క్వార్టర్స్‌లో సానియా జోడి | sania mirza entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జోడి

Published Thu, May 8 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

క్వార్టర్స్‌లో సానియా జోడి

క్వార్టర్స్‌లో సానియా జోడి

మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్
 మాడ్రిడ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాడ్రిడ్ ఓపెన్ టోర్నీ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.  బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో ఐదో సీడ్ సానియా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 6-4, 6-1 తేడాతో హావ్ చింగ్ చాన్ (చైనీస్ తైపీ)-చానెలే షీపర్స్ (చైనా) జంటపై వరుస సెట్లలో గెలుపొందింది.
 
 ఇటీవలే పోర్చుగల్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని ఊపుమీదున్న సానియా ద్వయం తొలి సెట్‌లో ఒక దశలో 4-1తో దూసుకెళ్లింది. అయితే చాన్-షీపర్స్ జోడి పోరాట పటిమ కనబరిచి ఆధిక్యాన్ని 3-4కు తగ్గించింది. తిరిగి పట్టు సాధించిన సానియా-కారా ద్వయం తొలిసెట్‌లో నెగ్గడంతోపాటు రెండో సెట్‌ను అలవోకగా కైవసం చేసుకొని మ్యాచ్‌ను గెలుపొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement