్ చేతిలో 6-3,6-1తో క్రెజికోవా ఘోర పరాజయం పాలయింది. కేవలం గంటా 25 నిమిషాలు మాత్రమే సాగిన మ్యాచ్‌లో కీస్ మాడిసన్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 2015 తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టిన మాడిసన్ మెయిడెన్ టైటిల్‌పై కన్నేసింది. ఇక సెమీస్‌లో కీస్ మాడిసన్.. ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీతో తలపడనుంది. చదవండి: Australian Open 2022: క్వార్టర్స్‌లో నిష్క్రమించిన రాజీవ్ రామ్-సానియా మీర్జా జోడీ ¡DALE RAFA!🇪🇸@RafaelNadal is through to the #AusOpen semifinals with a 6-3 6-4 4-6 3-6 6-3 victory over Denis Shapovalov🔥 🎥: @AustralianOpen | #AusOpen | #AO2022 pic.twitter.com/9xsybToVTQ — ATP Tour (@atptour) January 25, 2022 Unstoppable 💯@Madison_Keys is into the #AusOpen quarterfinals for the first time since 2018, taking down Paula Badosa 6-3 6-1. #AO2022 pic.twitter.com/dIGsi7zf5q — #AusOpen (@AustralianOpen) January 23, 2022 -
క్రికెట్లో ఆడాల్సిన షాట్ టెన్నిస్‌లో ఆడితే..
Ashleigh Barty Pefect Square Leg Glance With Tennis Racquet: యాష్లే బార్టీ.. ఈ ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ ప్రస్తుతం మహిళల సింగిల్స్ టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్‌వన్. అందుకు తగ్గట్టే యాష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకెళ్తుంది. గ్రాండ్‌స్లామ్‌లో ఇప్పటికే క్వార్టర్స్ చేరుకున్న బార్టీ మరో టైటిల్‌పై కన్నేసింది. ప్రి క్వార్టర్స్‌లో 6–2, 6–3తో కమీలా జార్జి (ఇటలీ)పై ఘన విజయం సాధించింది. ఈ ఏడాది బార్టీకి ఇది వరుసగా ఏడో విజయం. ఈ ఏడుసార్లు ఆమె ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక క్వార్టర్ ఫైనల్లో బార్టీ.. ఒసాకాను మట్టికరిపించిన అమండా అనిసిమోవాతో తలపడనుంది. చదవండి: 'మా ఆటను చూసి భయపడ్డారు.. ఇంకేం ఫైట్ చేస్తారు' కాగా బార్టీ క్రికెట్లో ఆడాల్సిన షాట్‌ను టెన్నిస్‌లో ఆడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవతలి ఎండ్ నుంచి వచ్చిన బంతిని బార్టీ తన రాకెట్‌తో లెగ్స్వేర్ దిశగా కట్ చేయడం కనిపించింది. వీడియో గమనిస్తే.. అసలు మ్యాచ్‌లో అయితే అందుకు ఆస్కారం లేదు కాబట్టి వార్మప్ సందర్భంగా బార్టీ ఈ షాట్ ఆడి ఉంటుంది. అయితే ఆమె సరదాగా కొట్టినప్పటికి.. టెన్నిస్‌లో క్రికెట్ షాట్ ఆడడం చూసేవాళ్లకి మాత్రం కొత్తగా ఉంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. చదవండి: Syde Modi Tourney: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. Ash Barty tucking one off the hips for a single pic.twitter.com/NBX9qe5z8T — Henry Moeran (@henrymoeranBBC) January 22, 2022 -
డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోరీ్నకి యాష్లే బార్టీ దూరం
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ నుంచి ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ యాష్లే బార్టీ వైదొలిగింది. వచ్చే నెల 10 నుంచి 17 వరకు మెక్సికోలని గ్వాడాలహారా నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లోని టాప్–8 క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. ‘వచ్చే ఏడాదిలో కొత్త ఉత్సాహంతో బరిలో దిగేందుకు సీజన్ ముగింపు టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 25 ఏళ్ల బార్టీ తెలిపింది. ఈ సీజన్లో బార్టీ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీతో కలిపి మొత్తం ఐదు టైటిల్స్ సాధించి ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది. -
బార్టీకి షెల్బీ షాక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సొంత ప్రేక్షకుల నడుమ అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ అద్భుత ఆటతీరుతో యాష్లే బార్టీని బోల్తా కొట్టించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 43వ ర్యాం కర్ షెల్బీ రోజర్స్ 6–2, 1–6, 7–6 (7/5)తో యాష్లే బార్టీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిచింది. నిర్ణాయక మూడో సెట్లో షెల్బీ 2–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఎనిమిదో గేమ్‌లో బార్టీ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయాన్ని దక్కించుకునేది. కానీ షెల్బీ ధాటికి బార్టీ తొలుత ఎనిమిదో గేమ్‌లో, ఆ తర్వాత పదో గేమ్‌లో తన సరీ్వస్‌లను కోల్పోయింది. వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన షెల్బీ స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సరీ్వస్‌లను కాపాడుకోవడంతో చివరి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టైబ్రేక్‌లో 4–5తో వెనుకబడిన షెల్బీ వరుసగా మూడు పాయింట్లు గెలిచి బార్టీ కథ ముగించింది. ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసిన బార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 12వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. జొకోవిచ్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలోనూ సంచలన ఫలితం నమోదైంది. ఏడో సీడ్ షపోవలోవ్ (కెనడా) ఓటమి చవిచూడగా... టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. లాయిడ్ హ్యారిస్ (దక్షిణాఫ్రికా) 6–4, 6–4, 6–4తో షపోవలోవ్‌ను ఓడించగా... టాప్ సీడ్ జొకోవిచ్ 6–7 (4/7), 6–3, 6–3, 6–2తో నిషికోరి (జపాన్)పై, జ్వెరెవ్ 3–6, 6–2, 6–3, 6–1తో జాక్ సోక్ (అమెరికా)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేíÙయా) జోడీ 6–3, 4–6, 6–4తో హుగో నిస్ (మొనాకో) –రిండెర్క్నిచ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. -
యాష్లే బార్టీ జోరు
న్యూయార్క్: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ జోరు కనబరుస్తోంది. గురువారం జరిగిన మహిళల రెండో రౌండ్లో బార్టీ 6–1, 7–5తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై వరుస సెట్లలో గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌లో బార్టీ 11 ఏస్‌లు కొట్టి రెండు డబుల్ ఫాల్ట్‌లను చేయగా... క్లారా రెండు ఏస్‌లను సంధించి మూడు డబుల్ ఫాల్ట్‌లను చేసింది. ఆమెతో పాటు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత బార్బొరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–1తో క్రిస్టినా మెకాలే (అమెరికా)పై, రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్టీఫెన్స్ 6–4, 6–2తో కోకో గాఫ్ (అమెరికా)పై గెలుపొందారు. సిట్సిపాస్, మెద్వెదేవ్ ముందంజ... పురుషుల విభాగంలో గ్రీస్ ప్లేయర్, మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్, ఈ టోర్నీ రెండు సార్లు రన్నరప్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) మూడో రౌండ్లో ప్రవేశించారు. రెండో రౌండ్లో సిట్సిపాస్ 3–6, 6–4, 7–6 (7/4), 6–0తో అడ్రియాన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మ్యాచ్‌లో సిట్సిపాస్ ఏకంగా 27 ఏస్‌లు సంధించాడు. మెద్వెదేవ్ 6–4, 6–1, 6–2తో డొమినిక్ కొఫెర్ (జర్మనీ)పై గెలిచి మూడు రౌండ్‌కు చేరుకున్నాడు. -
క్రీడా గ్రామం బయటే బార్టీ బస
టోక్యో: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ ఒలింపిక్స్ క్రీడా గ్రామం (స్పోర్ట్స్ విలేజ్)లో అడుగుపెట్టేందుకు విముఖంగా ఉంది. అథ్లెట్ల కోసమే నిరి్మంచిన ఈ విలేజ్‌లో ఇటీవల వరుసగా కరోనా కేసులు బయటపడటంతో ఆ్రస్టేలియన్ స్టార్ బార్టీ మరో చోట బస చేయనుందని ఆసీస్ చెఫ్ డి మిషన్ ఇయాన్ చెస్టర్‌మన్ తెలిపారు. ఇటీవలే వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన ఆమె అదే ఉత్సాహంతో ఒలింపిక్స్ స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా పటిష్టమైన బుడగలో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు చెస్టర్‌మన్ పేర్కొన్నారు. అయితే కొన్ని దేశాలకు చెందిన అథ్లెట్లకు దూరంగా ఉండాలని తమ అథ్లెట్లకు ఎలాంటి సూచనలు చేయలేదని ఆయన చెప్పారు. వ్యాఖ్యాతగా మైకేల్ ఫెల్ప్స్ స్టామ్ఫోర్డ్ (అమెరికా): అత్యధిక పతకాలతో ఒలింపిక్స్ పుటలకెక్కిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ ఇప్పుడు సరికొత్త పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. అమెరికాలోని ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అయిన ఎన్బీసీకి ఫెల్ప్స్ కరస్పాండెంట్, వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఎన్బీసీ నెట్వర్క్ అధికారికంగా వెల్లడించింది. ప్రధాన ఈవెంట్ల (ప్రైమ్‌టైమ్) ప్రసారంలో అతని కామెంట్రీ ఉంటుందని సంస్థ పేర్కొంది. గత నెలలో జరిగిన అమెరికా స్విమ్మింగ్ ట్రయల్స్‌లో అతను ఎన్బీసీ కవరేజ్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. రికార్డు స్థాయిలో 2000 నుంచి 2016 వరకు జరిగిన ఐదు ఒలింపిక్స్ల్లో పోటీపడిన ఫెల్ప్స్ 23 స్వర్ణాలు సహా 28 పతకాలతో చరిత్ర సృష్టించాడు. -
