Tennis Star
-
అతడితో బంధం ముగిసింది: టెన్నిస్ స్టార్
జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన భాగస్వామి కోర్డె అమరి బ్రూక్స్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ‘ఇకపై అతడితో సంబంధం లేదు. అంతా ముగిసినట్లే’ అని ఒసాకా సామాజిక మాధ్యమాల వేదికగా స్పష్టం చేసింది. వేర్వేరు దారుల్లో పయనంఈ మేరకు.. ‘పరస్పర అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. అతడిపై విమర్శలు చేసేందుకు కూడా లేదు.కోర్డె గొప్ప వ్యక్తి. అంతకుమించి అద్భుతమైన తండ్రి. వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ఎన్నో నేర్చుకున్నా. నా కుమార్తె అతిపెద్ద ఆశీర్వాదం’ అని ఒసాకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఒసాకా ఖాతాలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇక తాజా సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2019 నుంచి కోర్డె- నయోమి ఒసాకా సహజీవనం చేస్తున్నారు. ర్యాపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోర్డెతో కలిసి 27 ఏళ్ల ఒసాకా 2023లో ఓ పాపకు జన్మనిచ్చింది. కాగా జనవరి 12 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ మొదలుకానుంది. మరిన్నిక్రీడా వార్తలుసహజ శుభారాంభంసాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సహజ 6–3, 7–5తో పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది.ఒక గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఏడు ఏస్‌లు సంధించింది. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 76 పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.అయితే, డబుల్స్ విభాగంలో సహజ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సహజ (భారత్)–దరియా అస్తకోవా (రష్యా) ద్వయం 3–6, 3–6తో నయీమా కరామోకు (స్విట్జర్లాండ్)–ఇనెస్ ఇబు (అల్జీరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. కళింగ లాన్సర్స్ చేతిలో బెంగాల్ టైగర్స్ చిత్తు రూర్కెలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో కళింగ లాన్సర్స్ భారీ విజయాన్ని అందుకుంది. లాన్సర్స్ 6–0 గోల్స్‌తో బెంగాల్ టైగర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఇందులో 4 ఫీల్డ్ గోల్స్ కాగా... 2 గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. లాన్సర్స్ తరఫున థియరీ (3వ నిమిషం, 47వ నిమిషం), సంజయ్ (4వ నిమిషం), హెన్డ్రిక్ (6వ నిమిషం), బండూరన్ (29వ నిమిషం), బాబీ సింగ్ ధామీ (49వ నిమిషం) గోల్స్ సాధించారు.తొలి క్వార్టర్స్‌లో 3 గోల్స్‌తో ముందంజ వేసిన లాన్సర్స్‌ను తర్వాతి రెండు క్వార్టర్లలో కొంత వరకు నిలువరించడంలో టైగర్స్ సఫలమైంది. అయితే చివరి క్వార్టర్లో కూడా మరో రెండు గోల్స్‌తో కళింగ తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లలో తమిళనాడు డ్రాగన్స్‌తో గోనాసిక వైజాగ్...యూపీ రుద్రాస్‌తో హైదరాబాద్ తూఫాన్స్ తలపడతాయి. -
దుబాయ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా సానియా మీర్జా.. ఫొటోలు చూశారా?
-
నా నవ్వుకు నువ్వే కారణం: సానియా మీర్జా పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
Sania Mirza : దుబాయ్ వెకేషన్లో ఆహ్లాదంగా సానియా మీర్జా (ఫొటోలు)
-
‘ఆడుదాం ఆంధ్ర’ ఆరంభం అదిరింది : సాకేత్ మైనేని
సాక్షి ప్రతినిధి–అమరావతి): పదకొండేళ్ల వయసులో తండ్రిని చూసి రాకెట్ పట్టిన బాలుడు.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో జత కట్టే స్థాయికి ఎదిగాడు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడల్లో రాణిస్తూ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు.. అతనే అర్జున అవార్డు గ్రహీత, మన ఆంధ్రప్రదేశ్ క్రీడా యువ కెరటం సాకేత్ మైనేని. ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై ముచ్చటించారు. రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధికి ఇది ఆరంభమని, గ్రామీణ క్రీడాకారులను గుర్తించడానికి ప్రభుత్వం వేసిన ఈ తొలి అడుగు అభినందనీయమని ప్రశంసించారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. కృష్ణమ్మ ఒడి నుంచి క్రీడా రంగంలోకి.. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మించినప్పటికీ పెరిగిందంతా విశాఖపట్నంలోనే. చిన్నప్పటి నుంచీ క్రీడలపై ఆసక్తి ఉండేది. ఖోఖో, కర్రా–బిళ్లా్ల, గోలీలు అంటూ ప్రతి ఆటా ఆడేసేవాడిని. మా నాన్న టెన్నిస్ ఆడుతుంటే చూసి నాకూ ఆడాలనిపించింది. అలా 11 ఏళ్లకే ఆ గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నా. 12 ఏళ్లకు విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచా. 13 ఏళ్ల వయసులో నాకు టెన్నిస్ శిక్షణ ఇప్పించడం కోసం అమ్మానాన్నలు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 17 ఏళ్ల వయసులో టెన్నిస్ స్కాలర్‌షిప్‌పై అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లాను. అక్కడ కోచింగ్ సర్టిఫికేషన్ పొందాను. ఖర్చుల కోసం అక్కడి స్థానిక క్లబ్లో శిక్షణ ఇచ్చాను. అకడమిక్స్‌లో కూడా అగ్రస్థానంలో నిలిచాను. అత్యుత్తమ డబుల్స్ ర్యాంకింగ్ 74వ స్థానంలో ఉన్నాను. 2014లో చైనాలో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్‌లో సానియాతో జత కట్టి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం, సనమ్ సింగ్‌తో జోడికట్టి డబుల్స్‌లో రజత పతకం గెలవడం నిజంగా అద్భుతమైన అనుభూతి. దక్షిణాసియా క్రీడల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో 2016, 2019లో రజత పతకాలు సాధించా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో నేను, సానియా మీర్జా మాత్రమే పతకాలు సాధించాం. సరదాగా ప్రారంభించిన ఈ క్రీడ చివరికి నా కెరీర్‌గా మారింది. ప్రస్తుతం డేవిస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం 2017లో అర్జున అవార్డుతో గౌరవిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, స్థలం మంజూరు చేయాలని నిర్ణయించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలి.. ఇండియాకే ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ తెచ్చివ్వాలనేది నా లక్ష్యం. ఈ అద్భుత ప్రయత్నం కొనసాగాలి ఏదైనా క్రీడలో తమ పిల్లవాడు రాణించేలా చేయాలంటే ఆ కుటుంబానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరి్థకంగానూ సమస్యలు వస్తాయి. అలాగే పిల్లవాడి చదువుపైనా ఆ క్రీడ ప్రభావం చూపుతుంది. సౌకర్యాలు లేకపోవడం ఆటంకంగా మారుతుంది. పాఠశాలకు వెళ్లి వచ్చేసరికే పిల్లాడు అలసిపోతుంటాడు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను టోర్నమెంట్లకు తీసుకెళ్లడానికి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయినా అన్నిటిలో గెలుస్తాడని గ్యారెంటీ ఉండదు. ఇలాంటి అనేక ప్రతికూలతలను అధిగమించి నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి నా తల్లిదండ్రులు ప్రసాద్, సరోజ, భార్య శ్రీలక్ష్మి, స్నేహితులతో పాటు ఎంతో మంది అందించిన ప్రోత్సాహం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా క్రీడల్లో అవకాశాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. వీటితో పాటు క్రీడలు చాలా చిన్న వయస్సు నుంచే సంస్కృతిలో భాగం కావాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా గుర్తించింది. ప్రతి గ్రామంలో యువత పోటీపడి క్రీడలను ఆస్వాదించడానికి ప్రోత్సహించేలా ‘ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభించింది. ఇందుకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇది ఓ ప్రారంభం.. దీనికి కొనసాగింపుగా శిక్షణా సౌకర్యాలను మెరుగు పరచడం ద్వారా భవిష్యత్తులో మన రాష్ట్రం నుంచి అనేక మంది ఛాంపియన్లను తయారు చేయగలుగుతాం. ఖరీదైన క్రీడ.. అయినా నేను సిద్ధం టెన్నిస్.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడే కాదు ఖరీదైన క్రీడల్లో ఒకటి. అలాగే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ తన శిక్షణకు, ప్రపంచ వ్యాప్తంగా టోర్నమెంట్లలో పాల్గొనడానికి ఖర్చులకు నిధులు తానే సమకూర్చుకోవాలి. అందుకే పాఠశాల దశ నుంచే ఆటగాళ్లకు నిధులు సమకూరుస్తున్న రాష్ట్రాలు మాత్రమే మనదేశంలో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయడంలో విజయం సాధించాయి. ఆంధ్రాలో ఆటగాళ్లను తయారు చేయడానికి మనకు మంచి టెన్నిస్ కోర్టులు, కోచ్‌లు లేరు. మాకు ప్రతిభగల ఆటగాళ్లను తయారు చేయగల సామర్థ్యం ఉంది. కానీ ఆటగాళ్లు చాలా చిన్న వయస్సులో శిక్షణ కోసం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు, ఆ తర్వాత విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రాలో ఎక్కువ మంది యువత టెన్నిస్‌లో పాల్గొనేలా చేయడానికి, మనకు రాష్ట్రంలోనే మంచి టెన్నిస్ అకాడమీ, కోచ్ ఉండాలి. దీనిపై ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా ఉన్నారు. కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న విశాఖపట్నంలో టెన్నిస్ అకాడమికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నా వయసు ఇప్పుడు 36 ఏళ్లు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొన్న అనుభవంతో పాటు, అంతర్జాతీయ కోచ్‌గా కూడా నాకు గుర్తింపు ఉంది. మన రాష్ట్రంలో టెన్నిస్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు నా నైపుణ్యాన్ని సంతోషంగా అందించడం కోసం నేను సిద్ధంగా ఉన్నా. -
కొడుకు కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. ఇప్పుడిలా ఆటతోనే..
22 మే,1999.. బెల్గ్రేడ్ నగరంలో తనకిష్టమైన టెన్నిస్ కోర్టులో జొకోవిచ్ 12వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఒక వైపు తల్లిదండ్రులు హ్యపీ బర్త్‌డే అంటూ పాడుతున్నారు. ఆ కుర్రాడిలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఒక్కసారిగా సైరన్ మోత.. పెద్ద శబ్దాలతో యుద్ధ విమానాలు తమపై నుంచే వెళ్లసాగాయి. మరో వైపు నుంచి దూసుకొచ్చిన పెద్ద బాంబు తమకు సమీపంలోనే పడింది. అంతే వారంతా ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తిపోయారు. బాంబు దాడితో కొద్ది దూరంలోనే ఉన్న పవర్ స్టేషన్ కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది. అందరిలోనూ తీవ్రమైన భయం. యూగస్లావియా యుద్ధం సాగుతున్న ఆ టైమ్‌లో ఇలాంటి దృశ్యాలను చాలాసార్లే చూశారు అక్కడి ప్రజలు. జొకోవిచ్ కూడా అలాంటి స్థితిని ఎదుర్కొన్నవాడే. 78 రోజుల పాటు సాగిన ఆ యుద్ధంలో బెల్గ్రేడ్పై బాంబుల దాడి కొనసాగింది. అలాంటి వాతావరణం నుంచి ఎదిగిన జొకోవిచ్ కఠోర శ్రమ, పోరాటంతో టెన్నిస్ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరాడు. యుద్ధం కొనసాగిన సమయంలోనూ 12 ఏళ్ల జొకో ప్రాక్టీస్ ఆపలేదు. ఒకరోజు ఒకచోట బాంబు పడితే మరుసటిరోజు మరో చోటకు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. వరుసగా రెండు రోజుల పాటు ఒకే చోట బాంబులు వేయరనేది వారి నమ్మకం. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం, రికార్డు స్థాయిలో వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగడం, లెక్కలేనన్ని ఘనతలు ఖాతాలో వేసుకోవడం మాత్రమే జొకోవిచ్‌ను గొప్పవాడిగా మార్చలేదు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఎదురొడ్డి అత్యుత్తమ స్థాయికి చేరిన తీరు ఈ సెర్బియా స్టార్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రతి వీథిలో అతని పోస్టర్ 2011లో జొకోవిచ్ మొదటిసారి వింబుల్డన్ టైటిల్ గెలిచినప్పుడు సెర్బియా దేశం మొత్తం ఊగిపోయింది. ఒకప్పుడు యుద్ధానికి కేరాఫ్ అడ్రస్‌గా.. చరిత్రలో చెడ్డపేరుతో గుర్తొచ్చిన దేశం నుంచి ఒక స్టార్ పుట్టడం ఆ దేశవాసులకు అమితానందాన్ని పంచింది. ప్రతి వీథిలో అతని పోస్టర్ వెలసింది. సిగరెట్ లైటర్లు, క్యాండీ బ్యాగ్‌లు, కీ చైన్లు ఎక్కడ చూసినా అతనే కనిపించాడు. సెర్బియాకు ఒక కొత్త హీరో అవసరం అనిపించింది. జొకోవిచ్ ఆ స్థానాన్ని అందుకోగలిగాడు. అతను స్వదేశానికి తిరిగొచ్చినప్పుడు బెల్గ్రేడ్లో లక్ష మందితో స్వాగతం లభించింది. దేశాధ్యక్షుడు ‘నా పదవీ నువ్వే తీసుకో’ అంటూ జోక్ కూడా చేశాడు. అమెరికాతో పాటు అగ్రశ్రేణి యూరోపియన్ దేశాల్లో ఉండే సౌకర్యాలు, ప్రోత్సాహంతో పోలిస్తే సెర్బియాలాంటి చోట నుంచి టెన్నిస్‌లో ఒక ఆటగాడు పై స్థాయికి రావడం అసంభవం. అలాంటిది జొకోవిచ్ సాధారణ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది! యుద్ధం తనలో మరింత పట్టుదలను పెంచిందని, ఎలాంటి స్థితిలోనైనా పోరాడాలనే స్ఫూర్తిని నింపిందని అతను చెప్పుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏదీ సులువుగా దక్కదని, లభించిన ప్రతిదానినీ గౌరవించాలనే విషయాన్ని తెలుసుకున్నానని అంటాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జొకోవిచ్ది సాధారణ కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులిద్దరూ కలసి బేకరీ నిర్వహించేవాళ్లు. వారి షాప్ ఎదురుగా ఉండే ఒక టెన్నిస్ కోచింగ్ సెంటర్ కారణంగా అతనికి ఆ ఆటపై ఆసక్తి కలిగింది. సరిగ్గా నాలుగో ఏట.. 1991లో తొలిసారి టెన్నిస్ రాకెట్ పట్టాడు. అప్పటివరకు స్కీయింగ్, ఫుట్‌బాల్‌లను ఇష్టపడ్డా చివరకు టెన్నిస్ వైపే అతని అడుగులు పడ్డాయి. స్కూల్లో ఉన్నప్పుడు సరదాగా ఆడుకునేందుకు స్నేహితులు ఎప్పుడు పిలిచినా అతను వెళ్లలేదు. టెన్నిస్ మాత్రమే ఆడతానంటూ ఠంచనుగా ప్రాక్టీస్‌కు హాజరైపోయేవాడు. దేశం వదలక తప్పదు ఏడేళ్ల ప్రాథమిక శిక్షణ తర్వాత ఇక తాను అతనికి నేర్పించేదేమీ లేదని తొలి కోచ్ జెలెనా జెన్సిచ్ స్పష్టం చేసింది. ‘మీ అబ్బాయి టెన్నిస్‌లో ఎదగాలి అనుకుంటే దేశం వదలక తప్పద’ని చెప్పింది. దాంతో తల్లిదండ్రులు 12 ఏళ్ల జొకోను జర్మనీలోని మ్యూనిక్‌కు పంపించారు ప్రత్యేక శిక్షణ కోసం! దీనికోసం వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. సహాయం చేసేవారు లేక చాలాసార్లు అధిక వడ్డీలకు అప్పులూ తెచ్చారు. ఇందుకు ఒకే ఒక్క కారణం తమ అబ్బాయి ప్రతిభపై ఉన్న నమ్మకమే! ఏదో ఒకరోజు అతను అద్భుతాలు చేస్తాడని విశ్వసించారు. జొకో వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అద్భుతమైన కెరీర్‌కు అంకురార్పణ శిక్షణ ఫలితాలు రెండేళ్ల తర్వాత రావడం మొదలుపెట్టాయి. 14వ ఏట యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు గెలవడంతో పాటు వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అతను రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 16 ఏళ్ల వయసులో తొలిసారి ఏటీపీ పాయింట్లు అతని ఖాతాలో చేరడంతో జొకో భవిష్యత్తు ఏమిటో స్పష్టంగా తెలిసిపోయింది. తర్వాతి ఏడాదే సెర్బియా జాతీయ జట్టు తరఫున డేవిస్ కప్ ఆడాడు. అదే జోరు కొనసాగిస్తూ 19 ఏళ్ల వయసులో అతను తన తొలి ఏటీపీ టైటిల్‌ను గెలుచుకోవడంతో అద్భుతమైన కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. 2006లో నెదర్లాండ్స్‌లోని అమర్స్ఫూర్ట్లో అతను ఈ విజయాన్ని అందుకున్నాడు. అదే ఏడాది ఫ్రాన్స్‌లోని మెట్జ్లోనూ విజేతగా నిలవడంతో టాప్–20 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న పిన్న వయస్కుడిగా జొకోవిచ్ నిలిచాడు. గ్రాండ్‌స్లామ్ ప్రస్థానం.. టెన్నిస్‌లో ఏ ఆటగాడికైనా ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయినా గెలవాలనేది కల. ఇతర ఎన్ని టోర్నీల్లో విజేతగా నిలిచినా.. ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆటగాడి కెరీర్‌నే మార్చేస్తుంది. తొలి మూడు సీజన్లలో నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ ఆడి ఒకసారి ఫైనల్ వరకు చేరినా ట్రోఫీ దక్కలేదు. అయితే జొకోవిచ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కలగన్న సమయం 2008లో.. ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో వచ్చింది. ఫైనల్లో విల్‌ఫ్రెండ్ సోంగాను ఓడించి తొలిసారి మేజర్ టైటిల్‌ను జొకో ముద్దాడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డతో అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే అదే గ్రాండ్‌స్లామ్‌ను అతను మరో తొమ్మిదిసార్లు సొంతం చేసుకోగలిగాడు. తర్వాతి రెండేళ్లు గ్రాండ్‌స్లామ్ దూరమైనా.. 2011లో అతని అద్భుతమైన ఆట మళ్లీ స్థాయిని పెంచింది. ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌లతో వన్నె తగ్గని ప్రతిభను కనబరచాడు. ఆ తర్వాత ఇంకెన్నో గొప్ప విజయాలు, మరెన్నో సంచలనాలను ఝుళిపించిందా రాకెట్. ఇక వరల్డ్ నంబర్‌వన్‌గా అతని కీర్తి అసాధారణం. 2011లో తొలిసారి అగ్రస్థానాన్ని అందుకున్న అతను వేర్వేరు దశల్లో (ఎనిమిది సార్లు) కలిపి ఏకంగా 400 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక ఆటగాడిగా తన ర్యాంక్‌ను పటిష్ఠం చేసుకున్నాడు. రెండోస్థానంలో ఉన్న ఫెడరర్ (310 వారాల) ఒక్కడే 300 వారాలు దాటిన మరో ఆటగాడు కావడం జొకో స్థాయిని చూపిస్తోంది. అభిమానులతోనూ తలపడి.. 2011 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్ మ్యాచ్.. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ప్లేయర్ రోజర్ ఫెడరర్‌తో మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత నొవాక్ జొకోవిచ్ తలపడుతున్నాడు. న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ మెడోస్ మైదానమంతా ఫెడరర్ నామస్మరణతో ఊగిపోతోంది. అతని ఆటను అభిమానించడంతో పాటు అతనికున్న మంచి అబ్బాయి ఇమేజ్ కూడా అందుకు ఒక కారణం కావచ్చు. జొకోవిచ్ విషయానికి వస్తే.. అప్పుడప్పుడు తన వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో నిలిచిన అతనంటే సామాన్య ప్రేక్షకులకు సదభిప్రాయం లేదు. బాగా ఆడుతున్న మరో ఆటగాడిని కూడా కనీసం గౌరవించాలనే ఆలోచన వారిలో కనిపించలేదు. సరిగ్గా చెప్పాలంటే 24 వేల మంది ఉన్న స్టేడియంలో 23 వేల మంది ఫెడరర్‌కు మద్దతు పలుకుతున్నారు. అదే హుషారుతో ఫెడరర్ తొలి రెండు సెట్లు గెలుచుకున్నాడు. ఇక ఫైనల్ చేరడమే తరువాయి అన్నట్లుంది ఆ పరిస్థితి. కానీ జొకోవిచ్ పట్టు వదల్లేదు. ప్రత్యర్థితో పాటు ప్రేక్షకులతోనూ తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా తన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెచ్చి జొకోవిచ్ చెలరేగిపోయాడు. అంతే.. అతని పదునైన షాట్లకు బదులివ్వలేక ఫెడరర్ అనూహ్య రీతిలో తడబడ్డాడు. దూకుడును కొనసాగించిన జొకో వరుసగా మూడు సెట్లు గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. మ్యాచ్ గెలిచాక జొకోవిచ్.. ‘మీ అంత మంచి అభిమానులు ఎక్కడా ఉండరు. ఎందుకంటే నేను మానసికంగా ఇంకా దృఢంగా, గ్రానైట్‌లా మారేందుకు మీరు సహకరించారు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యక్తిత్వమే జొకోవిచ్‌ను అందరికంటే భిన్నంగా నిలబెట్టింది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ల వేటలో మిగతా ఇద్దరు ఫెడరర్, నాదల్‌లతో పోలిస్తే జొకోవిచ్ దాటిన ప్రతికూలతలు అసాధారణం. అతని సరదా చేష్టలు అతనికి జోకర్ అనే పేరును తెచ్చిపెట్టాయి. సీరియస్ ఆటలో అతనో కమేడియన్ అంటూ కామెంట్లు వినిపించాయి. ఓడినప్పుడు ఆగ్రహావేశాలతో రాకెట్లు విరగొట్టినప్పుడు ఏమాత్రం క్రీడాస్ఫూర్తి లేని ఆటగాడు ప్రపంచటెన్నిస్ చరిత్రలో ఇతనొక్కడే అంటూ విమర్శలూ వినిపించాయి. ఒక దశలో టెన్నిస్ అభిమానులంతా మాకు నచ్చని ఆటగాడు అతనే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి కాదు.. ఎన్నోసార్లు మైదానంలో అతనికి కనీస మద్దతు కూడా లభించలేదు. కానీ ఎప్పుడూ దానిపై అతను ఫిర్యాదు చేయలేదు. ‘నేనేంటో నా ఆటతోనే చూపిస్తాను’ అంటూ చెలరేగి.. అత్యున్నత స్థానానికి చేరాడు. ‘ఇలాంటివి నన్ను మరింత దృఢంగా మార్చాయే తప్ప నన్ను కుంగదీయలేదు’ అన్న జొకోవిచ్ ఇప్పటికీ తనకు నచ్చినట్లుగానే ఆడుతున్నాడు.. గెలుస్తున్నాడు! -మొహమ్మద్ అబ్దుల్ హాది -
టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి
ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఒక ఆగంతకుడు బ్లాక్పాయింట్లో ఆమె తలకు తుపాకీ గురిపెట్టి కారును దొంగలించడం కలకలం రేపింది. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(ABC) వివరాల వెల్లడించింది. కిర్గియోస్ తల్లి నొర్లాలియా టెస్లా కారులో షాపింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమె కారుకు ఒక దుండగుడు అడ్డు వచ్చాడు. కారు ఆపి ప్రశ్నించేలోపే దుండగుడు నొర్లాలియా తలకు తుపాకీ గురిపెట్టాడు. టెస్లా కారు తాళాలు ఇవ్వమని బెదిరించాడు. దీంతో నొర్లాలియా భయపడిపోయి పక్కకు తప్పుకోవడంతో సదరు దుండగుడు కారుతో ఉడాయించాడు. ఆ తర్వాత నొర్లాలియా పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న కిర్గియోస్ తల్లిని కలిసి జరిగిందంతా తెలుసుకున్నాడు. అయితే తన ఫోన్లో ఉన్న యాప్ సాయంతో కారు ఎక్కడుందో కనుక్కోగలిగాడు. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని కారును స్వాధీనం చేసుకొని.. దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. The mother of Aussie tennis champion @NickKyrgios was left terrified after she was carjacked at gunpoint in Canberra, the thief stole her son's @Tesla. But in a fighting twist, Kyrgios then used the car's technology to stop the offender in his tracks. https://t.co/ywidXMpIlD pic.twitter.com/mXh0f2Ga0M — 7NEWS Sydney (@7NewsSydney) May 2, 2023 చదవండి: Serena Williams: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్‌తో.. -
టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది'
అమెరికా టెన్నిస్ స్టార్ టామీ పాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో అదరగొడుతున్నాడు. బుధవారం క్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్‌ను టామీ పాల్ 7-6, 6-3, 5-7, 6-4తో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ప్రదర్శనతో టామీ పాల్ భవిష్యత్తు స్టార్‌గా మారే అవకాశం ఉన్నట్లు టెన్నిస్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇతని పోరాటం సెమీస్‌లోనే ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో టామీ పాల్ సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక టామీ పాల్ గర్ల్‌ఫ్రెండ్ పెయిజ్ లోరెన్జ్ మాత్రం అతని కంటే ముందే హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఆటతో అనుకుంటే పొరపాటే. బాయ్‌ఫ్రెండ్‌తో పాటు ఆస్ట్రేలియా వచ్చిన ఈ అమ్మడు టాప్‌లెస్‌గా దర్శనమిచ్చి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆడే మ్యాచ్‌లకు పక్కాగా హాజరవుతున్న పెయిజ్ లోరెన్జ్ ఖాళీ సమయంలో బీచ్‌కు వెళ్లి అందాల ప్రదర్శనతో కనువిందు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్ టామీ పాల్.. బెన్ షెల్టన్‌తో ఆడిన క్వార్టర్స్ మ్యాచ్ ఫోటోలను కూడా పంచుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్ టాప్‌లెస్ ఫోజుపై టామీ పాల్ స్పందించాడు.. ''అలా నావైపు చూడకు ఏదో అవుతుంది నాకు'' అంటూ కామెంట్ చేశాడు. ఇక పెయిజ్ లోరెన్జ్ టాప్‌లెస్ ఫోటోలపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Paige Lorenze (@paigelorenze) -
సంచలనం.. రెండోరౌండ్లోనే వెనుదిరిగిన టాప్‌స్టార్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్ మూడో ర్యాంకర్.. నార్వే సూపర్‌స్టార్ కాస్పర్ రూడ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భాగంగా గురువారం కాస్పర్ రూడ్, అమెరికాకు చెందిన 37వ ర్యాంకర్ జెన్సన్ బ్రూక్స్‌బై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రూక్స్‌బై కాస్పర్ రూడ్‌ను 6-3, 7-5,6-7(4), 6-2తో మట్టికరిపించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్‌లో తొలి రెండుసెట్లు బ్రూక్స్‌బై గెలుచుకొని ఆధిక్యం కనబరిచినప్పటికి.. మూడోసెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో విజృంభించిన కాస్పర్ రూడ్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక నాలుగో సెట్లో తొలుత బ్రూక్స్‌బై తడబడినప్పటికి తిరిగి ఫుంజుకొని 6-2తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన కాస్పర్ రూడ్ ఈసారి ఎలాగైనా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగాడు. కానీ అతని పోరాటం రెండో రౌండ్‌తోనే ముగిసిపోయింది. ఇప్పటికే వరల్డ్ నెంబర్ రెండో ర్యాంకర్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో నాదల్ ఓటమి పాలయ్యాడు. అయితే ఎడమ కాలి తుంటి గాయంతో బాధపడుతున్న నాదల్ కోలుకోవడానికి 6-8 వారాలు పట్టే అవకాశం ఉందని స్వయంగా పేర్కొన్నాడు. ఇక నెంబర్‌వన్ ఆటగాడు జొకోవిచ్ మాత్రం దూసుకెళుతున్నాడు. A huge upset on Matchday 4️⃣ 😲 The No. 2️⃣ seed Casper Ruud is sent packing after an inspired performance from American Jenson Brooksby 😲🇺🇸#SonySportsNetwork #SlamOfTheGreats #AO2023 #JensonBrooksby pic.twitter.com/LhrYqBDNfa — Sony Sports Network (@SonySportsNetwk) January 19, 2023 చదవండి: మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!? 'మనకి, వాళ్లకి తేడా ఉండాలి కదా.. చిన్నపిల్లాడి మనస్తత్వం!' -
18 ఏళ్ల బంధం తెంచుకున్న నాదల్
టెన్నిస్ స్టార్.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. తన లాంగ్‌టైమ్ కోచ్ ఫ్రాన్సిస్కో రోయిగ్‌తో 18 ఏళ్ల అనుబంధం ముగిసింది. 2005లో నాదల్ తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన సమయంలో కోచ్‌గా ఉన్న ఫ్రాన్సిస్కో రోయిగ్ అప్పటినుంచి 18 ఏళ్ల పాటు అతని విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ 18 ఏళ్లలో నాదల్ 22 గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు కెరీర్లో ఎన్నో ఏటీపీ టూర్ టైటిల్స్, అవార్డులు కొల్లగొట్టాడు. తాజాగా వ్యక్తిగత పనుల రిత్యా ఫ్రాన్సిస్కో తన టీమ్ నుంచి వెళ్లిపోతున్నట్లు స్వయంగా నాదల్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా నాదల్.. ఫ్రాన్సిస్కోతో ఉన్న అనుబంధాన్ని ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ''ఫ్రాన్సిస్కో రోయిగ్ నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నాడన్న విషయం మీకు చెప్పాలనుకుంటన్నా. మా బంధం విడదీయలేనిది. దాదాపు 18 సంవత్సరాల పాటు కొనసాగడం ఎంతో గొప్ప విషయం. ఆయన నా కెరీర్లో చాలా ముఖ్యమైన వ్యక్తి. మేము కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు చాలా చిన్నవాడిని. నేను పిల్లాడిగా ఉన్నప్పుడే పరిచయమైన ఫ్రాన్సిస్కో రోయిగ్.. అంకుల్ టోనితో కలిసి నా కెరీర్‌ను చక్కదిద్ది ఒక సర్క్యూట్‌ను తయారు చేశారు. నా విజయాల్లో ఫ్రాన్సిస్కోది అగ్రభాగం'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఫ్రాన్సిస్కో రోయిగ్ వెళ్లిపోవడంతో నాదల్ కోచింగ్ టీమ్‌లో కార్లోస్ మోయా, మార్క్ లోపెజ్‌లు 2023 సీజన్ వరకు కొనసాగనున్నారు. ఈ ఏడాది నాదల్కు కలిసొచ్చింది. కెరీర్లో 22వ గ్రాండ్‌స్లామ్ సాధించి అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఇటీవలే ఐటీఎఫ్ వరల్డ్ చాంపియన్ టైటిల్‌ను ఐదోసారి గెలుపొందాడు. Francis es un gran técnico que conoce muy bien el tenis y me ha ayudado mucho a ser cada vez mejor. Sólo tengo palabras de agradecimiento y le deseo toda la suerte del mundo en su nuevo proyecto pic.twitter.com/HvJpwrv88P — Rafa Nadal (@RafaelNadal) December 16, 2022 చదవండి: ఫిబ్రవరిలో పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా ఆల్‌రౌండర్ టీ20 వరల్డ్‌కప్-2022 గెలిచిన టీమిండియా.. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం -
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.. 310 వారాలు వరల్ట్ నెం1.. దటీజ్ రోజర్ ఫెడరర్
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడమే అతని ఘనత కాదు... 310 వారాలు వరల్డ్ నంబర్‌వన్ గా ఉండటమే అతని గొప్పతనాన్ని చెప్పదు... పురుషుల టెన్నిస్ ఆట కూడా అందంగా ఉంటుందని, అలా ‘సాఫ్ట్ టచ్’తో కూడా అద్భుతాలు చేయవచ్చని అతను చూపించాడు. ఒక్క పాయింట్ కోల్పోతేనే రాకెట్ నేలకేసి విసిరికొట్టే ఈ తరం ఆటగాళ్లతో పోలిస్తే, దాదాపు పాతికేళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో వివాదాస్పద మాట పెదవి దాటకుండా పనిపైనే దృష్టి పెట్టిన రుషి అతను.. మైదానం బయట కూడా సామాజిక బాధ్యత మరవని మంచితనం అతని సొంతం.. కోర్టులో అతనితో భీకరంగా తలపడిన ప్రత్యర్థులు అందరూ ఆట ముగియగానే అతని అంత మంచివాడు ఎవరూ లేరని ముక్తకంఠంతో చెప్పగల ఒకే ఒక్క పేరు.. రోజర్ ఫెడరర్.. టెన్నిస్ ప్రపంచంలో అన్నీ సాధించిన పక్కా జెంటిల్మన్ . ఎనిమిదేళ్ల వయసులో ఫెడరర్ మొదటిసారి టెన్నిస్ రాకెట్ పట్టాడు. సరదాగా మాత్రమే ఆట మొదలు పెట్టినా, సహజ ప్రతిభ ఎక్కడికి పోతుంది? అందుకే కావచ్చు.. తాను ఎక్కువగా శ్రమించకుండానే వరుస విజయాలు వచ్చి పడ్డాయి. అండర్12 స్థాయిలో రెండు జాతీయ టైటిల్స్‌తో అతను మెరిశాడు. అయితే అసలు కష్టం రోజర్‌కు ఇప్పుడొచ్చింది. స్విస్ జాతీయ టెన్నిస్ సమాఖ్య అతని ఆటను ప్రత్యేకంగా గుర్తించింది. వెంటనే నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో చేర్చించమని తల్లిదండ్రులకు సూచించింది. తానుండే బాసెల్ నుంచి డెవలప్మెంట్ సెంటర్ ఉన్న ఎక్యూబ్లె¯Œ ్స దాదాపు 200 కిలోమీటర్లు. అమ్మా, నాన్నని వదిలి వెళ్లలేనంటూ ఆ చిన్నారి ఏడ్చేశాడు. చివరకు ఒప్పించి అక్కడికి పంపించారు. కానీ తీరా వెళ్లాక ఆ సెంటర్లో అంతా ఫ్రెంచ్ భాషనే! తనకేమో ఇంట్లో నేర్చిన జర్మన్ స్విస్ భాష తప్ప ఏమీ రాదు. పైగా క్యాంప్‌లో అందరికంటే చిన్నవాడు. బాధ మరింత పెరిగింది! కానీ ప్రతిరోజు ఫోన్ లో అమ్మతో మాట్లాడుతూ తెచ్చుకున్న ధైర్యానికి తన పట్టుదల జోడించి అక్కడి గట్టిగా నిలబడ్డాడు. అదే వేదిక భవిష్యత్ అద్భుతాలకు పునాదిగా నిలిచింది. దేశ నిబంధనల ప్రకారం తప్పనిసరి అయిన ‘9 ఏళ్ల స్కూల్ చదువు’ ముగించిన తర్వాత రోజర్ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి దూసుకుపోయాడు. ఎడ్బర్గ్, బెకర్లను ఆరాధిస్తూ పెరిగిన ఆ కుర్రాడు మునుముందు తాను వారందరినీ మించి శిఖరాన నిలుస్తాడని ఊహించలేదు. వెనక్కి తగ్గకుండా... ‘ఎప్పుడూ కింద పడకపోవడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ పడ్డ ప్రతీసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ స్ఫూర్తిదాయక మాట ఫెడరర్‌కు అక్షరాలా వర్తిస్తుంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. సుదీర్ఘ కెరీర్లో పదుల సంఖ్యలో అతడు గాయపడ్డాడు. శరీరంలో భుజాల నుంచి కాలి మడమల వరకు వేర్వేరు గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. కానీ అతను తన ఆటను ఆపలేదు. ఫెడరర్ పని అయిపోయిందనుకున్న ప్రతీసారి మళ్లీ బలంగా పైకి లేచాడు. మళ్లీ గొప్ప విజయాలతో దూసుకుపోయాడు. అతనిలో ఈ గొప్పతనమే అందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే 36 ఏళ్ల వయసులో అతను మళ్లీ నంబర్‌వన్ అయ్యాడు. 24 ఏళ్లు అంతర్జాతీయ టెన్నిస్ ఆడినా..1526 సింగిల్స్, 224 డబుల్స్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకోలేదు. అది అతని పట్టుదలకు నిదర్శనం. ఒక్కసారి ఆట మొదలు పెడితే అది గెలుపో, ఓటమే తేలిపోవాల్సిందే తప్ప మధ్యలో ఆయుధాలు పడేసే రకం కాదు అతను. డబుల్స్.. మిక్స్డ్ డబుల్స్.. ‘ఆమె లేకపోతే నా ఆట ఎప్పుడో ముగిసిపోయేది. ఎన్నో క్లిష్ట సందర్భాల్లో నేను టెన్నిస్ ప్రయాణం ఆపేయాలని అనుకున్నా, తాను అండగా నిలిచి నాలో స్ఫూర్తి నింపింది’ అని భార్య మిరొస్లావా (మిర్కా) గురించి ఫెడరర్ తరచూ చెప్పేవాడు. ఆమె కూడా అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయరే. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు 2000 సంవత్సరం.. సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆటగాళ్లుగా అక్కడే తొలి పరిచయం.. అదే టోర్నీలో తొలి ముద్దు కూడా! అయితే 2002లో గాయంతో ఆటకు దూరమైన మిర్కా ఆ తర్వాత ఫెడరర్ సహాయక సిబ్బందిలో భాగమైంది. ఆ సమయంలోనే ఆమె వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన ఫెడరర్ మనసు పారేసుకున్నాడు. 2009లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు పిల్లలు.. వారిద్దరూ రెండు జతల కవలలు కావడం విశేషం. మైలా, చార్లిన్ అనే అమ్మాయిల జంట.. వారికంటే ఐదేళ్లు చిన్నదైన లియో, లెన్నీ అబ్బాయిల జంటతో రోజర్ కుటుంబ ఆనందం నాలుగింతలైంది. అన్నట్లు ఫెడరర్‌కు రెండేళ్లు పెద్దదైన అక్క డయానా కూడా ఉంది. దాతృత్వంలో మేటి అక్షరాలా 19 లక్షల 80 వేలు.. ఫెడరర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా సదుపాయాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య అది. తన ఫౌండేషన్ ద్వారా సొంత దేశం స్విట్జర్లాండ్‌లో పలు విరాళాలు అందించిన ఫెడరర్ అంతకంటే మెరుగైన పని తాను చేయాల్సి ఉందని గుర్తించాడు. అందుకు తన అమ్మమ్మ దేశమైన దక్షిణాఫ్రికాను ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో పాటు పొరుగు దేశాలు లెసొతొ, మలావి, నమీబియా, జాంబియా, జింబాబ్వేలలో పాఠశాల విద్యను మెరుగుపరచడంలో అతని నిధులు ఉపయోగపడుతున్నాయి. ఇందు కోసం గత కొన్నేళ్లలో అతని సంస్థ సుమారు రూ. 569 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 10 వేల పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచింది. ఫెడరర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ యజ్ఞంలో అతని వ్యక్తిగత స్పాన్సర్లంతా భాగం పంచుకొని సహకారం అందించారు. రోజర్ ఆటతో పాటు ఇలాంటి దాతృత్వం అతడిని ఇతర స్టార్లకంటే ఒక మెట్టు పైన ఉంచింది. వివాదమా.. నీవెక్కడ? అంతర్జాతీయ స్టార్ ఆటగాడంటే ఒక రేంజ్లో ఉండాలి. ఆటలోనే కాదు, మాటల్లో కూడా పదును కనిపించాలి. అప్పుడప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా ‘తానేంటో’ గుర్తించేలా నాలుగు పరుష పదాలు వాడటమో, లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలో చేస్తుండాలి. కానీ ఫెడరర్ గురించి గూగుల్ చేసి చూడండి. వివాదం అన్న పదం కూడా కనిపించదు! గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నా, ఓడినప్పుడు ప్రత్యర్థిని అభినందించినా ఎక్కడా మాటలో, ప్రవర్తనలో కట్టు తప్పలేదు. అదే అతడి గొప్పతనాన్ని రెట్టింపు చేసింది. కావాలంటే 21 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్‌ను చూడండి.. 21కి తగ్గని వివాదాలు ఉంటాయి. కానీ ఈ స్విస్ స్టార్ మాత్రం ఎప్పటికీ వాటికి దూరమే. ఫెడరర్ ఎక్స్‌ప్రెస్ ►వరుసగా 237 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్ ► గెలిచిన మొత్తం టైటిల్స్ 103 ► స్విట్జర్లాండ్ దేశం ఫెడరర్ పేరిట పోస్టల్ స్టాంప్‌తో పాటు నాణేలపై కూడా అతని ఫొటోను ముద్రించింది. ఆ దేశంలో బతికి ఉండగానే అలాంటి గౌరవం అందుకున్న ఏకైక వ్యక్తి. ► సొంత నగరం బాసెల్‌లో ‘ఫెడరర్ ఎక్స్‌ప్రెస్’ అని ఒక రైలుకు పేరు పెట్టారు. ► ఆట ద్వారా సుమారు 130 మిలియన్ డాలర్లు ఆర్జిస్తే, ప్రకటనల ద్వారా మరో 100 మిలియన్లకు పైగా రోజర్ సంపాదించాడు. 30 ఏళ్ల ‘ఫోర్బ్స్’ చరిత్రలో నంబర్‌వన్ గా నిలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్. -
ఓటమి తట్టుకోలేకపోయాడు.. గొడవ పడిన టెన్నిస్ స్టార్లు
మ్యాచ్‌లో ఎన్ని గొడవలైనా విజయం అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో అంతా మరిచిపోయి కలిసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇద్దరు టెన్నిస్ ఆటగాళ్లు మాత్రం తాము ఆడుతుంది ఒక ప్రొఫెషనల్ గేమ్ అన్న సంగతి మరిచిపోయి బూతులు తిట్టుకున్నారు. చైర్ అంపైర్ వచ్చి అడ్డుకోకపోయి ఉంటే కచ్చితంగా కొట్టుకునేవారే. ఇదంతా ఓర్లీన్స్ చాలెంజర్ టోర్నమెంట్లో చోటుచేసుకుంది. టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మౌటెట్, 247వ ర్యాంకర్ ఆండ్రీవ్లు తలపడ్డారు. కాగా మౌటెట్ను 2-6, 7-6(7-3), 7-6(7-2)తో ఆండ్రీవ్ ఖంగుతినిపించాడు. ఈ ఓటమిని మౌటెట్ జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో మౌటెట్ తొలుత బాగానే ఉన్నప్పటికి.. ఆ తర్వాత ఆండ్రీవ్‌ను బూతులు తిట్టాడు. ఇది ఊహించని ఆండ్రీవ్ మౌటెట్కు ఎదురెళ్లాడు. ఇద్దరు ఒకరినొకరు మాటామాట అనుకున్నారు. గొడవ పెద్దగా మారుతుందన్న తరుణంలో చైర్ అంపైర్ వచ్చి ఇద్దరికి సర్థిచెప్పాడు. దీంతో ఆండ్రీవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మౌటెట్ మ్యాచ్‌ను పాజిటివ్ నోట్‌తోనే ఆరంభించాడు. తొలి సెట్‌ను కూడా 20 నిమిషాల్లోనే కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్ నుంచి ఫుంజుకున్న ఆండ్రీవ్ మ్యాచ్‌ను టైబ్రేక్ తీసుకెళ్లాడు. టై బ్రేక్‌లో 7-3తో గెలిచి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కీలకమైన మూడో సెట్లో కూడా ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో మరోసారి టై బ్రేక్‌కు దారి తీసింది. ఈసారి కూడా టై బ్రేక్‌లో విజృంభించిన ఆండ్రీవ్ 7-2తో సెట్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక ఆండ్రీవ్‌పై దురుసుగా ప్రవర్తించడంపై మౌటెట్ స్పందించాడు. ''మ్యాచ్ తర్వాత నేను చేసింది తప్పే కావొచ్చు. కానీ ఎవరికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఆండ్రీవ్ నావైపు చూస్తూ బూతులు తిట్టాడు.. అందుకే ఆ సమయంలో నేను అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.'' అని చెప్పుకొచ్చాడు. Corentin Moutet et Adrian Andreev qui en viennent aux mains après la défaite du Français au Challenger d'Orléans. 😳 (🎥 @Imad__26)pic.twitter.com/agm0CnxVOF — Univers Tennis 🎾 (@UniversTennis) September 29, 2022 చదవండి: పికిల్‌బాల్ ఎప్పుడైనా విన్నారా.. అమెరికాలో ఎందుకంత క్రేజ్! -
రోజర్ ఫెదరర్ కీలక వ్యాఖ్యలు..
