Divij Sharan
-
భారత డేవిస్ జట్టులో నగాల్‌కు చోటు
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టులోకి సుమిత్ నగాల్ తిరిగి ఎంపికయ్యాడు. గతేడాది మార్చిలో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో పోటీపడిన నగాల్ తర్వాత డేవిస్ బరిలో దిగలేదు. తుంటి గాయంతో గత సెప్టెంబర్‌లో ఫిన్లాండ్తో జరిగిన పోరుకు దూరమయ్యాడు. నవంబర్‌లో శస్త్ర చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకోవడంతో ఈ ఏడాది మార్చిలో డెన్మార్క్తోనూ బరిలోకి దిగలేకపోయాడు. ఏప్రిల్‌లో ఏటీపీ సర్క్యూట్లో ఆడటం మొదలుపెట్టిన 24 ఏళ్ల హరియాణా టెన్నిస్ స్టార్ సుమిత్ ఈ సీజన్లో ఎనిమిది టోర్నీల్లో తలపడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాడు. సుమిత్ డేవిస్ జట్టులోకి రావడంతో డబుల్స్ స్పెషలిస్టు దివిజ్ శరణ్‌ను పక్కన బెట్టారు. వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా సెప్టెంబర్ 16, 17 తేదీల్లో నార్వేతో భారత్ తలపడుతుంది. మ్యాచ్‌లు నార్వేలో జరుగుతాయి. రోహిత్ రాజ్‌పాల్ సారథ్యంలో ఆరుగురు సభ్యుల భారత డేవిస్ జట్టును గురువారం ఎంపిక చేశారు. రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గునేశ్వరన్, యూకీ బాంబ్రీ, శశికుమార్ ముకుంద్‌లతో పాటు వెటరన్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న భారత జట్టుకు ఎంపికయ్యారు. భారత్, నార్వే జట్లు తలపడటం డేవిస్ కప్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే–ఆఫ్‌లో భారత్ 4–0తో డెన్మార్క్‌పై ఘనవిజయం సాధించింది. -
పురుషుల డబుల్స్‌లో భారత్‌కు దక్కని ‘టోక్యో’ బెర్త్
న్యూఢిల్లీ: పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత జోడీ రోహన్ బోపన్న–దివిజ్ శరణ్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. డబుల్స్ కంబైన్డ్ ర్యాంకింగ్స్‌లో బోపన్న (38), దివిజ్ శరణ్ (75) జోడీ 113వ ర్యాంక్‌లో ఉంది. టాప్–24 జోడీలకు మాత్రమే టోక్యో బెర్త్‌లు లభిస్తాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని భారీ సంఖ్యలో క్రీడాకారులు వైదొలిగితే తప్ప బోపన్న–దివిజ్ జంటకు టోక్యోలో ఆడే అవకాశం లేనట్టే. 1988 సియోల్ ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతీ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. పురుషుల డబుల్స్‌లో ఈసారి భారత ప్రాతినిధ్యం లేకపోవడంతో మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా బరిలో దిగే చాన్స్ లేకుండాపోయింది. సానియా ఇక మహిళల డబుల్స్‌లో మాత్రమే పోటీపడనుంది. -
‘అర్జున’ బరిలో అంకిత, దివిజ్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు అంకితా రైనా, దివిజ్ శరణ్ కేంద్ర ప్రభుత్వ పురస్కారం ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నారు. 2018 ఆసియా క్రీడల పతక విజేతలైన వీరిద్దరి పేర్లను అర్జున అవార్డు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సిఫారసు చేయనుంది. వీరిద్దరితో పాటు భారత డేవిస్ కప్ మాజీ కోచ్ నందన్ బాల్ పేరును ధ్యాన్‌చంద్ అవార్డు కోసం ‘ఐటా’ నామినేట్ చేయనున్నట్లు సమాచారం. -
దివిజ్, బోపన్నజోడీలు ఓటమి
టోక్యో: జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డబుల్స్ అగ్రశ్రేణి క్రీడాకారులు దివిజ్ శరణ్, రోహన్ బోపన్న జోడీలకు ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో దివిజ్ శరణ్–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట 6–7 (5/7), 3–6తో రెండో సీడ్ నికొలస్ మహుట్–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో... రోహన్ బోపన్న–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ 4–6, 7–5, 9–11తో నికోలా మెక్టిక్–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయాయి. క్వార్టర్స్‌లో ఓడిన దివిజ్, బోపన్న జంటలకు 15,500 డాలర్ల (రూ. 11 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
దివిజ్‌కు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ దివిజ్ శరణ్ కెరీర్లో ఐదో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో తన భాగస్వామి ఇగోర్ జెలెనె (స్లొవేకియా)తో కలిసి దివిజ్ శరణ్ విజేతగా నిలిచాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ శరణ్–జెలెనె ద్వయం 6–3, 3–6, 10–8తో బెరెటిని–బొలెలీ (ఇటలీ) జోడీపై నెగ్గింది. విజేతగా నిలిచిన దివిజ్ జంటకు 66,740 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 47 లక్షల 44 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో దివిజ్ పుణే ఓపెన్ (2019), యాంట్‌వర్ప్ ఓపెన్ (2017), లాస్ కాబోస్ ఓపెన్ (2016), బొగోటా ఓపెన్ (2013)లలో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. -
పోరాడి ఓడిన దివిజ్–ఎల్రిచ్ జంట
న్యూఢిల్లీ: అట్లాంటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో జంటగా 100 కంటే ఎక్కవ టైటిల్స్ నెగ్గిన అమెరికా కవల సోదరులు బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్‌లకు దివిజ్–ఎల్రిచ్ జోడీ చివరి క్షణం వరకు గట్టిపోటీనిచ్చింది. కానీ అపార అనుభవమున్న బ్రయాన్ బ్రదర్స్ కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దివిజ్ శరణ్–ఎల్రిచ్ జోడీ 4–6, 7–6 (7/4), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్ జంట చేతిలో పోరాడి ఓడింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్ జంట ఏడు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. క్వార్టర్స్‌లో ఓటమితో దివిజ్–ఎల్రిచ్‌లకు 6,240 డాలర్ల (రూ. 4 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రన్నరప్ దివిజ్ జంట
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో తన భాగస్వామి మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)తో కలిసి భారత టెన్నిస్ స్టార్ దివిజ్ శరణ్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 4–6, 2–6తో ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్)–టిమ్ పుయెట్జ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్ దివిజ్ జంటకు 15,200 యూరోల (రూ. 11 లక్షల 78 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో దివిజ్ శరణ్ జంట
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన భాగస్వామి మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 6–3, 3–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా)–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్ జంట రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసినా కీలకదశలో పాయింట్లు గెలవడంలో సఫలమైంది. తొలి సెట్లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన దివిజ్ జంట... రెండో సెట్లో తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం దివిజ్ ద్వయం ఒక్కసారిగా విజృంభించి 9–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి ఆ తర్వాత విజయానికి అవసరమైన ఒక పాయింట్‌ను నెగ్గి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దివిజ్ కెరీర్లో ఏటీపీ టోర్నీలో ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గిన అతను, మరోసారి రన్నరప్‌గా నిలిచాడు. -
సెమీస్‌లో దివిజ్ జంట
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. జర్మనీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 4–6, 6–3, 10–8తో కెవిన్ క్రావిట్జ్–ఆండ్రియా మీస్ (జర్మనీ) జంటపై గెలుపొందింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన దివిజ్ జంట రెండో సెట్లో ఒకసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత తమ సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సంయమనంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో ఫిలిప్ ఓస్వాల్ (ఆస్ట్రియా)–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జంటతో దివిజ్–మార్సెలో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో ఓస్వాల్డ్–పావిక్ 6–4, 6–4తో మూడో సీడ్ కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్)లపై గెలిచారు. -
దివిజ్, బోపన్న జోడీలకు నిరాశ
న్యూఢిల్లీ: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్ల పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. మొనాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత డబుల్స్ టాప్ ర్యాంకర్ రోహన్ బోపన్న... రెండో ర్యాంకర్ దివిజ్ శరణ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. దివిజ్ శరణ్–లాస్లో జెరి (సెర్బియా) జంట 2–6, 1–6తో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో... బోపన్న–డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) ద్వయం 6–4, 3–6, 11–13తో మూడో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)–బ్రూనో సొరెస్ (బ్రెజిల్) జంట చేతిలో ఓడిపోయాయి. తొలి రౌండ్లో ఓడిన దివిజ్, బోపన్న జోడీలకు 10,020 యూరోలు (రూ. 7 లక్షల 87 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
విజేత బోపన్న–దివిజ్ జంట
పుణే: ప్రొఫెషనల్ సర్క్యూట్లో జతకట్టిన తొలిసారే భారత టెన్నిస్ డబుల్స్ స్టార్స్ రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. శనివారం ముగిసిన టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ బోపన్న–దివిజ్ జోడీ విజేతగా నిలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–దివిజ్ ద్వయం 6–3, 6–4తో ల్యూక్ బాంబ్రిడ్జ్–జానీ ఒమారా (బ్రిటన్) జోడీపై గెలిచింది. భారత జంట మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్లో ఇది 18వ డబుల్స్ టైటిల్‌కాగా... దివిజ్ శరణ్‌కు నాలుగోది. స్వదేశంలో మాత్రం దివిజ్‌కిదే తొలి టైటిల్ కావడం విశేషం. టైటిల్ నెగ్గిన బోపన్న–దివిజ్ జంటకు 29,860 డాలర్ల (రూ. 20 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో ఈ భారత జంట క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్‌లో మారథాన్ సూపర్ టైబ్రేక్‌లలో విజయం సాధించింది. పేస్–వరేలాలతో క్వార్టర్స్ మ్యాచ్‌లో మూడో సెట్‌ను 17–15తో... బోలెలీ–డోడిగ్‌లతో జరిగిన సెమీస్‌లో 15–13తో భారత జంట గెలిచింది. తాజా విజయం వచ్చే వారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు ముందు కావాల్సినంత ఆత్మ విశ్వాసం ఇచ్చిందని 38 ఏళ్ల బోపన్న వ్యాఖ్యానించాడు. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో బోపన్న–దివిజ్ జంట స్వర్ణ పతకం నెగ్గిన అనంతరం 2020 టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ జతకలిసి ఆడాలని నిర్ణయం తీసుకున్నారు. -
టాటా ఓపెన్ ఫైనల్లో దివిజ్–బోపన్న జంట
పుణే: ఈ ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించేందుకు భారత టెన్నిస్ జంట దివిజ్ శరణ్–రోహన్ బోపన్న విజయం దూరంలో నిలిచింది. టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో దివిజ్–బోపన్న ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ దివిజ్–బోపన్న జంట 6–3, 3–6, 15–13తో ‘సూపర్ టైబ్రేక్’లో సిమోన్ బొలెలీ (ఇటలీ)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నేడు జరిగే ఫైనల్లో ల్యూక్ బాంబ్రిడ్జ్–జానీ ఒమారా (బ్రిటన్)లతో దివిజ్–బోపన్న తలపడతారు. -
బోపన్న జోడీ ఓటమి
పారిస్: ఏటీపీ మాస్టర్స్ టోర్నీ పారిస్ ఓపెన్ డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్లు రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లకు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో రోహన్ బోపన్న–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ 6–7, 3–6 తో ఒలివర్ (ఆస్ట్రియా)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంట చేతి లో ఓడింది. దివిజ్ శరణ్–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) ద్వయం 4–6, 3–6తో మైక్ బ్రయన్–జాక్ సోక్ (అమెరికా) చేతిలో ఓడింది. సెమీస్‌లో సాకేత్ జోడి... మరోవైపు షెన్జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీ ఫైనల్ చేరింది. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జోడీ 6–4, 6–3తో రిగలె టి–డీ వూ (చైనా) జంటపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. మరో క్వార్టర్స్‌లో అర్జున్ కడే (భారత్)–సంచయ్ రతివతన (థాయ్‌లాండ్) ద్వయం 6–7, 7–5, 10–2తో యిన్ పెంగ్ (తైవాన్) సోంచట్ రతివతన (థాయ్‌లాండ్) జంటపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. -
దివిజ్ శరణ్–సితాక్ జంట శుభారంభం
పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పారిస్‌లో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్–సితాక్ ద్వయం 6–4, 6–3తో ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రెండో రౌండ్లో మైక్ బ్రయాన్–జాక్ సోక్ (అమెరికా) ద్వయంతో దివిజ్–సితాక్ జోడీ తలపడుతుంది. -
బోపన్న–దివిజ్ జంటకు స్వర్ణం
పాలెంబాంగ్: టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ ఆసియా క్రీడల టెన్నిస్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–దివిజ్ జోడీ 6–3, 6–4తో అలెగ్జాండర్ బుబ్లిక్–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) ద్వయంపై గెలుపొందింది. తమ కెరీర్లో తొలిసారి ఏషియాడ్ డబుల్స్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. సెమీఫైనల్లో ప్రజ్నేశ్ 2–6, 2–6తో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో దివిజ్ జంట ఓటమి
వాషింగ్టన్: సిటీ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ దివిజ్–సితాక్ ద్వయం 6–4, 1–6, 5–10తో నాలుగో సీడ్ జేమీ ముర్రే (ఇంగ్లండ్)–బ్రూనో సొరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్ జంట రెండు ఏస్‌లు సంధించి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన దివిజ్ జోడీకి 14,580 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్స్‌లో దివిజ్ శరణ్ జంట
న్యూఢిల్లీ: అమెరికాలో జరుగుతున్న సిటీ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో దివిజ్ శరణ్ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ చేరింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్–ఆర్టెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట 7–6 (7/2), 3–6, 10–7తో లియాండర్ పేస్ (భారత్)–సెరెటాని (అమెరికా) జోడీపై ‘సూపర్ టైబ్రేక్’లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరుగనున్న క్వార్టర్స్‌లో దివిజ్–సితాక్ జంట జేమీ ముర్రే, (ఇంగ్లండ్)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్) ద్వయంతో తలపడనుంది. -
అవసరమైతే వస్తా...
న్యూఢిల్లీ: తుది జట్టులో ఆడే అవకాశం లేకపోవడం తో... ఆ సమయాన్ని అమెరికాలో ప్రాక్టీస్ చేసుకునేందుకు కేటాయించాలని భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ నిర్ణయించుకున్నాడు. ఫలితంగా ఈనెల 6, 7 తేదీల్లో చైనాతో జరిగే డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ ఆడేందుకు చైనా వెళ్లడం లేదని తెలిపాడు. డబుల్స్‌లో లియాండర్ పేస్–బోపన్న జంట బరిలోకి దిగడం ఖాయం కాబట్టి దివిజ్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రావడం కష్టమే. ఈ మేరకు దివిజ్ తన నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) అధికారులకు తెలపగా... వారు దానికి అంగీకరించారు. తన అవసరం ఉంటే వెంటనే చైనాకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నానని దివిజ్ తెలిపాడు. -
డబుల్స్ విజేత దివిజ్ జోడి
బెంగళూరు: భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)–ఎల్గిన్ (రష్యా) జోడి 6–3, 6–0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్–మాటెజ్ సబనోవ్‌పై విజయం సాధించింది. యూకీ బాంబ్రీకి షాక్ భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ జోరు బెంగళూరు ఓపెన్‌లోనూ కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సహచరుడు, టాప్ సింగిల్స్ ప్లేయర్ యుకీ బాంబ్రీపై 6–4, 6–0తో విజయం సాధించి నాగల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన జే క్లార్క్‌తో నాగల్ తలపడనున్నాడు. ఈ మ్యాచ్ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో చోటు దక్కించుకోవాలనుకున్న బాంబ్రీ ఆశలు సన్నగిల్లాయి. -
దివిజ్ జంటకు టైటిల్
యాంట్‌వర్ప్ (బెల్జియం): భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన కెరీర్లో మూడో ఏటీపీ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూరోపియన్ ఓపెన్ ట్రోఫీ టోర్నీలో తన భాగస్వామి స్కాట్ లిప్స్కీ (అమెరికా)తో కలిసి దివిజ్ శరణ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో దివిజ్ శరణ్–స్కాట్ లిప్స్కీ ద్వయం 6–4, 2–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–జూలియో పెరాల్టా (చిలీ) జోడీపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన దివిజ్–లిప్స్కీ జంటకు 31,910 యూరోల (రూ. 24 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
చెన్నై ఓపెన్ ఫైనల్లో దివిజ్–పురవ్ జోడీ
చెన్నై: స్వదేశంలో తొలి ఏటీపీ డబుల్స్ టైటిల్ గెలిచేందుకు దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జంట మరింత చేరువైంది. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఈ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా ద్వయం 6–4, 6–2తో గిలెర్మె దురాన్–ఆండ్రీస్ మోల్తెని (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది. గతంలో దివిజ్–పురవ్ బొగోటా ఓపెన్ (2013లో), లాస్ కబోస్ ఓపెన్ (2016లో) టోర్నీలలో విజేతగా నిలిచారు. శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో రోహన్ బోపన్న–జీవన్ (భారత్) జంట నికొలస్ మోన్రో (అమెరికా)–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీతో ఆడుతుంది. -
క్వార్టర్స్‌లో దివిజ్ జోడి
తాష్కెంట్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్-పురవ్ జంట 5-7, 6-3, 10-3తో ఆండ్రియా అర్నాబోల్డి-ఫాబియాన్ (ఇటలీ) ద్వయంపై విజయం సాధించింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మాలిక్ జజారీ (టర్కీ)-దస్తోవ్ (ఉజ్బెకిస్థాన్) జోడితో దివిజ్-పురవ్ తలపడతారు.