Ashleigh Barty: ఈమె ఓ క్రికెటర్ అన్న విషయం తెలుసా..?
లండన్: 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆష్లీ బార్టీ.. ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టక ముందు కొంతకాలంపాటు క్రికెట్ ఆడిందన్న విషయం చాలా మందికి తెలీదు. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ.. 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టీ20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో 2016లో టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. బార్టీ 2015లో క్వీన్స్లాండ్ తరఫున 2 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో కూడా ఆడింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్ చేసే బార్టీ.. 19 ఏళ్ల వయసులోనే ఆసీస్ అండర్-15 జట్టు కోచ్‌గా కూడా వ్యవహరించింది. 2019లో తొలి గ్రాండ్‌స్లామ్(ఫ్రెంచ్ ఓపెన్) సాధించిన 25 ఏళ్ల బార్టీ.. శనివారం జరిగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఆమె పలు ఘనతలను సొంతం చేసుకుంది. వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచింది. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. అలాగే, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
Wimbledon: బార్టీ క్వీన్...
లండన్: పట్టుదలతో కష్టపడితే ఏనాటికైనా కలలు నిజమవుతాయని ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ నిరూపించింది. టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి ఒక్కసారైనా వింబుల్డన్ టైటిల్ సాధించాలని కలలు కన్నానని ఫైనల్‌కు ముందు బార్టీ తెలిపింది. ‘హౌస్‌ఫుల్’ సెంటర్ కోర్టులో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో 25 ఏళ్ల బార్టీ తన కలను నిజం చేసుకుంది. ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తుది పోరులో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించింది. విజేతగా నిలిచిన బార్టీకి 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బార్టీ కెరీర్లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2019లో ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. మరోవైపు 29 ఏళ్ల ప్లిస్కోవాకు రెండోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. 2016 యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ ప్లిస్కోవా రన్నరప్‌గా నిలిచింది. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టి20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో బార్టీ 2016లో టెన్నిస్‌లో పునరాగమనం చేసింది. తొలి సెట్లో రెండో గేమ్‌లో, నాలుగో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌లను బ్రేక్ చేసిన బార్టీ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బార్టీ దూకుడు... ప్లిస్కోవా పేలవమైన ఆటతీరు చూశాక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ఒక్క గేమ్ అయినా గెలుస్తాందా అనే అనుమానం కలిగింది. అయితే ప్లిస్కోవా ఆట నెమ్మదిగా గాడిలో పడటంతో ఐదో గేమ్‌లో ఆమె బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి గేమ్ గెలిచింది. ఆ వెంటనే ఆరో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్టీ 5–1తో ముందంజ వేసింది. అదే జోరులో బార్టీ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో ప్లిస్కోవా తన లోపాలను సరిదిద్దుకొని బార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. పలుమార్లు స్కోరు సమమయ్యాక చివరికు సెట్ టైబ్రేక్ వరకు వెళ్లింది. టైబ్రేక్‌లో ప్లిస్కోవా పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లోని రెండో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్టీ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్లిస్కోవా కోలుకునే ప్రయత్నం చేసినా బార్టీ దూకుడైన ఆటముందు ఆమె నిలువలేకపోయింది. బార్టీ సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్‌లో ప్లిస్కోవా కొట్టిన బ్యాక్‌హాండ్ షాట్ నెట్‌కు తగలడంతో బార్టీ విజయం ఖాయమైంది. వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణి బార్టీ. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) ఈ ఘనత సాధించారు. ఫైనల్లో ఎలాంటి ఫలితం వస్తుందో అని ఆలోచిస్తూ శుక్రవారం రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అంతా అద్భుతంలా అనిపిస్తోంది. స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కలను మీరు మరింత ప్రత్యేకం చేశారు. –బార్టీ -
Wimbledon 2021: ఆష్లే బార్టీ కొత్త అధ్యాయం
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ వింబుల్డన్ చరిత్రలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి, వరల్డ్ నంబర్‌వన్ ఆష్లే బార్టీ కొత్త అధ్యాయం లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 6-3, 6-7(4/7), 6-3 తేడాతో కరోలినా ప్లిస్కోవాపై విజయం సాధించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఇది బార్టీకి తొలి వింబుల్డన్ టైటిల్ కాగా, రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. అంతకుముందు 2019ఫ్రెంచ్ ఓపెన్‌లో బార్టీ విజేతగా అవతరించగా, ఆ తర్వాత ఇదే ఆమెకు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పోరులో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన బార్టీ అంచనాలు తగ్గట్టు ఆడుతూ టైటిల్‌ను సాధించింది. తుదిపోరులో తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన బార్టీకి రెండో సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేకర్‌కు దారి తీసిన రెండో సెట్‌ను ప్లిస్కోవా దక్కించుకోగా, టైటిల్ నిర్ణయాత్మక మూడో సెట్లో బార్టీ మళ్లీ విజృంభించింది. ఎక్కడా కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకండా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని తొలి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 1980 తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా వింబుల్డన్ టైటిల్‌ను గెలవక పోగా, ఆ రికార్డును బార్టీ 41 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. -
మయామి ఓపెన్ ఫైనల్లో బియాంక
ఫ్లోరిడా: మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) ఫైనల్‌కు చేరింది. మరియా సాకరి (గ్రీస్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బియాంక 2 గంటల 42 నిమిషాల్లో 7–6 (9/7), 3–6, 7–6 (7/4)తో విజయం సాధించింది. 2019లో యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత బియాంక మరో టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో బియాంక తలపడుతుంది. మరో సెమీఫైనల్లో బార్టీ 6–3, 6–3తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. టాప్ సీడ్ ఆష్లే బార్టీ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. 25వ సీడ్ కరోలినా ముచోవా చేతిలో 6-1,3-6,2-6 తేడాతో ఓడి బార్టీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్లో 6-1తో వెనుకబడిన ముచోవా.. రెండో సెట్లో ఫుంజుకొని 3-6తో సెట్‌ను గెలుచుకుంది. కీలకమైన మూడోసెట్‌లోనూ ముచోవా అదే జోరు కొనసాగించి 2-6తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను గెలుచుకొని సెమీస్‌కు ప్రవేశించింది. 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ, అన్‌సీడెడ్ జెస్సికా పెగులా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ముచోవా సెమీస్‌లో తలపడనుంది. కాగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో పదో సీడ్ సెరెనా 6–3, 6–3తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో నయామి ఒసాకాతో సెరెనా తలపడనుంది. -
యాష్లే బార్టీ, నాదల్ శుభారంభం