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు లావెర్ కప్ చివరి టోర్నీ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో నాలుగో రౌండ్లో వెనుదిరిగిన అనంతరం ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక లావెర్ కప్ ఫెదరర్‌కు చివరి టోర్నీ కానుంది. ఈ టోర్నీ అనంతరం టెన్నిస్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలకనున్నాడు. ఫెదరర్‌కు చివరి టోర్నీ కావడంతో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని లావెర్ కప్ టోర్నీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ శుక్రవారం ఫెదరర్ లావెర్కప్లో డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. 24 కెరీర్లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెదరర్ లావెర్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడాడు. ''ప్రొఫెషనల్ టెన్నిస్‌లో నాకిది చివరి మ్యాచ్.. అంతే. దీంతో నా జీవితం ముగిసిపోలేదు. అనవసరంగా నన్ను హీరోని చేస్తున్నారు. చివరి మ్యాచ్ చూసేందుకు సంతోషంగా రండి.. దయచేసి అంతిమయాత్రలా చేయకండి ప్లీజ్'' అంటూ పేర్కొన్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా ఆట కొనసాగిస్తానని ఫెదరర్ పేర్కొన్నాడు. కుటుంబంతో గడపడానికి, కొత్త ప్రదేశాల సందర్శనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానన్నాడు. లండన్‌లో చివరి మ్యాచ్ ఆడడానికి ఒక కారణం ఉందని ఫెదరర్ పేర్కొన్నాడు. ఇక్కడి అభిమానులు నాకెంతో ఇచ్చారు.. అందుకే వారి సమక్షంలో నా ఆటను ముగించాలనుకుంటున్నానంటూ వెల్లడించాడు. కాగా ఫెదరర్ ఆడనున్న చివరి మ్యాచ్‌కు పలువురు టెన్నిస్ ప్రముఖులు రానున్నారు. ఫెదరర్ చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్ కూడా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని నాదల్ స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపాడు. ఫెడ్డీ మ్యాచ్‌కు రానున్న జొకోవిచ్ ఉద్దేశించి '' జొకో.. నేను రేపు లండన్‌కు వస్తున్నా.. ఫెడ్డీ మ్యాచ్ చూడడానికి.. వెయిట్ ఫర్ మీ'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. Hey… I am coming tomorrow… Landing in London in the morning… wait for me 😉💪🏻 https://t.co/IguhwCxN3E — Rafa Nadal (@RafaelNadal) September 21, 2022 చదవండి: కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది.. -
US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ గార్సియా తన జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గార్సియా 6–3, 6–4తో అమెరికా టీనేజర్, 12వ సీడ్ కోకో గాఫ్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది మూడు టైటిల్స్ నెగ్గి సూపర్ ఫామ్‌లో ఉన్న 28 ఏళ్ల గార్సియా యూఎస్ ఓపెన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీఫైనల్‌కు చేరింది. కోకో గాఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో గార్సియా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 24 విన్సర్స్ కొట్టిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచింది. 2011లో ప్రొఫెషనల్‌గా మారిన గార్సియా ఇప్పటివరకు 41 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2017లో ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆమె అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. పదోసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న గార్సియా సెమీఫైనల్ చేరడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన మూడోఫ్రాన్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో ఫ్రాన్స్ నుంచి అమెలీ మౌరెస్మో (2002, 2006), మేరీ పియర్స్ (2005) సెమీఫైనల్ చేరారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)తో గార్సియా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో జబర్ 2–0తో గార్సియాపై ఆధిక్యంలో ఉంది. జబర్ జోరు... ఈ ఏడాది 42 విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్యూనిషియా ప్లేయర్ ఆన్స్ జబర్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జబర్ 6–4, 7–6 (7/4)తో తొమ్లాయనోవిచ్పై గెలిచింది. ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా జబర్ నిలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఆరో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) 6–1, 7–6 (7/4)తో 22వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 82 నిమిషాలపాటు జరి గిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. కిరియోస్ జోరుకు ఖచనోవ్ బ్రేక్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా) తొలిసారి తన కెరీర్లో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో... ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్, 23వ సీడ్ నిక్ కిరియోస్తో 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 7–5, 4–6, 7–5, 6–7 (3/7), 6–4తో గెలుపొందాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 30 ఏస్‌లు సంధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించిన కిరియోస్ 31 ఏస్‌లు సంధించినా 58 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కిరియోస్ కోపంతో తన రెండు రాకెట్లను నేలకేసి కొట్టి విరగొట్టడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో కాస్పర్ రూడ్ 6–1, 6–4, 7–6 (7/4)తో 13వ సీడ్ మారియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ సెమీఫైనల్లో ఖచనోవ్‌తో ఆడతాడు. -
సలాం 'సెరెనా విలియమ్స్'.. నీ ఆటకు మేము గులాం
పద్నాలుగేళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌గా మారి అంతర్జాతీయ టెన్నిస్‌లో అరంగేట్రం చేసింది. 17 ఏళ్ల వయసులోనే తొలి గ్రాండ్‌స్లామ్ సాధించి అందరిని ఆకట్టుకుంది. అందరిలాగే ఒకటో.. రెండో గ్రాండ్‌స్లామ్‌లు కొట్టి వెళ్లిపోతుందిలే అని అంతా భావించారు. కానీ ఆరోజు తెలియదు.. ఆమె టెన్నిస్‌ను ఏలడానికి వచ్చిన మహరాణి అన్న విషయం. అనతికాలంలో ప్రపంచ టెన్నిస్ రారాణిగా అవతరించింది. ఆ కిరీటాన్ని అత్యంత సుదీర్ఘ కాలం ధరించింది. ఆమె పేరే సెరెనా విలియమ్స్. టెన్నిస్ అభిమానులంతా ముద్దుగా ''నల్లకలువ'' అని పిలుచుకుంటారు. 17 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్ అందుకొని.. ఆ తర్వాత 23 గ్రాండ్‌స్లామ్‌లతో ఈ తరంలో మహిళల టెన్నిస్‌లో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. సెరెనా వయసు ఇప్పుడు నలబై ఏళ్లు. ఇరవై ఏడేళ్లు టెన్నిస్ శ్వాసగా బతికిన ఆమె తాజాగా తన కెరీర్‌కు లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఒక రకంగా రిటైర్మెంట్ అనే చెప్పొచ్చు. ఇకపై ఈ నల్లకలువ టెన్నిస్ కోర్టులో కనిపించే అవకాశం లేదు. అందుకే సెరెనా ఆటకు సలాం చెబుతూ ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ సెరెనా విలియమ్స్ లేని టెన్నిస్‌ను ఊహించడం చాలా కష్టం. ఈ నెలలో 41వ పుట్టిన రోజు చేసుకోనున్న సెరెనా 27 ఏళ్ల సుదీర్ఘ టెన్నీస్ కెరీర్లో.. 23 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. 1981 సెప్టెంబర్ 26న అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో సాంగినావ్ నగరంలో జన్మించింది. ఆమె తల్లి ఒరాసీన్ ప్రైస్ నర్సుగా పని చేసేవారు. తండ్రి రిచర్డ్ విలియమ్స్ ఒక సెక్యూరిటీ సర్వీసు నడిపేవారు. సెరెనా అక్క వీనస్ విలియమ్స్. వీనస్, సెరెనాలకు వారి తండ్రి రిచర్డ్ టెన్నిస్ నేర్పించారు. వాళ్లని ఊర్లో ఉన్న టెన్నిస్ కోర్టులకు తీసుకెళ్లి ఈ ఆట ఆడాలని ప్రోత్సహించారు. కోచింగ్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడని చెప్పేవారు. సిస్టర్స్ ఇద్దరూ చాలా సేపు ప్రాక్టీస్ చేస్తుండేవారు. వీనస్, సెరెనాలు టెన్నిస్ అకాడమీలో చేరటానికి వీలుగా వీరి కుటుంబం 1991లో ఫ్లోరిడాకు నివాసం మారింది. 1994లో వీనస్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది. ఆ మరుసటి ఏడాదే అంటే 1995లో సెరునా కూడా అంతర్జాతీయ టెన్నిస్‌లో అడుగుపెట్టింది. అక్క వీనస్ విలియమ్స్ ఆటను చూసిన అప్పటి టెన్నిస్ అభిమానులు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను వీనస్ గెలుస్తుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెల్లి సెరెనా ముందుగా దానిని సాధించింది. 1999 యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది. అప్పుడు సెరెనా విలియమ్స్ వయసు కేవలం 17 ఏళ్లు. న్యూయార్క్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో నాటికి ప్రపంచ దిగ్గజాలైన మోనికా సెలెస్‌ను క్వార్టర్ ఫైనల్లో, లిండ్సే డావెన్పోర్ట్ను సెమీ ఫైనల్లో, వరల్డ్ నంబర్ వన్ మార్టినా హింగిస్‌ను ఫైనల్లో ఓడించి.. సెరెనా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం విశేషం. ఇక అదే టోర్నమెంట్లో అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఈ అక్కచెల్లెళ్లు తమ కెరీర్ ప్రస్థానంలో 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. 1999లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన సెరెనా.. ఆ తర్వాత కెరీర్లో వెనుదిరిగి చూసుకోలేదు. చాలా సందర్భాల్లో తన అక్క వీనస్ విలియమ్స్తోనే గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడి టైటిల్స్ గెలిచి అక్కపై పైచేయి సాధించింది. అలా 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్నెగ్గింది. ఇందులో ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఏడుసార్లు వింబుల్డన్.. మరో ఆరుసార్లు యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఈ తరంలో మహిళల టెన్నిస్ విభాగంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది. 2017లో సెరెనా విలియమ్స్.. రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌ను పెళ్లి చేసుకున్నారు.సెరెనా విలియమ్స్ ఎనిమిది వారాల గర్భంతో ఉన్న సమయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలిచి ఔరా అనిపించింది. ఇది ఆమెకు 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఇదే చివరిది. మహిళల టెన్నిస్ ఓపెన్ శకంలో ఆల్ టైమ్ విజేతల జాబితాలో సెరెనా విలియమ్స్ స్టెఫీ గ్రాఫ్‌ను అధిగమించింది. ఆమెకన్నా పైస్థానంలో మార్గరెట్ కోర్ట్ మాత్రమే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి స్థానంలో ఉంది. 2017లో సెరెనా తన కుమార్తె అలెక్సిస్ ఒంపియాకు జన్మనిచ్చింది. అయితే సిజేరియన్ ఆపరేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సెరెనా దాదాపు ఆరు వారాల పాటు మంచానికే పరిమితమయ్యింది. 2018లో మళ్లీ టెన్నిస్ మైదానంలోకి అడుగుపెట్టిన సెరెనా.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరినప్పటికి ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. తాజాగా తన చివరి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ అని చెప్పుకున్న సెరెనా.. ఈసారి కచ్చితంగా టైటిల్ సాధిస్తుందనుకున్న తరుణంలో మూడో రౌండ్‌తోనే ఆమె తన కెరీర్‌ను ముగించింది. తను ప్రొఫెషనల్ మ్యాచ్‌ను ఎక్కడైతే ఆరంభించిందో అదే టెన్నిస్ కోర్టులో ఇవాళ తుది మ్యాచ్ ఆడింది. చదవండి: ముగిసిన 'నల్లకలువ' పోరాటం.. 'అక్క లేకపోతే నేను లేను' అంటూ భావోద్వేగం -
ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్ స్టార్
కెనడా మహిళా టెన్నిస్ క్రీడాకారిణి యూజీనీ బౌచర్డ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఏ ఆటగాడైనా ఒక టోర్నమెంట్లో పాల్గొంటే ఐడీ కార్డు ఇవ్వడం ఆనవాయితీ. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ లాంటి గ్రూఫ్ జట్లకు ఐడీ కార్డులు లేకపోయినప్పటికి.. టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో పాల్గొనే వారికి ఆయా టోర్నమెంట్ పేరిట ఐడీ కార్డులు తయారు చేస్తారు. అవి ఉంటేనే గేమ్స్‌లో అనుమతిస్తారు. తాజాగా కెనడా మహిళా క్రీడాకారిణి.. 28 ఏళ్ల యూజీనీ బౌచర్డ్ ఓల్డమ్ బ్రౌన్ వాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొంది. తొలి రౌండ్ మ్యాచ్ కూడా ఆడింది. అయితే ఆమెకిచ్చిన ఐడీ కార్డుపై సాధారణ ఫోటో కాకుండా టూ పీస్ బికినీలో స్విమ్‌సూట్ ధరించి ఉన్న ఫోటోను ముద్రించారు. బ్లాక్ స్విమ్ సూట్లో బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఆమె ఫోటోను ఈ టోర్నమెంట్‌కు వాడడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా యూజీని బౌచర్డ్ 2018లో స్పోర్ట్స్ మ్యాగజైన్‌కు సంబంధించి కవర్ షూట్ కోసం ఈ బికినీ ధరించింది. అయితే ఈ ఫోటో వాడడంపై యూజీనీ సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడం విశేషం. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓల్డమ్ బ్రౌన్ వాన ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఐడీ ఫోటోను షేర్ చేసి.. ''హ్యూజీని బౌచర్డ్.. డబ్ల్యూటీఏ ప్లేయర్''.. ''ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న అధికారులకు ఒక ప్రశ్న.. ఈ ఫోటో ఎందుకు వాడారో నాకు సమాధానం కావాలి.. ప్లీజ్ వివరణ ఇవ్వండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మాజీ వరల్డ్ నెంబర్ 5వ ర్యాంకర్ అయిన హ్యుజీని బౌచర్డ్ 2014లో వింబుల్డన్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత భుజం గాయంతో చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే తిరిగి టెన్నిస్‌లో అడుగుపెట్టింది. ఏది ఏమైనా.. యూజీని బికినీ ఫోటోలో దర్శనమివ్వడంతో టెన్నిస్ అభిమానులు ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. చదవండి: మనీషా కిక్ కొడితే... అభిమానం పరాకాష్టకు.. చెమట వాసనను ఆస్వాదించిన వేళ -
Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా అవుట్
టొరంటో: కెరీర్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఆ ప్రకటన తర్వాత ఆడిన మొదటి టోర్నీలోనే పేలవ ప్రదర్శన కనబర్చింది. కెనడియన్ ఓపెన్‌లో ఆమె ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ పోరులో 2–6, 4–6తో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) చేతిలో సెరెనా పరాజయం చవిచూసింది. ఇక్కడ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఓటమితో ఈవెంట్‌కు గుడ్‌బై చెప్పింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘భావోద్వేగం వల్లే మాటరాని మౌనంతో బరువెక్కిన హృదయంతో నిష్క్రమించాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాలని సన్నద్ధమై వచ్చాను. కానీ నాకంటే బెలిండా చాలా బాగా ఆడింది. ఇంత మంది అభిమానుల మధ్య నా సుదీర్ఘ కెరీర్ సాగింది. ఇది ఎప్పటికీ ప్రత్యేకం’ అని సెరెనా ఉద్వేగంతో తెలిపింది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘టెన్నిస్ స్టార్’.. ఫొటో వైరల్
Maria Sharapova Welcomes Son: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తల్లయ్యారు. పండంటి బాబుకు ఆమె జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా శుక్రవారం అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడి పేరు థియోడర్ అని షరపోవా వెల్లడించారు. కాగా 35 ఏళ్ల ఈ రష్యన్ బ్యూటీ షరపోవా.. బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు 2020లో తమకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ జంట జూలై 1న తమ తొలి సంతానానికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘మా కుటుంబానికి అత్యంత అందమైన.. ఎంతో గొప్పదైన బహుమతి లభించింది.. థియోడర్’’ అంటూ తమకు కుమారుడు జన్మించిన విషయాన్ని షరపోవా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో తమ చిన్నారి పాపాయితో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇక తన కెరీర్లో మారియా షరపోవా ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. పదిహేడేళ్ల వయసులో 2004లో తన తొలి వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆమె.. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. సుదీర్ఘ కెరీర్‌కు 2020లో ఆటకు వీడ్కోలు పలికిన షరపోవా ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని, మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Maria Sharapova (@mariasharapova) చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే, నెదర్లాండ్స్ -
తల్లికాబోతున్న ‘టెన్నిస్ స్టార్’..
రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను తల్లికాబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు.. ‘‘అమూల్యమైన సరికొత్త ఆరంభాలు!!’’ అంటూ తాను గర్భవతినన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బీచ్‌లో నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేసి తల్లి కాబోతున్న అనుభూతులను పదిలం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా తన కెరీర్లో ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన షరపోవా.. 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘మరో ఉన్నత శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నాను. టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నా’’ అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక షరపోవా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో ఆమె రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక వీరిద్దరు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. View this post on Instagram A post shared by Maria Sharapova (@mariasharapova) -
'మా అక్కకు, నాకు తేడా తెలియడం లేదా:సెరెనా విలియమ్స్
-
'మా అక్కకు, నాకు తేడా తెలియడం లేదా?'
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక వార్త విషయంలో సెరెనా ఫోటోను ప్రచురించకుండా.. తన అక్క వీనస్ విలియమ్స్ ఫోటోను ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న సెరెనా విలియమ్స్ న్యూయార్క్ టైమ్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. విషయంలోకి వెళితే.. 40 ఏళ్ల టెన్నిస్ స్టార్ ఈ మధ్యనే సెరెనా వెంచర్స్ పేరుతో క్యాపిటల్ వెంచర్స్‌ను ప్రారంభించింది. దాదాపు 111 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని సేకరించింది. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడిస్తూ సెరెనాపై ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. విషయం సరిగ్గానే ఉన్నప్పటికి ఫోటో విషయంలో మాత్రం పెద్ద పొరపాటే చేసింది. సెరెనా ఫోటోకు బదులు తన అక్క వీనస్ విలియమ్స్ ఫోటోను ప్రచురించింది. యుక్త వయసులో సెరెనా, వీనస్‌లు దాదాపు ఒకే రకంగా ఉండేవారు. అప్పటి సెరెనా అనుకొని.. వీనస్ ఫోటోను పబ్లిష్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టికల్తో పాటు ఫోటోను ట్యాగ్ చేస్తూ సెరెనాకు పంపించారు. ఇది చూసిన సెరెనా స్పందించింది. ''జీవితంలో చాలా సాధించినప్పటికి ఏదో తెలియని వెలితి. అందుకే సెరెనా వెంచర్స్ పేరుతో క్యాపిటల్ వెంచర్‌ను ప్రారంభించాం. దానిపై దాదాపు 111 మిలియన్ యూఎస్ డాలర్ల నిధిని సేకరించాం. సంస్థను నెలకొల్పిన వ్యక్తులకు మద్దతు ఇచ్చేందుకు వ్యవస్థ సాయపడుతోంది. ఇదే విషయాన్ని ఒక పత్రిక ఆర్టికల్ రూపంలో రాసుకొచ్చింది. కానీ ఫోటో మాత్రం వేరొకరిది పెట్టింది. మా అక్క ఫోటో వాడడం తప్పు కాదు.. కానీ ఫోటో వేసేముందు ఒకసారి తీక్షణంగా పరిశీలిస్తే బాగుంటుంది. ఫోటోను పెట్టారు సరే.. కానీ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. మీ పరిశోధన సరిపోలేదు..'' అంటూ రాసుకొచ్చింది. ఇక మహిళల టెన్నిస్ విభాగంలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన సెరెనా ఇటీవలే పెద్దగా ఆడడం లేదు. ఈ మధ్యనే విడుదలైన ర్యాంకింగ్స్‌లో 2006 తర్వాత తొలిసారి టాప్ 50లో సెరెనా చోటు దక్కించుకోలేకపోయింది. 2021 నుంచి చూసుకుంటే సెరెనా కేవలం ఆరు టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొంది. వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సెరెనా.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఫిట్నెస్ కారణాలతో తప్పుకుంది. చదవండి: Novak Djokovic: నెంబర్ వన్ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన జొకోవిచ్ Ranji Trophy 2022: తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..! No matter how far we come, we get reminded that it's not enough. This is why I raised $111M for @serenaventures. To support the founders who are overlooked by engrained systems woefully unaware of their biases. Because even I am overlooked. You can do better, @nytimes. pic.twitter.com/hvfCl5WUoz — Serena Williams (@serenawilliams) March 2, 2022 -
ఉక్రెయిన్ సైన్యానికి నా ప్రైజ్‌మనీ: స్వితోలినా
మాంటేరి (మెక్సికో): ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా ఇకపై మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీల్లో గెలిచిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తమ సైన్యానికి విరాళంగా ఇస్తానని ప్రకటించింది. రష్యా యుద్ధంతో ప్రస్తుతం ఉక్రెయిన్ అంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ పౌరులు కూడా తమ మిలిటరీకి అండగా ఆయుధాలు చేపట్టి యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన స్వితోలినా మాట్లాడుతూ ‘రష్యా మిలిటరీ చర్యతో ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజులు వెళ్లదీస్తుండగా, సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. నేను టోర్నీలాడేందుకు బయటికొచ్చాను. కానీ నా కుటుంబం, సన్నిహితులంతా అక్కడే ఉన్నారు. ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఊపిరిపీల్చుకుంటున్నాయి. దేశం కోసం సైన్యం పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా వంతు సాయంగా నా ప్రైజ్‌మనీ అంతా మిలిటరీ, సహాయ–పునరావాస అవసరాల కోసం విరాళంగా ఇస్తాను’ అని పేర్కొంది. ఆమె ఈ వారం మాంటేరి సహా, ఇండియన్ వెల్స్, మయామి టోర్నీల్లో పాల్గొననుంది. -
కుడిచేయిపై కత్తి గాట్లు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టెన్నిస్ స్టార్
ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2019 తనకు డార్క్ పీరియడ్‌లా అనిపించిందని.. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలిగాయంటూ పేర్కొన్నాడు. నిక్ కిర్గియోస్ తన మెంటల్ హెల్త్ సమస్యలపై గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘ సందేశాన్ని రాసుకొచ్చాడు. ''ఇదంతా మూడేళ్ల కిందటి మాట. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ నాకు డార్క్ పీరియడ్ లాంటిది. పైకి మంచిగ కనిపిస్తున్నప్పటికి మానసికంగా చాలా దెబ్బతిన్నా. డ్రగ్స్ అలవాటు, విపరీతంగా తాగేయడం, ఫ్యామిలీ గొడవలు నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. సరైన నిద్ర లేకపోవడం.. పడుకున్న మంచంపై నుంచి లేచినా ఏదో బరువు ఉన్నట్లుగా అనిపించేది. మెంటల్ డిప్రెషన్లో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఎవరిని నమ్మేవాడిని కాదు.. ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఇవన్నీ చూసి ఒక దశలో నాకు ఆత్మహత్య ఆలోచనలు కలిగాయి. మీరు నా కుడి చేయిని దగ్గరగా గమనిస్తే.. కత్తిగాట్లు కనిపిస్తాయి. ఆ గాట్లు నేనే పెట్టుకున్నా. పిచ్చి ఆలోచనల నుంచి బయటపడడానికి చాలా సమయమే పట్టింది. ఒక పాజిటివ్ ఎనర్జీని పొందడానికి చాలా కష్టపడ్డా. ఇప్పుడు మాత్రం ఒంటరి అనే భావన పూర్తిగా పోయింది. ప్రతి చిన్న విషయానికి కుంగిపోకుండా.. పాజిటివ్ మైండ్‌తో ఉండడం నేర్చుకున్నా. మనం ఉన్నంతకాలం చిరునవ్వుతో బతకాలి.. ఈ జీవితం చాలా అందమైనది'' అంటూ ముగించాడు. ఇక గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో నిక్ కిర్గియోస్ మూడో రౌండ్లో వెనుదిరిగి కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా ఆరునెలల పాటు సుధీర్ఘ బ్రేక్ తీసుకున్న కిర్గియోస్.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. సింగిల్స్‌లో ఆకట్టులేకపోయినప్పటికి డబుల్స్‌లో మాత్రం తానఇస కొక్కినాకిస్తో కలిసి టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. కాగా ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నిక్ కిర్గియోస్ 38వ ర్యాంక్‌తో కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. చదవండి: 'పేరులోనే వ్లాదిమిర్.. ఉక్రెయిన్ తరపునే పోరాటమన్న బాక్సింగ్ లెజెండ్స్' Ind Vs SL 1st T20I: అక్కడ ఉంది శ్రేయాస్ అయ్యర్.. డౌట్ అక్కర్లేదు View this post on Instagram A post shared by Nick Kyrgios (@k1ngkyrg1os) -
Novak Djokovic: జొకోవిచ్‌కు భారీ షాక్.. అరెస్టు చేసిన పోలీసులు!
