PC: Melbourne Media
Novak Djokovic- Australia Government: సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియాలో అరెస్టైనట్లు సమాచారం. మెల్‌బోర్న్ పోలీసులు జొకోవిచ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అతడి తండ్రి పేర్కొన్నారు. వీసాకు సంబంధించి ఆస్ట్రేలియా కోర్టులో ఊరట దక్కిన తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు వచ్చి తన కుమారుడిని తీసుకువెళ్లారని ఆరోపించారు. ఈ మేరకు సెర్బియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడి లాయర్ ఆఫీసు వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
జొకోవిచ్‌కు అనుకూలంగా తీర్పు!
ఆస్ట్రేలియా ఓపెన్ ఆడే క్రమంలో... వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక వైద్య మినహాయింపుతో జొకోవిచ్ దేశంలో అడుగుపెట్టాడు. అయితే మినహాయింపు పొందడానికి జొకోవిచ్ సహేతుక కారణాలు సమర్పించలేదంటూ ఆస్ట్రేలియా బోర్డర్ అధికారులు మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. అంతేగాక, వీసాను రద్దు చేశారు.
దీనిపై జొకోవిచ్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం జొకోవిచ్ పిటిషన్‌ను విచారించిన ఫెడరల్ సర్క్యూట్, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో దిగేందుకు మార్గం సుగమమైంది.
చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి! ఇప్పటికే...
It's not over yet... 👀 #9WWOS #Tennis #AUSOpen #Djokovic pic.twitter.com/L9unu7RRBc
— Wide World of Sports (@wwos) January 10, 2022
Comments
Please login to add a commentAdd a comment