
ఇటాలియన్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సానియా జోడీతో ఆడాల్సిన రిబకినా (కజకిస్తాన్)–సమ్‌సోనోవా (రష్యా) ద్వయం గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో ఇండో–చెక్ జంటను విజేతగా ప్రకటించారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–7 (3/7), 3–6తో కూలాఫ్ (నెదర్లాండ్స్)–స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment