
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో తన భాగస్వామి మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)తో కలిసి భారత టెన్నిస్ స్టార్ దివిజ్ శరణ్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 4–6, 2–6తో ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్)–టిమ్ పుయెట్జ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్ దివిజ్ జంటకు 15,200 యూరోల (రూ. 11 లక్షల 78 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment