ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ గెలిచిన యాష్లే బార్టీ(PC: Australian Open Twitter)
అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్య పరిణామం... వరల్డ్ నంబర్‌వన్‌గా వెలుగొందుతున్న వేళ ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ స్టార్ యాష్లే బార్టీ సంచలన ప్రకటన... ఆడింది చాలని, కోర్టు బయట చేయాల్సింది చాలా ఉందంటూ టెన్నిస్‌కు గుడ్‌బై... సొంతగడ్డపై 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సాధించి రెండు నెలలు కూడా గడవక ముందే రాకెట్‌ను పక్కన పెట్టేయాలని నిర్ణయం... మున్ముందు మరెంతో సాధించాల్సి ఉందంటూ క్రీడాకారులు లక్ష్యాలు పెట్టుకునే 25 ఏళ్ల వయసులోనే బార్టీ ఆటకు వీడ్కోలు పలకడం అసాధారణం!
బ్రిస్బేన్: మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత యాష్లే బార్టీ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మాజీ డబుల్స్ భాగస్వామి కేసీ డెలాక్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపై టెన్నిస్‌లో ఏదైనా సాధించాలనే తపన తనలో తగ్గిందని, అందుకు తగిన ప్రేరణ లభించకపోవడం కూడా రిటైర్మెంట్ కు కారణమని బార్టీ స్పష్టం చేసింది. 25 ఏళ్ల బార్టీ గత రెండేళ్లకు పైగా (114 వారాలు) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
► బార్టీ గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. సింగిల్స్‌లో 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్, 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్... డబుల్స్‌లో 2018 యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించింది.
► బార్టీ సాధించిన మొత్తం టైటిల్స్. (సింగిల్స్‌లో 15, డబుల్స్‌లో 12) తన ప్రొఫెషనల్ సింగిల్స్ కెరీర్‌లో బార్టీ గెలిచిన మ్యాచ్‌లు.
► 2,38,29,071 డాలర్లు (రూ. 182 కోట్లు) కెరీర్ మొత్తంలో బార్టీ గెలిచిన ప్రైజ్‌మనీ
ఈ ఏడాది జనవరి 29న స్వదేశంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన బార్టీ ఆ తర్వాత మరే టోర్నీలోనూ బరిలోకి దిగలేదు. 2008లో జస్టిన్ హెనిన్ (బెల్జియం) కూడా ఇదే తరహాలో వరల్డ్ నంబర్‌వన్‌గా ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించింది. బార్టీ నిర్ణయం ప్రపంచ టెన్నిస్‌ను నిర్ఘాంతపరచింది. సహచర ప్లేయర్లు, మాజీలు, అభిమానులు ఈ ప్రకటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె సరైన నిర్ణయం తీసుకుందని పలువురు అభినందనలు తెలుపగా... కొన్నాళ్ల తర్వాత బార్టీ పునరాగమనం చేస్తుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో కూడా ఒకసారి టెన్నిస్‌కు నిరవధిక విరామం ఇచ్చి క్రికెట్‌వైపు వెళ్లిన బార్టీ ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టి ఆపై వరుస విజయాలు సాధించింది.
కొంత కష్టంగానే అనిపిస్తున్నప్పటికీ భావోద్వేగంతో నా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తున్నాను. టెన్నిస్ నాకు ఎంతో ఇచ్చింది. గర్వంగా, ఎంతో సాధించిన సంతృప్తితో ఆటను వీడుతున్నా. జీవితకాల జ్ఞాపకాలను నాతో పదిలంగా ఉంచుకుంటా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో సాధించిన తర్వాత శారీరకంగా, మానసికంగా కూడా నన్ను ఆట ఉత్తేజపరచడం లేదు. నేను టెన్నిస్‌లో చేయగలిగిందంతా చేశాను. కొత్త కలలను నెరవేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిర్ణయం సరైందా, కాదా అనే చర్చ అనవసరం. ఇది నాకు నచ్చినట్లుగా నేను తీసుకున్న నిర్ణయం. వింబుల్డన్ సాధించాలనే నా లక్ష్యం. అది నెరవేరినప్పుడే ఇక చాలని అనిపించింది. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో మరో సవాల్ వచ్చింది. ఆ విజయం నా అద్భుత ప్రయాణానికి తగిన ముగింపుగా భావిస్తున్నా.
–యాష్లే బార్టీ
చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..
🖤💛❤️
The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg
— #AusOpen (@AustralianOpen) January 29, 2022
Comments
Please login to add a commentAdd a comment