మెల్బోర్న్: దాదాపు సంవత్సరం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మ్యాచ్ ఆడిన మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) తన ప్రత్యర్థిని హడలెత్తించింది. ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా ఫటాఫట్‌గా కేవలం 44 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో శుభారంభం చేసింది. 82వ ర్యాంకర్ డాంకా కొవోనిచ్ (మాంటెనిగ్రో)తో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో యాష్లే బార్టీ 6–0, 6–0తో విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఐదు ఏస్‌లు సంధించింది. నెట్ వద్దకు వచ్చిన ఆరుసార్లూ పాయింట్లు గెలిచింది. తొలి సెట్లో మూడుసార్లు, రెండో సెట్లో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ పాయింట్లు సాధించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్), రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సోఫియా కెనిన్ 7–5, 6–4తో మాడిసన్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా)పై, స్వితోలినా 6–3, 7–6 (7/5)తో బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, కరోలినా ప్లిస్కోవా 6–0, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై, బెన్సిచ్ 6–3, 4–6, 6–1తో లారెన్ డేవిస్ (అమెరికా)పై నెగ్గారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012, 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) మాత్రం తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 12వ సీడ్ అజరెంకా 5–7, 4–6తో జెస్సికా పెగులా (అమెరికా) చేతిలో ఓటమి చవిచూసింది. నాదల్ బోణీ పురుషుల సింగిల్స్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తొలి రౌండ్‌ను అలవోకగా దాటాడు. లాస్లో జెరె (సెర్బియా)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–4, 6–1తో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్ ఐదు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–2, 6–2, 6–4తో పోస్పిసిల్ (కెనడా)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–1, 6–2, 6–1తో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–3, 6–4తో హాన్ఫ్‌మన్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ బెరెటిని (ఇటలీ) 7–6 (11/9), 7–5, 6–3తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందారు. 12వ సీడ్ అగుట్ (స్పెయిన్) 7–6 (7/1), 0–6, 4–6, 6–7 (5/7)తో రాడూ అల్బోట్ (మాల్డొవా) చేతిలో... 13వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–3, 4–6, 7–6 (7/4), 6–7 (6/8), 3–6తో ‘వైల్డ్ కార్డు’ ప్లేయర్ అలెక్సి పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలయ్యారు. సుమీత్ నాగల్ ఓటమి పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి బరిలో ఉన్న ఏకైక క్రీడాకారుడు సుమీత్ నాగల్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. 72వ ర్యాంకర్ బెరాన్కిస్ (లిథువేనియా)తో జరిగిన మ్యాచ్‌లో 144వ ర్యాంకర్ సుమీత్ 2–6, 5–7, 3–6తో ఓడిపోయాడు. రెండు గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్ ఆరుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయాడు. రెండు ఏస్‌లు కొట్టిన 23 ఏళ్ల సుమీత్ 42 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి రౌండ్లో ఓడిన సుమీత్కు 1,00,000 ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 30 వేలు) లభించింది. -
చేతిలో బీర్ గ్లాస్.. ఈ అమ్మాయి గుర్తుందా
ప్రేక్షకుల స్టాండ్‌లో.. చేతిలో బీర్ గ్లాస్‌తో...ఆవేశంగా పంచ్ విసురుతూ వీరాభిమానం ప్రదర్శిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..! మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్‌వన్, ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ కూడా అయినా యాష్లే బార్టీ ఉత్సాహమిది. కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ ఆడలేనంటూ తప్పుకున్న ఆమె ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఏఎఫ్ఎల్)ను ప్రేక్షకురాలిగా ఎంజాయ్ చేస్తోంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన 24 ఏళ్ల బార్టీ శుక్రవారం ‘గాబా’ స్టేడియంలో రిచ్మండ్ క్లబ్‌తో తలపడిన తన అభిమాన జట్టు బ్రిస్బేన్ లయన్స్‌కు మద్దతిస్తూ ఇలా కనిపించింది. ఏథెన్స్ మారథాన్ రద్దు ఏథెన్స్: కరోనా వైరస్ దెబ్బకి మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ రద్దయింది. మహమ్మారి ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఎంతో చరిత్ర ఉన్న ఏథెన్స్ మారథాన్‌ను ఈ ఏడాది నిర్వహించడం లేదంటూ గ్రీస్ ట్రాక్ సమాఖ్య (జీటీఎఫ్) పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 8న జరగాల్సిన ఈ పరుగును తక్కువ మంది అథ్లెట్లతో, పాల్గొనే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరమే నిర్వహించాలని జీటీఎఫ్ భావించింది. ఇందుకోసం అనుమతి కావాలంటూ గ్రీస్ ఆరోగ్య శాఖను కోరింది. అయితే వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు జీటీఎఫ్ తెలిపింది. మారథాన్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే రుసుము చెల్లించిన వారికి డబ్బును తిరిగి చెల్లించడమో లేదా వచ్చే ఏడాది ఈ రేసుకు అనుమతించడమో చేస్తామంది. -
ఫ్రెంచ్ ఓపెన్‌కూ యాష్లే బార్టీ దూరం
బ్రిస్బేన్: ఒకవైపు కరోనా వైరస్‌తో భయం... మరోవైపు సరైన సన్నాహాలు లేకపోవడంతో... తాను ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ ఆడటంలేదని మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్ అయిన బార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన టోర్నమెంట్. కాబట్టి ఇది నేను తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు’ అని 24 ఏళ్ల బార్టీ పేర్కొంది. ప్రేక్షకులు లేకుండానే యూఎస్ ఓపెన్ జరుగుతుండగా... ఫ్రెంచ్ ఓపెన్‌లో అభిమానులను అనుమతిస్తామని నిర్వాహకులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే బార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. రోమ్‌లో 14 నుంచి జరిగే ఇటాలియన్ ఓపెన్‌లోనూ పాల్గొనబోవడం లేదని బార్టీ తెలిపింది. ‘ఈ ఏడాది అందరికీ సవాలుగా నిలిచింది. నేను టెన్నిస్‌లో వెనుకబడినప్పటికీ నా కుటుంబం, నా టీమ్ ఆరోగ్య భద్రతే నాకు ప్రధానం. వారిని ఇబ్బంది పెట్టలేను. నాకు మద్దతుగా నిలిచిన నా అభిమానులందరికీ ధన్యవాదాలు. త్వరలోనే మీ కోసం మళ్లీ టెన్నిస్ ఆడతా’ అని బార్టీ వివరించింది. ఆమె చివరిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సోఫియా కెనిన్ చేతిలో ఓటమి పాలైంది. -
యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగిన బార్టీ
బ్రిస్బేన్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ నిర్వాహకులకు షాక్... ఈ ఏడాది జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నుంచి మహిళల ప్రపంచ నంబర్ వన్, ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ వైదొలిగింది. గురువారం ఆమె స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. యూఎస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 మధ్య జరగనుంది. అయితే కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్న తరుణంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్టీ తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌తో పాటు కరోనా విరామం అనంతరం జరుగుతున్న తొలి టెన్నిస్ టోర్నమెంట్ అయిన సిన్సినాటి మాస్టర్స్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేది లేనిది త్వరలో వెల్లడిస్తానని... 24 ఏళ్ల బార్టీ పేర్కొంది. ఆగస్టు 20 నుంచి మొదలయ్యే సిన్సినాటి టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ప్రాథమిక జాబితాను టోర్నీ నిర్వాహకులు గత బుధవారం ప్రకటించారు. ఇందులో జొకోవిచ్, రాఫెల్, మెద్వెదేవ్, థీమ్ ఉండగా... సెరెనా , కోకో గౌఫ్ పేర్లు ఉన్నాయి. -
గెలుచుకున్నదంతా కార్చిచ్చు బాధితులకే
బ్రిస్బేన్ టెన్నిస్ టోర్నీ ఆడటం ద్వారా తనకు రానున్న మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకే అందజేస్తానని ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ ప్రకటించింది. ఆసీస్‌కు చెందిన ఈ 23 ఏళ్ల క్రీడాకారిణి గత నవంబర్‌లో ‘జంతువులపై క్రూరత్వ నివారణ’కు పాటుపడుతోన్న రాయల్ సొసైటీకి 30 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు అందజేశానని తెలిపింది. తాజాగా ఆస్ట్రేలియాను చుట్టుముట్టిన దావానలం బాధితుల కోసం రెడ్‌క్రాస్‌కు మరింత ఎక్కువగా విరాళమివ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. నేటి నుంచి ఈనెల 12 వరకు జరుగనున్న ఈ టోర్నీ ఆడటం ద్వారా దాదాపు 2,50,000 అమెరికా డాలర్లు (రూ. కోటీ 79 లక్షలు) ఆమె రెడ్‌క్రాస్‌కు ఇచ్చే వీలుంది.