
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ దివిజ్ శరణ్ కెరీర్‌లో ఐదో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్‌బర్గ్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో తన భాగస్వామి ఇగోర్ జెలెనె (స్లొవేకియా)తో కలిసి దివిజ్ శరణ్ విజేతగా నిలిచాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ శరణ్–జెలెనె ద్వయం 6–3, 3–6, 10–8తో బెరెటిని–బొలెలీ (ఇటలీ) జోడీపై నెగ్గింది. విజేతగా నిలిచిన దివిజ్ జంటకు 66,740 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 47 లక్షల 44 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో దివిజ్ పుణే ఓపెన్ (2019), యాంట్‌వర్ప్ ఓపెన్ (2017), లాస్ కాబోస్ ఓపెన్ (2016), బొగోటా ఓపెన్ (2013)లలో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment