
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు అంకితా రైనా, దివిజ్ శరణ్ కేంద్ర ప్రభుత్వ పురస్కారం ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నారు. 2018 ఆసియా క్రీడల పతక విజేతలైన వీరిద్దరి పేర్లను అర్జున అవార్డు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సిఫారసు చేయనుంది. వీరిద్దరితో పాటు భారత డేవిస్ కప్ మాజీ కోచ్ నందన్ బాల్ పేరును ధ్యాన్‌చంద్ అవార్డు కోసం ‘ఐటా’ నామినేట్ చేయనున్నట్లు సమాచారం.