Novak Djokovic- Australia Government: సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియాలో అరెస్టైనట్లు సమాచారం. మెల్బోర్న్ పోలీసులు జొకోవిచ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అతడి తండ్రి పేర్కొన్నారు. వీసాకు సంబంధించి ఆస్ట్రేలియా కోర్టులో ఊరట దక్కిన తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు వచ్చి తన కుమారుడిని తీసుకువెళ్లారని ఆరోపించారు. ఈ మేరకు సెర్బియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడి లాయర్ ఆఫీసు వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లారు’’అని ఆయన వ్యాఖ్యానించారు. జొకోవిచ్‌కు అనుకూలంగా తీర్పు! ఆస్ట్రేలియా ఓపెన్ ఆడే క్రమంలో... వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక వైద్య మినహాయింపుతో జొకోవిచ్ దేశంలో అడుగుపెట్టాడు. అయితే మినహాయింపు పొందడానికి జొకోవిచ్ సహేతుక కారణాలు సమర్పించలేదంటూ ఆస్ట్రేలియా బోర్డర్ అధికారులు మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. అంతేగాక, వీసాను రద్దు చేశారు. దీనిపై జొకోవిచ్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం జొకోవిచ్ పిటిషన్‌ను విచారించిన ఫెడరల్ సర్క్యూట్, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో దిగేందుకు మార్గం సుగమమైంది. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి! ఇప్పటికే... It's not over yet... 👀 #9WWOS #Tennis #AUSOpen #Djokovic pic.twitter.com/L9unu7RRBc — Wide World of Sports (@wwos) January 10, 2022 -
అందుకే వచ్చాను... మరి ఇప్పుడేంటి ఇలా: జొకోవిచ్
Novak Djokovic On Australia Visa Row Thanks Fans: ప్రత్యేక మినహాయింపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆడేద్దామనుకున్న ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు మెల్బోర్న్ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా అధికారులు నిలిపివేసి షాకిచ్చారు. ప్రభుత్వం వీసా రద్దు చేసింది. మినహాయింపు ఇస్తేనే వచ్చానని గట్టిగా వాదిస్తున్న జొకోకు తిరుగుటపా కట్టడం ఇష్టం లేదు. అందుకే న్యాయపోరాటం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో స్వదేశం సెర్బియా నుంచి అతని అభిమానులు, సన్నిహితులు, తల్లిదండ్రులు అతనికి గుండెధైర్యాన్నిచ్చేలా పోస్టులు పెట్టారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన సెర్బియన్ స్టార్ తనకు వెన్నంటే నిలిచి మద్దతు పలికిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. సోమవారం జరిగే కోర్టు విచారణలో జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేది లేనిది తేలిపోతుంది. చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
ఫిన్లాండ్తో ‘డేవిస్’ పోరుకు బోపన్న
సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న భారత డేవిస్ కప్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల అఖిల భారత టెన్నిస్ సంఘంతో ఒలింపిక్స్ విషయమై బోపన్న గొడవ పడ్డాడు. ఇది పతాక స్థాయికి చేరడంతో అతన్ని భవిష్యత్తులో జట్టులోకి ఎంపిక చేయరనే వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఫిన్లాండ్ వేదికగా ఫిన్లాండ్తో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో పాల్గొనే భారత జట్టులో బోపన్నను ఎంపిక చేశారు. ఈ పోటీలో డబుల్స్‌లో దివిజ్ శరణ్–బోపన్న జంట ఆడుతుంది. -
French Open:: టోర్నీకి స్టార్ ప్లేయర్ దూరం
ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే మే 30 నుంచి జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో గ్రాస్‌కోర్టు సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకే ముర్రే ఈ నిర్ణయం తీసుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా గత మార్చిలో మయామి ఓపెన్ నుంచి వైదొలిగిన ముర్రే ఆ తర్వాత మరే టోర్నీలోనూ సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగలేదు. చదవండి: Rafael Nadal: పదోసారీ టైటిల్ అతడిదే -
Aryna Sabalenka: సూపర్ సబలెంకా
మాడ్రిడ్: గాయం కారణంగా ఒకదశలో మాడ్రిడ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని ఆలోచించిన బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా బరిలోకి దిగాక ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–0, 3–6, 6–4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో బార్టీ ఓడిపోవడం ఇదే తొలిసారి. యారా క్లాసిక్ వ్యాలీ ఓపెన్, మయామి ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్ టోర్నీలలో ఫైనల్ చేరిన బార్టీ టైటిల్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సబలెంకా కెరీర్లో ఇది 10వ సింగిల్స్ టైటిల్. ‘రెండు వారాల క్రితం స్టుట్గార్ట్ ఓపెన్ ఫైనల్లో గాయపడ్డాను. కదలడానికి కూడా ఇబ్బంది పడ్డాను. దాంతో మాడ్రిడ్ ఓపెన్ నుంచి వైదొలగాలని భావించాను. కానీ నా వైద్య బృందం నాలుగు రోజుల్లో నన్ను కోలుకునేలా చేసింది. ఇప్పుడు మీ ముందర ట్రోఫీతో నిల్చున్నాను’ అని క్లే కోర్టులపై తొలిసారి టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల సబలెంకా వ్యాఖ్యానించింది. విజేతగా నిలిచన సబలెంకాకు 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 81 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, షాంపేన్ బాటిల్ లభించాయి. -
ర్యాప్ అండ్ రాకెట్ లవ్ స్టోరీ
ఇష్టం లేని పనుల్ని కూడా కూర్చోబెట్టి మరీ చేయిస్తుంది ప్రేమ! తాజా గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో విజేత అయిన నయోమీకి.. కార్డీ అని ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఆమె కోసం ఆమె ఆటని ప్రతిసారీ ఏడ్చుకుంటూ చూస్తుంటాడు. నయోమీ గెలుపు, ఓటమి లెక్క కాదు అతడికి. ఆటను త్వరగా ముగించేస్తే ఇద్దరూ వెళ్లి ఎక్కడైనా డిన్నర్ చేస్తూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం అతడికి ఇష్టం. రెండేళ్ల నుంచీ రిలేషన్లో ఉన్నారు. ఆమెలో అతడికి నచ్చింది ఆమే. ఆమె ఆట కాదు. అతడిలో ఆమెకు నచ్చింది అతడొక్కడే కాదు. అతడి ‘ర్యాప్’ కూడా. ఎలా కుదిరింది? ఎలా కుదురుతుంది? నయోమీ ఒసాకా.. టెన్నిస్ స్టార్. కార్డే అమరీ.. ర్యాప్ స్టార్. ఆమె నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్. అతడు గ్రామీ–నామినేటెడ్ ర్యాపర్. ఇద్దరూ యూఎస్‌లోనే ఉంటారు. అయితే ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. ఆమెకు ‘ర్యాప్’ పనిగట్టుకునేమీ ఇష్టం లేదు. అతడికి ఈ లోకంలో టెన్నిస్ అనే ఆట ఒకటుందనే స్పృహే లేదు. అలాంటి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీళ్లు పడ్డారు సరే. వీళ్ల ప్రేమ నిలబడుతుందా? అది మన సందేహం మాత్రమే. వాళ్ల సమాధానం వేరుగా ఉంది. ‘‘నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటే మన ప్రేమకు కాళ్లలో శక్తి లేదనే’’ అని నవ్వుతూ అనేస్తారు. ఆమె రాకెట్ శక్తి, అతడి ర్యాప్ శక్తి కలిపి ఎప్పటికప్పుడు పునఃస్థాపించుకోవలసిన స్థితిలోనైతే వారి ప్రేమ లేదనే అనిపిస్తోంది. దానిక్కారణం ఉంది. ఇద్దరి లో ఒకరు ఇంకొకరి కోసం ‘ట్రై’ చేస్తే జనించిన ప్రేమ కాదు వాళ్లది. తనకై తను ఆవిర్భవించిన ప్రేమ! ∙∙ మొదట నయోమీ దృష్టే కార్డే మీద పడింది. అప్పటికే ఆమె తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ (యు.ఎస్. ఓపెన్) సాధించి ఉన్న టెన్నిస్ ప్లేయర్. లాస్ ఏంజెలిస్ క్లిప్పర్స్ బాస్కెట్ బాల్ గేమ్ చూడ్డానికి వెళ్లింది. అక్కడే కార్డే కూడా ఉన్నాడు. అతడూ ఆట చూడ్డానికే వచ్చాడు. అతడిని గుర్తుపట్టిన కొందరు ఫొటోల కోసం చుట్టుముట్టడం, కార్డే పసి పిల్లాడిలా నవ్వుతూ అడిగిన వారందరితో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం నయోమీ దూరాన్నుంచి చూసింది. వెళ్లి పలకరించింది. ‘హాయ్’ అన్నాడు. ‘నేను నయోమీ. టెన్నిస్ ప్లేయర్’ అంది. ‘నువ్వు టెన్నిస్ ప్లేయర్ ఎలా అవుతావు? సెరెనా సిస్టర్స్ కదా టెన్నిస్ ప్లేయర్స్’ అన్నట్లు చూసి.. ‘‘టెన్నిస్ గురించి నాకేమీ తెలీదు’’ అన్నాడు. ‘‘నాకు కార్డే ర్యాప్ గురించి కొంచెం తెలుసు’’ అని నవ్వింది. కార్డే మాత్రం ఇప్పటికీ అదే మాట చెబుతుంటాడు. ‘‘నయోమీ మాత్రమే నాకు తెలుసు. నయోమీ ఆట గురించి తెలీదు. కానీ ఆమె కోసం ఆమె ఆటను చూస్తూ కూర్చుంటాను’’ అంటాడు. జంటగా నయోమీ, కార్డే ; జీక్యూ మ్యాగజీన్ తాజా సంచికపై నయోమీ, కార్డే మొన్నటితో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది నయోమీ. 2018లో యూ.ఎస్. ఓపెన్. అప్పటికి ఇద్దరికీ పరిచయం లేదు. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్. అదే తొలిసారి టెన్నిస్ ఆటను చూడటం కార్డే. ‘కూర్చొని చూడు’ అని నయోమీ అంటే కూర్చొని చూశాడు. 2020లో యు.ఎస్. ఓపెన్. కరోనా టైమ్‌లో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన నయోమీ.. ‘‘నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది’’ అని ఫోన్ చేస్తే న్యూయార్క్ నుంచి ఫ్లయిట్లో దిగి ఆమె మ్యాచ్‌కి గ్యాలరీలో కూర్చొని గెలిపించాడు. ‘అవును. కార్డే వచ్చినందు వల్లనే నేను గెలిచాను’ అంటుంది నయోమీ. ఆ మ్యాచ్ జరుగుతున్నపుడే.. ‘ఇది నా ప్లేస్ కాదు. కానీ నయోమీ కోసం నాది కాని ప్లేస్‌లోకి వచ్చాను’ అన్నాడు కార్డే. మొన్న శనివారం నయోమీ 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవగానే యూఎస్ పత్రికలన్నీ ఈ జంటను చుట్టేశాయి.. పెళ్లెప్పుడని. ఇద్దరూ ఈడూ జోడు. ఒకే ఏడాది పుట్టినవారు. వయసు 23. ∙∙ పెళ్లా! అసలు ఈ రెండేళ్లుగానే నయోమీ, కార్డే కాస్త దగ్గరగా ఉండటం. ప్రారంభంలో వాళ్లిద్దరి మధ్యా కుదురుకోడానికి వాళ్ల ప్రేమ చాలా తిప్పలు పడింది. ఆమె ఉండటం కాలిఫోర్నియాలో. అతడు ఉండటం నార్త్ కరోలినాలో. కలుసుకోడానికి పెద్ద దూరం ఏమీ కాదు. కలుసుకున్నాక మాట్లాడుకోడానికే టైమ్ ఉండదు. చీకటింకా పోక ముందే రాకెట్ పట్టుకుని ప్రాక్టీస్‌కి వెళ్లిపోతుంది నయోమీ. ఆ ప్రాక్టీస్ మధ్యాహ్నం దాటిపోయేవరకు, కొన్నిసార్లు చిన్న చిన్న బ్రేకులతో సాయంత్రం వరకు సాగుతుంది. కార్డేదీ సాయంత్రం నుంచి, కొన్నిసార్లు మధ్యాహ్నం నుంచే రాత్రంతా సాగే కచేరీ కార్యక్రమం. ఒకరిది పగటి ప్రపంచం. ఇంకొకరిది రాత్రి ప్రపంచం. అయినా చంద్రుడు, సూర్యుడు అప్పుడపుడు ఉదయం, సాయంత్రం ఆకాశంలో ఒకే సమయం లో కనిపించినట్లు వీళ్లు భూమ్మీద సంధ్యా సమయాల్లో కలుసుకుంటూనే ఉన్నారు. కలిసి డిన్నర్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా.. ‘నిన్ను చూడాలని ఉంది’ అంటే వచ్చి వాలిపోతాడు కార్డే. అతడికి చూడాలనిపిస్తే చెప్పాపెట్టకుండా వచ్చి, కళ్ల నిండా చూసుకుని వెళ్లిపోతాడు. మొన్నటి ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదలవడానికి ముందు జీక్యూ మ్యాగజీన్ వీళ్లను జంటగా చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈ మాత్రమైనా వీళ్ల ప్రేమ గురించి ప్రపంచానికి తెలిసింది. లేకుంటే ఇప్పటికీ గుట్టుగా ఉండిపోయేవాళ్లే. ‘కార్డేలో మీకు ఏం నచ్చింది?’ అంటే.. ‘క్వయిట్ రొమాంటిక్ డూడ్’ అంటుంది నయోమీ. ‘నయోమీలో మీకేం నచ్చింది’ అంటే.. ‘నయోమీలో కాదు, నయోమీ మొత్తం నచ్చింది’ అని తన హిప్హాప్ స్టెయిల్లో ధ్వనిహాసం చేస్తాడు కార్డే. -
క్విటోవా కేక...
పారిస్: కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా ఆ దిశగా మరో అడుగు వేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ క్విటోవా 6–3, 6–3తో లౌరా సిగెముండ్ (జర్మనీ)పై విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్విటోవా ఆరు ఏస్‌లు సంధించింది. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 15 అనవసర తప్పిదాలు చేసిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. పదునైన ఏస్‌లతో చెలరేగిన క్విటోవా తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్కసారీ బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో తొలి సెట్‌ను నెగ్గిన ఆమె రెండో సెట్లోనూ అదే జోరు కొనసాగించింది. తొలి గేమ్‌లోనే సిగెముండ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. కానీ సిగెముండ్ తన సర్వీస్‌ను కాపాడుకోవడంలో మూడుసార్లు విఫలమవ్వడంతో క్విటోవాకు విజయం సులువుగానే దక్కింది. 2012లో ఏకైకసారి ఈ టోర్నీలో సెమీస్ చేరిన క్విటోవా తొలిసారి ఫైనల్‌కు చేరాలంటే సెమీఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించాల్సి ఉంటుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సోఫియా 6–4, 4–6, 6–0తో అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సోఫియా ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు చేరడం విశేషం. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోఫియా రెండో సెట్లో తడబడింది. కానీ నిర్ణాయక మూడో సెట్లో ఈ అమెరికా క్రీడాకారిణి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. -
వొజ్నియాకి వీడ్కోలు
పారిస్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ భామ కరోలైన్ వొజ్నియాకి టెన్నిస్‌కు వీడ్కోలు పలకనుంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతానని వొజి్నయాకి ప్రకటించింది. 29 ఏళ్ల వొజి్నయాకి తన కెరీర్లో ఏకైక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను గతేడాది గెల్చుకుంది. 2009, 2014 యూఎస్ ఓపెన్ టోరీ్నలలో రన్నరప్‌గా నిలిచింది. ‘టెన్నిస్‌లో నేను కోరుకున్నవన్నీ సాధించాను. నా జీవితంలో ఆట కంటే ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సమయం వస్తే టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని అనుకున్నాను’ అని కెరీర్లో 30 సింగిల్స్ టైటిల్స్ గెలిచిన వొజ్నియాకి తెలిపింది. 2005లో 15 ఏళ్ల ప్రాయంలో ప్రొఫెషనల్‌గా మారిన వొజ్నియాకి 2010లో అక్టోబరులో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ స్థానంలో ఆమె 71 వారాలు కొనసాగింది. వరుసగా 11 ఏళ్లపాటు టాప్–20లో నిలిచిన వొజ్నియాకి గాయాల కారణంగా ఈ ఏడాది కేవలం ఒక టోర్నీలో ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వొజ్నియాకి 37వ ర్యాంక్‌లో ఉంది. -
దివిజ్‌కు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ దివిజ్ శరణ్ కెరీర్లో ఐదో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో తన భాగస్వామి ఇగోర్ జెలెనె (స్లొవేకియా)తో కలిసి దివిజ్ శరణ్ విజేతగా నిలిచాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ శరణ్–జెలెనె ద్వయం 6–3, 3–6, 10–8తో బెరెటిని–బొలెలీ (ఇటలీ) జోడీపై నెగ్గింది. విజేతగా నిలిచిన దివిజ్ జంటకు 66,740 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 47 లక్షల 44 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో దివిజ్ పుణే ఓపెన్ (2019), యాంట్‌వర్ప్ ఓపెన్ (2017), లాస్ కాబోస్ ఓపెన్ (2016), బొగోటా ఓపెన్ (2013)లలో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. -
కిర్గియోస్‌కు రూ.80 లక్షల జరిమానా!
సిన్సినాటి: కెరీర్ ఆరంభంనుంచి వివాదాలతో సహవాసం చేస్తున్న ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ ఇప్పుడు దూషణల పర్వాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాడు! ఫలితంగా భారీ జరిమానాకు గురవడంతో పాటు నిషేధానికి కూడా చేరువయ్యాడు. సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్లో పరాజయం అనంతరం అతని ప్రవర్తన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ మ్యాచ్‌లో కరెన్ కచనోవ్ (రష్యా) 6–7, 7–6, 6–2తో కిర్గియోస్‌ను ఓడించాడు. మ్యాచ్ ముగిశాక కిర్గియోస్ అంపైర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చెత్త అంపైర్ అంటూ దుర్భాషలాడుతూ అతని వైపు ఉమ్మేశాడు! మ్యాచ్‌లో అప్పటికే టైమ్ నిబంధనను అతిక్రమించడం, అనుమతి లేకుండా కోర్టును వీడటం, రెండు సార్లు రాకెట్లు విరగ్గొట్టడంవంటి చేసేశాడు. దాంతో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ ఏటీపీ ఏకంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే 9 అభియోగాలు నమోదు చేసింది. అన్నీ కలిపి లక్షా 13 వేల డాలర్లు (సుమారు రూ. 80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇది తక్షణ చర్య మాత్రమేనని, మున్ముందు పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కిర్గియోస్‌పై మరింత తీవ్ర చర్య ఉండవచ్చని కూడా ఏటీపీ ప్రకటించింది. ప్రపంచ 27వ ర్యాంకర్ అయిన 24 ఏళ్ల కిర్గియోస్‌పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో శిక్షలకు గురయ్యాడు. -
జొకోవిచ్‌కు షాక్ ఇచ్చిన రష్యా యువతార ఖచనోవ్
కెరీర్లో 33వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించాలని ఆశించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో 22 ఏళ్ల ఖచనోవ్ (రష్యా) 7–5, 6–4తో ప్రపంచ రెండో ర్యాంకర్ జొకోవిచ్‌ను ఓడించి తన కెరీర్లో తొలి మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఈ క్రమంలో 2009లో నికొలాయ్ డెవిడెంకో తర్వాత మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. విజేత ఖచనోవ్కు 9,73,480 యూరోలు (రూ. 8 కోట్ల 8 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
అమ్మలందరూ అలానే ఉంటారా : సెరెనా
లాస్ ఏంజిల్స్: టెన్నిస్ సూపర్‌స్టార్ సెరెనా విలియమ్స్ తనపై వస్తున్న విమర్శలపై మండిపడ్డారు. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా నల్లకలువ ఇటీవల జరిగిన వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, టోర్నమెంట్లలో తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. సొంతదేశం అమెరికాలో జూలై 31న జరిగిన చరిత్రత్మక శాన్‌జోస్ సిలికాన్ వ్యాలీ క్లాసిక్ టోర్నీలో సైతం ఓటమి చవిచూశారు. సెరెనా 2017లో కూతురు అలెక్సిస్ ఒలంపియా ఒహానియన్ జూనియర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఏడాదిలో తిరిగి కోర్టులోకి అడుగుపెట్టిన సెరేనా సరిగా ఆడలేపోయింది. అమ్మ అయిన తర్వాత ఆటలో వెనకబడడంతో ఆమెపై కొందరు విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటిపై ఆమె స్పందించారు. తాను ప్రసవానంతర ఉద్వేగాలతో సతమతమవుతున్నాని తెలిపారు. కొన్ని సార్లు తన కూతురుతో కొద్ది సమయం కూడా గడపలేక పోవడం బాధిస్తోందని అన్నారు. తనను విమర్శిస్తున్న వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారనీ, బిడ్డకు జన్మనిచ్చిన వారెవరైనా మళ్లీ మాములు జీవనం సాగించడం అంత సులువు కాదనిఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన సెరెనా.. విమర్శలకు బదులిచ్చే తీరిక తనకు లేదని ఇదివరకే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
సానియాకు సమన్లు
జారీ చేసిన సర్వీస్‌ట్యాక్స్ అధికారులు ‘బ్రాండ్’పారితోషికంపై సేవ పన్ను బకాయి ఈ నెల 16న హాజరుకావాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చుట్టూ సర్వీస్ ట్యాక్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. బ్రాండ్ అంబాసిడర్ హోదాలో తీసుకుంటున్న పారి తోషికానికి సేవా పన్ను చెల్లించాల్సిందేనని సర్వీస్ ట్యాక్స్ విభాగం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమెకు మంగళవారం సమన్లు జారీ చేసిన అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. సానియా మీర్జా ఏటా రూ.కోటి పారితోషికం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని గతంలో ప్రభుత్వమే ప్రకటించింది. ఈ తరహాలో నగదు తీసుకుంటూ చేస్తున్న సేవ వాణిజ్య వ్యవహారం కిందికే వస్తుందని సర్వీస్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. దీంతో ఆ పారితోషికం మొత్తంపై ఏటా 15 శాతం పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాలు నెరపిన సర్వీస్‌ట్యాక్స్ అధికారులు మంగళవారం సానియాకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 16న వ్యక్తిగతంగా కానీ, అధికారిక ప్రతినిధి పంపడం ద్వారా కానీ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్‌లో హాజరుకావాలని స్పష్టం చేశారు. విచారణకు హాజరుకాని పక్షంలో చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక్కడ క్లిక్ చేయండి -
మ్యాచ్ 314 నిమిషాలు...సెట్ 177 నిమిషాలు...
తొలి రెండు సెట్లు చేజార్చుకున్నా... విజయంపై ఆశలు వదులుకోకుండా తుదికంటా పోరాడిన క్రొయేషియా వెటరన్ టెన్నిస్ స్టార్ ఇవో కార్లోవిచ్ అనుకున్న ఫలితం సాధించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రోజు కార్లోవిచ్, రాసియో జెబలోస్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది. విజయం కోసం ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. దాంతో మ్యాచ్‌లో ఫలితం రావడానికి ఏకంగా 314 నిమిషాలు పట్టింది. ఈ మ్యాచ్‌లో చివరిదైన ఐదో సెట్ ఒక్కటే 177 నిమిషాలు జరగడం విశేషం. తుదకు తన అనుభవాన్నంతా రంగరించి ఆడిన కార్లోవిచ్కే విజయం దక్కింది. ఈ క్రమంలో మూడు రికార్డులు తెరమరుగయ్యాయి. మెల్బోర్న్: వరుసగా 14వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతోన్న క్రొయేషియా ఆజానుబాహుడు ఇవో కార్లోవిచ్ కాస్త అటుఇటు అయితే ఎనిమిదోసారి తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టేవాడు. కానీ 50వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న అతను తొలి రెండు సెట్లు కోల్పోయినా ఓటమి ఆలోచనను తన మదిలోకి రానీయలేదు. పోరాడితే పోయేదేముందీ అనుకుంటూ మూడో సెట్ నుంచి తన ప్రయత్నంలో మరింత జోరు పెంచాడు. అదే ఉత్సాహంలో వరుసగా మూడు సెట్లు గెలిచాడు. చివరకు 5 గంటల 14 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపించాడు. హోరాసియో జెబలోస్ (అర్జెంటీనా)తో మంగళవారం జరిగిన ఈ పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో కార్లోవిచ్ పోరాటపటిమ అందర్నీ ఆకట్టుకుంది. 20వ సీడ్‌గా బరిలోకి దిగిన కార్లోవిచ్ 6–7 (6/8), 3–6, 7–5, 6–2, 22–20తో ప్రపంచ 69వ ర్యాంకర్ జెబలోస్ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క ఐదో సెట్టే 2 గంటల 57 నిమిషాలు జరగడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన ఐదో సెట్ ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా 1972లో టైబ్రేక్ నిబంధన మొదలయ్యాక అత్యధిక గేమ్‌లు (84) జరిగిన మ్యాచ్‌గానూ ఈ మ్యాచ్ నిలిచింది. 2003లో ఆండీ రాడిక్ (అమెరికా), యూనెస్ అల్ అయనూయి (మొరాకో) మధ్య జరిగిన మ్యాచ్‌లో 83 గేమ్‌లు జరిగాయి. అయితే సుదీర్ఘ సమయంపాటు జరిగిన మ్యాచ్ రికార్డును కార్లోవిచ్, జెబలోస్ బ్రేక్ చేయలేకపోయారు. జొకోవిచ్, నాదల్ మధ్య జరిగిన 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ 5 గంటల 53 నిమిషాలు జరిగింది. ఏస్‌లతో అదరగొట్టి... 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 105 కేజీల బరువున్న 37 ఏళ్ల కార్లోవిచ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 75 ఏస్‌లు సంధించాడు. తద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు కొట్టిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు జోచిమ్ జొహాన్సన్ (స్వీడన్) పేరిట ఉండేది. 2005లో ఆండ్రీ అగస్సీ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో జొహాన్సన్ 51 ఏస్‌లు కొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 33 ఏస్‌లు కొట్టిన జెబలోస్ తొలి రెండు సెట్లు గెలిచి విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించాడు. కానీ మూడో సెట్లో కార్లోవిచ్ పుంజుకున్నాడు. జెబలోస్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి సెట్‌ను 7–5తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నాలుగో సెట్లో అదే జోరు కొనసాగించిన కార్లోవిచ్ ఈసారి రెండుసార్లు జెబలోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను 6–2తో దక్కించుకున్నాడు. అయితే ఐదో సెట్లో మాత్రం ఈ ఇద్దరూ కొదమ సింహాల్లా పోరాడారు. ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో మ్యాచ్ సుదీర్ఘంగా సాగింది. చివరకు 41వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని... 42వ గేమ్‌లో జెబలోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కార్లోవిచ్ చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకున్నాడు. సెరెనా శుభారంభం రికార్డుస్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడ్డంకిని సులువుగానే అధిగమించింది. ప్రపంచ మాజీ ఏడో ర్యాంకర్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సెరెనా 6–4, 6–3తో గెలుపొందింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఎనిమిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో సోరిబెస్ టోర్మో (స్పెయిన్)పై, మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6–1, 4–6, 6–1తో పిరన్కోవా (బల్గేరియా)పై, ఆరో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 7–5, 6–2తో అలెర్టోవా (చెక్ రిపబ్లిక్)పై, తొమ్మిదో సీడ్ జొహాన కొంటా (బ్రిటన్) 7–5, 6–2తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై నెగ్గారు. యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్, 18వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3–6, 6–3, 0–6తో హితెర్ వాట్సన్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయింది. జొకోవిచ్, నాదల్ సులువుగా... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) తొలి రౌండ్‌ను సాఫీగా అధిగమించారు. ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 6–1, 7–6 (7/4), 6–2తో గెలుపొందగా... తొమ్మిదో సీడ్ నాదల్ 6–3, 6–4, 6–4తో మాయెర్ (జర్మనీ)పై, రావ్‌నిచ్ 6–3, 6–4, 6–2తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై విజయం సాదించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–4, 4–6, 6–2, 4–6, 6–4తో ఒపెల్కా (అమెరికా)పై, 15వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 7–6 (7/2), 6–3, 6–3తో ఒకానెల్ (ఆస్ట్రేలియా)పై, ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా) 4–6, 6–4, 6–4, 6–3తో స్ట్రఫ్ (జర్మనీ)పై, ఆరో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 6–2, 6–3, 6–2తో వెసిలీ (చెక్ రిపబ్లిక్)పై, 13వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) 6–3, 6–1, 6–1తో పెలా (అర్జెంటీనా)పై నెగ్గారు. వెర్డాస్కోతో 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరుసార్లు తన ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మాయెర్తో రెండు గంటల నాలుగు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్ ఆరు ఏస్‌లు సంధించగా... ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వని నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. -
ముర్రే.. హిప్ హిప్ హుర్రే..!
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో తొలిసారి నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా అవతరించాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ద్వారా అతడు ఈ ఘనత వహించగా.. అధికారికంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకులలో ముర్రే టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 122 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న జొకోవిచ్ రెండో ర్యాంకుకు పడిపోయాడు. ముర్రే ఖాతాలో 11,185 పాయింట్లుండగా, జొకోవిచ్ ఖాతాలో 10,780 పాయింట్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టాన్ వావ్రింకా మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకూ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన సెర్బియా యోధుడు నొవాక్ జోకొవిచ్ ఈ టోర్నీలో క్వార్టర్స్ లో ఓడిపోవడం ముర్రేకు కలిసొచ్చింది. ఈ ఏడాది ఒలింపిక్స్ స్వర్ణంతో పాటు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. లండన్ ఒలింపిక్స్ లోనూ స్వర్ణం నెగ్గిన ముర్రే.. వరుసగా సింగిల్స్ లో రెండు స్వర్ణాలు నెగ్గిన టెన్నిస్ ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. -
ప్రపంచ నంబర్‌వన్‌గా ముర్రే
లండన్: బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే తన కెరీర్లోతొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించాడు. 122 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న జొకోవిచ్ పారిస్ టోర్నీ క్వార్టర్స్‌లో ఓడిపోవడం ముర్రేకు కలిసొచ్చింది. -
16 ఏళ్లకే ఆమెకు స్టార్ డమ్ ఎలా వచ్చింది?
హైదరాబాద్/న్యూఢిల్లీ: పట్టుమని పదహారేళ్లైనా నిండకముందే టెన్నిస్ ప్లేయర్ గా స్టార్ డమ్ సంపాదించుకుంది సానియా మిర్జా. ఏ రేంజ్ లో కష్టపడితే అంత చిన్నవయసులోనే అంత పేరు సాధించిందామె? ఆ దిశగా ఇన్ స్పైర్ చేసింది ఎవరు? అన్నింటికన్నా మించి, స్టార్ గా ఎదిగిన తర్వాత కెరీర్ ను నిలబెట్టుకోగలగడం, పాకిస్థానీతో పెళ్లి విషయంలో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే మెంటల్ బ్యాలెన్స్ ఎలా సాధించింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జులైలో సమాధానాలు తెలియనున్నాయి. సానియా మిర్జా బయోగ్రఫీ 'ఏస్ ఎగనెస్ట్ ఆడ్స్' ను జులైలో విడుదల చేయనున్నట్లు ప్రపంచ ప్రఖ్యాత పబ్లిషర్స్ హార్పర్ కొలిన్స్ బుధవారం వెల్లడించింది. 'దాదాపు గుర్తెరిగినప్పటి నుంచి చేతిలో టెన్నిస్ రాకెట్ మాత్రమే పట్టుకున్న సానియా దాన్ని పక్కన పెట్టి మొదటిసారి పెన్ పట్టుకుని, తండ్రి ఇమ్రాన్ మిర్జా సహకారంతో ఆత్మకథ రాశారు. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అడ్డంకులు, వాటిని అధిగమించిన తీరు, సాధించిన విజయాల వెనుక రహస్యాలు.. అన్నీ పుస్తకంలో రాసినట్లు, భవిష్యత్ లో క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారికి ఇన్ స్పిరేషనల్ బుక్ గా రూపొందించినట్లు సానియా చెప్పారు. ఇండియా నంబర్ వన్ మాత్రమేకాదు.. వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సానియా ఆటోబయోగ్రఫీని పబ్లిష్ చేసే అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నమని, జులై నుంచి అన్ని పుస్తక దుకాణాల్లో 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' అందుబాటులో ఉంచుతామని హూపర్ కొలిన్స్ (ఇండియా) చీఫ్ ఎడిటర్ కార్తిక అన్నారు. ఈ పుస్తకం ఆధారంగా సానియా జీవితంపై ఓ సినిమా కూడా రూపొందించాలని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఇంత బాగా ఇక ఆడలేనేమో..!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ ఏడాది అద్భుతంగా కలిసి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు తొమ్మిది టైటిళ్లు సాధించడమే కాకుండా డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును సైతం సొం తం చేసుకుంది. అయితే మున్ముందు ఇలాంటి ఫీట్‌ను పునరావృతం చేయడం కష్టమేనని భావిస్తోంది. ‘వచ్చే ఏడాది కూడా ఇలాంటి ఆటతీరునే కనబరుస్తానని ఆశిస్తున్నాను. అయితే ఇంతకన్నా మెరుగైన ఫలితాలు సాధించడం కష్టమే. అయితే ఈ ఏడాది కూడా ఇలాంటి విజయాలు వస్తాయని ఎవరూహించారు? హింగిస్‌తో కలిసి మరో స్లామ్ గెలిస్తే అద్భుతంగా ఉంటుంది. నిజానికి ఈ ఏడాదే కాకుండా మొత్తం నా కెరీర్ కూడా ఆసక్తికరమే. గత కొన్నేళ్లుగా అంతా మంచే జరుగుతోంది. కొన్నేళ్ల కఠోర శ్రమ ఇప్పుడు ఫలితాలనిస్తోంది. అభిమానులు, మీడియా కూడా చాలా ప్రోత్సాహాన్ని అందించారు’ అని సానియా మీర్జా గుర్తుచేసుకుంది. సానియా అకాడమీలో ఎగ్జిబిషన్ మ్యాచ్ భారత్‌లో టెన్నిస్‌కు మరింత ఖ్యాతిని తీసుకొచ్చేందుకు దిగ్గజ ఆటగాళ్లు కలిసి ఆడనున్న మూడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో ఒకటి హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతుంది. ఈనెల 25న తొలి మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతుం డగా 26న జరిగే రెండో మ్యాచ్‌కు స్థానిక సానియా అకాడమీ వేదిక కానుంది. ఈ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్-నవ్రతిలోవా ఓ జంటగా.. మహేశ్ భూపతి-సానియా మరో జంటగా ఆడనున్నారు. -
సానియాకు ‘ఖేల్ రత్న'!
క్రీడా మంత్రిత్వ శాఖ యోచన న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో అద్వితీయ విజయాలు సాధిస్తోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు సిఫారసు చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. గత ఏప్రిల్‌లో మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించి... ఇటీవల వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌నూ నెగ్గి చరిత్ర సృష్టించిన సానియా ఇప్పటివరకు ఈ అవార్డుకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోలేదు. అయితే నిబంధనల ప్రకారం క్రీడా మంత్రిత్వ శాఖ అర్హత ఉన్న వారి ఎవరి పేరునైనా ఈ అవార్డుకు సిఫారసు చేసే వీలుంది. సానియా గతేడాది ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేనితో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం, ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించింది. అంతేకాకుండా బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ‘ఖేల్త్న్ర’ అవార్డు విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ తెలిపారు. -
జేమ్స్‌బాండ్ సినిమాలో సానియా మీర్జా?
ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా.. జేమ్స్‌బాండ్ సినిమాలో నటించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సానియానే తన ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. తాను 'బాండింగ్'తో ముందుకెళ్తున్నానని, అందరి శుభాకాంక్షలు తనకు కావాలని చెప్పింది. ఈ విషయం నలుగురికీ తెలియజేయకుండా ఉండలేకపోతున్నానని కూడా అందులో రాసింది. ఇంతకుముందు కూడా క్రీడాకారులు సినిమాల్లో నటించిన సందర్భాలున్నాయి. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ పాటలో మెరిశారు. పరుగుల రాణి అశ్వనీనాచప్ప తన జీవితగాధ ఆధారంగా తీసిన సినిమాలో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు సానియా మీర్జా వంతు వచ్చింది. త్వరలోనే మన సానియాను వెండితెర మీద చూసే అవకాశం ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు వస్తుందన్నమాట. Truly irresistible. Mirza Sania Mirza ;-) Going ahead with BONDing. Need ur good wishes. #BONDingwithBond — Sania Mirza (@MirzaSania) November 11, 2014 -
స్కూలు కెళ్లిన సానియా మీర్జా
-
‘మాడ్రిడ్’ దత్తపుత్రుడిగా నాదల్
మాడ్రిడ్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్‌ను మాడ్రిడ్ సిటీ తమ దత్తపుత్రుడిగా ప్రకటించింది. ఎవరినైనా దత్తపుత్రుడిగాగాని, పుత్రికగాగాని స్వీక రించడమన్నది మాడ్రిడ్ సిటీ దృష్టిలో అతిపెద్ద అవార్డు. గత ఏడాది ఇందుకు జరిగిన ఓటింగ్‌లో నాదల్ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో నాదల్కు మాడ్రిడ్ సిటీ మేయర్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నాదల్ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థులంటే తనకు గౌరవమని, వారి నుంచి ఆటకు సంబంధించిన విషయాలేగాక జీవితానికి సంబంధించిన విషయాలనూ నేర్చుకున్నానన్నాడు. -
‘సోగ్గాడి’ విజయం వెనక....
ఆండ్రీ అగస్సీ... ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన టెన్నిస్ స్టార్. సోగ్గాడుగా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. స్టెఫీగ్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలో అన్ని మూలలా పెద్ద సెలబ్రిటీ హోదా... కానీ వీటన్నింటి వెనక, ఈ విజయం వెనక పెద్ద కష్టాన్నే అధిగమించిన ధైర్యం, ధీరత్వం ఉన్నాయి. అందరికీ తెలిసిన అగస్సీ అరుదైన కెరీర్‌స్లామ్ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు. తన ఆటతీరుతోనేగాక, భిన్నమైన ఆహార్యంతో అభిమానుల్ని అలరించిన అందగాడు. కానీ.. అగస్సీ జీవితంలో మరో కోణముంది. అదే.. స్పాండిలిస్తియాసిస్. ఈ వ్యాధి ఉన్నవారికి వెన్నెముక కింది భాగాన ఉన్న నరాల మధ్య గ్యాప్ తక్కువగా ఉండి, నడుస్తున్నప్పుడు నరాలు ఒకదానికొకటి తగిలి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. నిటారుగా నిలబడలేరు. చక్కగా నడవలేరు. ఇక గెంతడం, పరుగులు పెట్టడం గురించి చెప్పాల్సిన పనేలేదు. క్రీడాకారుడు కావాలనుకున్న ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్లు తెలిస్తే సహజంగా ఆ ఆలోచనే విరమించుకుంటారు. బుద్ధిగా చదువుకొని ఏ ఉద్యోగంలోనో స్థిరపడాలనుకుంటారు. కానీ, అగస్సీ అలా చేయలేదు. కసితో ముందుకు సాగాడు. కఠోర సాధనతో సమస్యను దూరంగా పారదోలాడు. పసి ప్రాయంలోనే.. మాజీ బాక్సింగ్ చాంపియన్ మైక్ అగస్సీకి ముగ్గురు సంతానంలో చిన్నవాడిగా జన్మించిన ఆండ్రీ అగస్సీని టెన్నిస్ స్టార్ చేయాలని చిన్నప్పుడే నిర్ణయించాడు తండ్రి. ఇందుకోసం పసిప్రాయంలోనే రాకెట్ చేతికందించాడు. బాలుడైన ఆండ్రీతో సామర్థ్యానికి మించిన కసరత్తులు చేయించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే అతని కన్నా ఎన్నో ఏళ్లు పెద్దవారైన ఆటగాళ్లతో ఆడించాడు. బహుశా! ఇంతటి కఠినమైన పరిస్థితులే ఆండ్రీని రాటుదేల్చివుంటాయేమో. 13 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు టెన్నిస్ కోచింగ్ అకాడమీలో చేరాడు. అక్కడ అగస్సీ ఆటతీరు గమనించిన శిక్షకుడు అతనికి ఫీజు కూడా అక్కర్లేదని ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. అకాడమీ నుంచి బయటికి వచ్చాక జూనియర్ స్థాయి నుంచి 1986లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారాడు. ఆ ప్రస్థానం 2006 వరకు సాగింది. కానీ, ఈ ఇరవై ఏళ్ల కెరీర్లో అగస్సీ ముళ్లబాటలోనే నడిచాడు. నిద్రలేని రాత్రులు.. 16 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ఆటగాడిగా.. ఆడిన తొలిమ్యాచ్‌లోనే విజయం సాధించిన అగస్సీ ఆపై ఎన్నో విజయాలు చవిచూశాడు. దిగ్గజాలను ఓడించిన ఆనందం వెనుక ఎంతో విషాదం ఉంది. స్పాండిలోలైతిస్ కారణంగా వచ్చే నొప్పితో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా ఏం చేసినా భరించలేని నొప్పి. రాత్రిపూట బెడ్‌పై ఎక్కువసేపు పడుకోలేకపోయేవాడు. మధ్యరాత్రి నేలపైకి మారేవాడు. తలను చిన్నపిల్లాడిలా పొట్టలో పెట్టుకొని దగ్గరికి ముడుచుకునేవాడు. తెల్లవారితే ఒక్కసారిగా లేవలేకపోయేవాడు. అందుకోసం వన్, టూ, త్రీ.. అంటూ అంకెలు లెక్కపెట్టుకొని శక్తినంతా కూడదీసుకొని లేచి నిలబడేవాడు. ఆపై ప్రతి పనికీ ముందు అగస్సీ తన శరీరంతో పెద్ద కుస్తీయే పట్టాల్సివచ్చేది. అలాంటి స్థితి నుంచి కోర్టులో అడుగుపెట్టాక తనదైన షాట్లతో విరుచుకుపడేవాడు. కోర్టులో ఎక్కువగా వెనక్కి జరుగుతూ ఆడడం ద్వారా తన లోపాన్ని అధిగమించేవాడు. ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన అగస్సీకి ఈ సమస్య ఉన్నట్లు ఎవరికీ తెలియలేదు. చివరికి 2006లో యూఎస్ ఓపెన్ మూడోరౌండ్లో ఓడిపోయి రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా తానే స్వయంగా ఈ విషయం వెల్లడించాడు. - కంచర్ల శ్యాంసుందర్ -
ముర్రేకు పురస్కారం
లండన్: 77 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది బ్రిటన్ తరఫున ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆండీ ముర్రేకు ‘బీబీసీ’ వార్షిక ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం లభించింది. ప్రస్తుతం మియామిలో శిక్షణ తీసుకుంటున్న ముర్రేకు మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఈ అవార్డును అందజేసింది. ఈ పురస్కారం రేసులో అథ్లెట్ మో ఫరా... ‘టూర్ డి ఫ్రాన్స్’ విజేత క్రిస్ ఫ్రూమ్... యూఎస్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్ జస్టిన్ రోస్ నిలిచినప్పటికీ ముర్రే ఘనతకే ఎక్కువ మంది మొగ్గు చూపారు. -
హ్యాపీ మూడ్‌లో సానియా మీర్జా
-
25వ సారి డబుల్స్ ఫైనల్‌కు
న్యూ హెవెన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్ లో మరో మైలురాయిని అధిగమించింది. న్యూ హెవెన్ ఓపెన్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించడం ద్వారా డబ్ల్యూటీఏ డబుల్స్ ఈవెంట్లో 25వ సారి ఫైనల్‌కు చేరిన భారత క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది. జీ జెంగ్‌తో కలిసి మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సానియా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 6-3, 6-3తో సిల్వియా సొలెర్- కార్ల సూరెజ్ (స్పెయిన్) జంటపై గెలుపొందింది. ఇప్పటివరకూ సానియా ఆడిన 24 డబుల్స్ ఫైనల్స్‌లో 16 సార్లు విజేతగా నిలిచింది.